NewsOrbit
న్యూస్

YSRCP : మృతదేహానికి పింఛన్ ఏంటి? బొంద కాకపోతే??

YSRCP : మృతదేహానికి పింఛన్ ఏంటి? బొంద కాకపోతే??

YSRCP : మృతదేహం వద్దకు వెళ్లి, ఆ మృతదేహం తాలూకా పింఛను గ్రామ వాలంటీర్ ఇవ్వడం సోమవారం అంతా సోషల్ మీడియాలో వైరల్ అయింది. విజయనగరం జిల్లా గుర్ల మండలం లోని గుర్ల గ్రామంలో ఎర్ర నారాయణమ్మ అనే వృద్ధురాలు సోమవారం ఉదయం మరణించింది. ప్రతి నెల ఒకటవ తేదీన రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా నేరుగా ఇంటి వద్దకే వృద్ధులకు పింఛన్ అందజేస్తోంది. సోమవారం ఒకటో తేదీ కావడంతో ఆ గ్రామ వాలంటీర్ గా పని చేస్తున్నా త్రినాద్ పింఛన్లు పంపిణీ చేసేందుకు నారాయణమ్మ ఇంటికి వెళ్లారు. అప్పటికే ఆమె మృతి చెందగా మృతదేహాన్ని బయట ఉంచి కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన త్రినాథ్ పింఛన్ అప్పటికే మంజూరు అయింది కాబట్టి దానిని ఇవ్వడం తన విధి అంటూ మృతదేహం తోనే వేలిముద్ర వేయించి కుటుంబ సభ్యులకు అందజేయడం ఇప్పుడు పెద్ద వివాదం అవుతోంది. చనిపోయిన వృద్ధురాలికి పింఛన్ ఇస్తున్నట్లు వేలిముద్రలు తీసుకుని సోషల్ మీడియాలో పెట్టడం పెద్ద కలకలం రేపుతుంది.

dead body sent pension
dead body sent pension

అసలు ఇవ్వొచ్చా.. నిబంధనలు ఒప్పుకుంటాయా??

చనిపోయిన వారికి పెన్షన్ ఇతర పథకాలు ఇవ్వడానికి నిబంధనలు అంగీకరించవు. చనిపోయిన వ్యక్తికి పెన్షన్ పంపిణీ చేశారని విషయం తెలుసుకున్న విజయనగరం అధికారులు దీని మీద విచారణ చేపట్టారు. చనిపోయిన వ్యక్తికి పింఛన్ మంజూరు చేయడం తప్పు. అసలు మృతదేహం నుంచి ఎలాంటి వేలిముద్రలు సేకరించ కూడదు. దీనిపై వాలంటీర్ వివరణ కోరతామని అధికారులు చెబుతున్నారు. వాలంటీరు అత్యుత్సాహం తోనే ఇలా చేసినట్లుగా కూడా తెలుస్తోంది. పింఛన్ మంజూరు చేయడంతో పాటు మృతదేహం వేలిముద్రలు తీసుకుంటూ వాటిని ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో పెట్టడం చూస్తే, చట్టాలపై కనీస అవగాహన లేకపోవడమే అసలు సమస్య అని అర్థమవుతోంది.

అధికారుల ది మరీ ఓవరాక్షన్

ఈ ఘటనపై విచారణ చేసిన గుర్ల ఎంపీడీవో కొత్త వాదనను కొనసాగించి వివాదాన్ని సాగదీయడానికి ప్రయత్నిస్తున్నారు. నారాయణమ్మ వాళ్ళింటికి వెళ్లే సమయానికి చనిపోలేదని చివరి క్షణం లో ఉండగా కుటుంబ సభ్యులు ఇంటి బయటకు తెచ్చారని ఆయన చెబుతున్నారు. చనిపోక ముందే ఆమెకు పసుపు కుంకుమ పెట్టి అగరవత్తులు వెలిగించి అని ఆయన చెప్పడం చూస్తే నిజంగా హాస్యాస్పదంగా అనిపిస్తోంది. ఈ వివాదానికి ఇంతటితో ఫుల్స్టాప్ పెట్టాల్సిందే అధికారులు దానిని కొనసాగించేలా, వాలంటీర్లను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేయడం విశేషం. చిత్రంలో మృతదేహం స్పష్టంగా కనిపిస్తున్న అధికారులు మాత్రం దానిని కప్పిపుచ్చే స్థాయిలో ప్రకటనలు చేయడం వల్ల మరింత ప్రమాదకరం.

 

author avatar
Comrade CHE

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju