Deepti Sunaina : దీప్తి సునైనా, షణ్ముఖ్ జశ్వంత్ విడిపోయిన తర్వాత అంతా షాకయ్యారు. దాదాపు ఐదేళ్ల పాటు సహజీవనం చేసిన వీరిద్దరూ చెప్పాపెట్టకుండా తమ ప్రేమను తుంచివేయడంతో అభిమానులు గుండె పగిలారు. ఇలాంటి పెద్ద నిర్ణయం తీసుకోవడానికి గల కారణమేంటి? బిగ్‌బాస్ పూర్తయిన తర్వాతనే దీప్తి ఈ అతిపెద్ద నిర్ణయం ఎందుకు తీసుకుంది? వంటివి ఇప్పటికీ ఫ్యాన్స్ మెదళ్లను తొలిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక సంచలన నిజం బయటపడింది.
షణ్ముఖ్ జస్వంత్ బిగ్‌బాస్ షోకి వెళ్లిన తర్వాత సిరితో కలిసి బీభత్సమైన రొమాన్స్ చేశాడు. ఈ కారణంగానే దీప్తి అతన్నుంచి విడిపోయి ఉండొచ్చని భావించారంతా. కానీ అసలు కారణం ఆమె కాదట. నిజానికి గతంలో దీప్తి బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్ గా వెళ్లింది. నచ్చావులే హీరో తనీష్ తో గాఢమైన రొమాన్స్ చేసింది. నిజంగా ఆమె అతడితో ప్రేమలో ఉందా అనిపించేలా రెచ్చిపోయింది. ఇదంతా స్క్రిప్ట్ లోని భాగమేనని అప్పట్లో దీప్తి సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే అలాంటప్పుడు షణ్ముఖ్ చేసింది తప్పే కాదు. అందులోనూ దీప్తికి బిగ్‌బాస్ వాతావరణం ఎలా ఉంటుందో తెలియంది కాదు. అందువల్ల సిరి హనుమంత్ వీళ్లిద్దరి ప్రేమలో చిచ్చుపెట్టిందని చెప్పడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
బిగ్‌బాస్ షోకి వెళ్లక ముందే వీరిద్దరి మధ్య అంతరం పెరిగిందట. కారణం డబ్బులా? స్టేటస్? కెరీర్? అని ప్రశ్నిస్తే వీటన్నిటిలో వీరు సరి సమానంగానే ఉన్నారు. కానీ ఏదో ఒక తెలియని కారణం వల్ల వీళ్లిద్దరి మధ్య ప్రేమ బంధం తునాతునకలు అయిందని తెలుస్తోంది. బిగ్‌బాస్ షోకు షన్ను వెళ్లకముందే.. వీళ్ల బంధం తెగిపోవడానికి రెడీగా ఉందని కొందరు అంటున్నారు. బిగ్‌బాస్ తర్వాత బ్రేక్ అప్ చెప్పుకోవాలని వీరు ముందే అనుకున్నారట. కానీ షన్ను ఆమెకు ఎలాంటి బ్యాడ్ నేమ్ తేకుండా బిగ్‌బాస్ లో తనపై నెగిటివిటీ వచ్చేలా సిరితో క్లోజ్ గా ప్రవర్తించి.. అదే అసలు కారణంగా జనాలను నమ్మించినట్లు ఒక టాక్ నడుస్తోంది. ఇంతకీ అసలు కారణం ఏంటి? ఎవరు? అనేది గోప్యంగానే ఉంది.
దక్షిణాది సినిమా రంగంలో తుని దారులకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా తమిళ సినిమా రంగంలో అయితే హీరో లేదా హీరోయిన్ నచ్చాడు అంటే విగ్రహాలు కట్టేస్తారు...…
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…
ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…
విభిన్న చిత్రాలకు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్.. రీసెంట్గా `కార్తికేయ 2`తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. 2014లో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్…
విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…
ఒకప్పటి హీరోయిన్ నమిత పండండి కవలలకు జన్మనిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సందర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు…