కరోనా వైరస్ కు వ్యాక్సిన్ ఎప్పుడోస్తుందో తెలియదు కానీ.. ఎఫ్ 3 సినిమాతో నవ్వుల వ్యాక్సిన్ పక్కాగా వస్తుందని దర్శకుడు అనిల్ రావిపూడి అంటున్నాడు. నవంబర్ 23న ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఒక పత్రికతో ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో పలు అంశాలు ఆయన తెలిపారు.అయితే అనిల్ రావిపూడికి మంచి పేరు ఉంది. పటాస్, సుప్రీమ్, రాజాదిగ్రేట్, ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు లాంటి పలు సినిమాలకు దర్శకత్వం వహించి.. ప్రేక్షకులను నవ్వుల లోకంలోకి తీసుకుపోయిన దర్శకుడు అనిల్ రావిపూడి.
తన బర్త్ డే సందర్భంగా పలు విషయాలను పంచుకున్నాడు. ఆయన తన జర్నీ గురించి మాట్లాడుతూ.. ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. పటాస్ సినిమాతో తన జర్నీ షూరు అయ్యిందని పేర్కొన్నాడు. పటాస్ సినిమా చాలా ప్రత్యేకమని, అది లేకపోతే ఈ రోజు ఇలా ఉండేవాడిని కాదని పేర్కొన్నాడు. తర్వాత దిల్ రాజ్ గురించి మాట్లాడుతూ.. పటాస్ తర్వాత ఆయన తనని దతత్త తీసుకున్నారని తెలిపాడు.
తర్వాత రాజాది గ్రేట్ సినిమా గురించి మాట్లాడుతూ.. హీరోకు కళ్లు ఉండవు అనే పాయింట్‌ను తీసుకుని స్టోరీ రాసుకున్నట్లు తెలిపాడు. ఆ కథకు రవితేజను ఎంచుకున్నట్లు తెలిపాడు. ఈ సినిమా తనని ఇంకో రెంజ్ కు తీసుకుపోయాయని తెలిపాడు. ఆ సినిమాలో చేసిన ఇంటర్వెల్ ఫైట్ సీన్ ఇప్పటికి నచ్చుతుందని తెలిపాడు. దాన్ని ఎప్పుడు చూసినా గూజ్బంప్స్ వస్తాయి పేర్కొన్నాడు. ఈ ఫైట్ సీన్ కు సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్రసంశలు వచ్చాయని తెలిపాడు.
ఇక ఎఫ్ 2 సినిమా గురించి మాట్లాడుతూ.. తనని ఈ సినిమా కంప్లీట్‌గా మార్చేసింది అన్నాడు. కుటుంబాన్ని మొత్తాన్ని నవ్వించాలనుకున్న తన కోరిక ఎఫ్ 2 సినిమాతో నెరవేరిందని తెలిపాడు. ఇందులో వెంకటేశ్‌గారు, వరుణ్‌తేజ్ నటించడం తన అదృష్టంగా చెప్పుకొచ్చాడు. 2019 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం. ఆ సంక్రాంతిని నవ్వుల సంక్రాంతిగా మార్చిందని తెలిపాడు.ఈ సినిమాకు పలు అవార్డులు రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపాడు. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా తేసే అవకాశాన్ని తెచ్చిందని పేర్కొన్నాడు.
ఇక ఎఫ్ 3 సినిమాని డిసెంబర్ లో షూటింట్ ప్రారంభం చేసే యెచనలో ఉన్నట్లు తెలిపాడు. ఎఫ్2 ఏ మాదిరిగా అయితే నవ్వించిందో అంతకు మించి నవ్వులు ఉంటాయని పేర్కొన్నాడు. ఫన్ అండ్ ఫ్రస్టేషన్‌కు మరో ఎఫ్ యాడ్ అవుతుందని తెలిపాడు. అందరిని మనస్ఫూర్తిగా నవ్విస్తానని పేర్కొన్నాడు. నవ్వుల వ్యాక్సిన్ తప్పకుండా ఈ సినిమాతో వస్తుందని అనిల్ రావిపూడి తెలిపాడు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!