Rajamouli: “స్టూడెంట్ నెంబర్ వన్” సినిమా తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన రాజమౌళి అనతికాలంలోనే భారీ విజయాలు సాధిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి లోనే తనకంటూ సపరేట్ గుర్తింపు దక్కించుకున్నారు. రెండో సినిమా “సింహాద్రి” తోనే ఇండస్ట్రీ హిట్స్ అందుకున్న రాజమౌళి ఆ తర్వాత “మగధీర” సినిమాతో సత్తా చాటి భారతదేశ సినీ ప్రేమికులు మొత్తం టాలీవుడ్ వైపు చూసేలా చేశాడు. ఆ తర్వాత “బాహుబలి” సినిమా తో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డులు మొత్తం తిరగరాసి.. అంతర్జాతీయ సినీ ప్రేమికులు ఆశ్చర్యపోయేలా చేశారు.
అటువంటి టాలెంట్ కలిగిన రాజమౌళి.. పేరు ప్రస్తుతం దేశంలోనే కాక అంతర్జాతీయ స్థాయిలో మారుమ్రోగుతోంది. హాలీవుడ్ ఇండస్ట్రీస్ సైతం రాజమౌళితో సినిమాలు చేయడానికి సై అంటుంది. ఇదిలా ఉంటే రాజమౌళి తన కెరియర్ లో ఎక్కువ సార్లు చూసిన సినిమా ఏంటో ఇటీవల సోషల్ మీడియాలో బయట పడింది. హాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్రాంచైజ్ మూవీస్ .. రాజమౌళి ఖాళీ దొరికినప్పుడల్లా చూస్తారట. ఈ సినిమాకి సంబంధించి ప్రతి పార్ట్ మిస్ అవకుండా ఎక్కువసార్లు రాజమౌళి చూసినట్లు తాజాగా వార్త బయటపడింది.
Read More: RRR: “RRR” లో ఎన్టీఆర్ తండ్రి పాత్ర చేస్తున్నది ఎవరో తెలుసా..??
ఇదిలా ఉంటే ఈ వార్త తెలుసుకున్న సోషల్ మీడియాలో నెటిజన్లు సినీ ప్రేమికులు రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం కూడా ఫ్రాంచైజ్ మాదిరిగా పార్టులు.. పార్టులుగా తీస్తే బాగుంటుందని అంటున్నారు. ప్రస్తుతం రాజమౌళి “RRR” చేస్తున్నారు. దీని తర్వాత మహేష్ బాబుతో ఆ తర్వాత “మహాభారతం” ప్రాజెక్ట్ తెరకెక్కే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!