Riots: మీ మనస్సు ప్రశాంతం గా ఉంటే రోజు మొత్తం లో ఎదురైయే ఎలాంటి సమస్య అయినా మీరు చాలా తేలికగా అధిగమించ గలుగుతారు. మనస్సు ప్రశాంతంగా ఆహ్లదం గా ఉండాలంటే ఏమి చేయాలో తెలుసుకుందాం.ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలి. ఏంటి మనస్సు ప్రశాంతతకు ఇంటికి ఏమి సంబంధం అనుకుంటున్నారా?చాలానే ఉంది.రోజంతా ఆఫీసులో పని చేసి ఇంటికి వచ్చిన తర్వాత ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటుంది. హమ్మయ్య అని తలుపు తెరవగానక్కడికక్కడ చెత్త, చిందర వందర గా ఉన్న వస్తువులు కనబడితే నీరసం, కోపం, చిరాకు అన్ని కలిపి ఒకేసారి వచ్చేస్తాయి. ఇది చాలా మందికి ఉండే సమస్యే. కాబట్టి ఇంటి ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడానికి సాయశక్తులా పోరాడండి. పరిశుభ్రమైన ఇంటి వాతావరణం మనసుకు ప్రశాంతతను హాయి ని ఇస్తుంది.
ఆఫీస్ కి వెళ్లే హడావుడిలో చాలామంది మాసిన బట్టలు పక్కన పడేయడం, బెడ్ సర్దుకుపోవడం, ఉతికిన బట్టలు మడత పెట్టకపోవడం చేస్తుంటారు. వాటిని కుర్చీ లేదా మంచం మీద వేసి, తర్వాత మడత పెట్టుకోవచ్చని ఆఫీస్ కి రెడీ అయిపోతారు. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మళ్లీ ఇంటి పని, వంట పని చేసుకునే సరికి ఉన్న ఓపిక కాస్తా పోతుంది. దీంతో ఎక్కడి బట్టలు అక్కడే ఉండి పోతాయి. ఈ సమస్యకు పరిష్కారం గా రెండు లాండ్రీ బాస్కెట్ కొనుక్కోండి. ఒకదానిలో ఉత కావలసిన బట్టలు, మరొక దానిలో ఉతికిన బట్టలు వేయండి. ఈ బాస్కెట్స్ ప్రతి రూమ్‌లోనూ పెట్టండి. మీరు ఖాళీగా ఉన్న సమయంలో వాటిని మడత పెట్టండి.
ఇలా చేయడం వలన, ఇల్లు నీట్‌గా ఉండటంతో పాటు పని చేశామనే శ్రమ కూడా తెలియదు. ఇక డైనింగ్ టేబుల్ విషయానికి వస్తే అవసరమైనవి మాత్రమే ఉంచండి. మిగిలిన వాటిని టేబుల్ పై లేకుండా చేసుకోవాలి. ఇదే డ్రెస్సింగ్ టేబుల్ విషయం లో కూడా చేయాలి. మార్నింగ్ ప్లాన్ ప్రకారం పనులు త్వరగా ముగించేసి.. కాస్త టైం మిగిల్చుకుని అన్నీ రూమ్స్ చెక్ చేసుకుని చిందరవందర గా ఉన్నవాటిని సర్దుతూ.. బెడ్ కూడా సర్దుకోండి. సోఫా కవర్లు సరిచేసి అవసరం అనిపిస్తే ఒకసారి ఇల్లు ఊడ్చుకొండి. ఇంకా మీరు సాయంత్రం రాగానే మీ ఇల్లు సేద తీరడానికి రెడీ గా ఉంటుంది.అంత నీట్ గా ప్రశాంతం గా ఉన్న ఇంటిని చూస్తే మీకు ఎక్కడలేని ఓపిక వస్తుంది.. కాసేపు సేద తీరి ఇప్పుడు నెమ్మదిగా పని మొదలు పెట్టండి.
మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ధ్యానం ఒక మంచి మార్గం. అయితే ధ్యానం చేయడానికి ఇష్టపడని వారు అరోమాథెరపీ మనసును ప్రశాంతంగా చేసుకోవచ్చు. దీని కోసం మీరు అరోమా ఆయిల్ డిఫ్యూజర్‌ను కొనుక్కోండి. దీనిలో మీకు నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్ వేస్తే డిఫ్యూజర్ రూమ్ అంతటిని పరిమళభరితంగా చేసేస్తుంది.ఇంటిని అందంగా ఉండడంతో పాటు ఎప్పటికప్పుడు మీ లో స్ఫూర్తిని కలిగించే విధంగా కొన్ని డెకరేటివ్ పీసెస్‌ను సెలెక్ట్ చేసుకోండి. వాటిపై మిమ్మల్ని ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంచే మీకు నచ్చిన కొన్ని వాక్యాలు పెట్టుకోండి. అవి మీకు కనిపించినప్పుడల్లా మీలో ఏదో తెలియని ఉత్సాహం కలుగుతుంది.