భారత ప్రభుత్వానికి చెందిన ఎక్స్ పోర్ట్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీజీసీ) ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు ఈ పోస్టులకు ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి.. ఈసీజీసీ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం ఇలా..
మొత్తం ఖాళీలు : 59
విభాగాలు : ప్రొబెషనరీ ఆఫీసర్
అర్హతలు : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
వయస్సు : 1.1.2021 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, పిడబ్ల్యుడి అభ్యర్థులకు 10 సంవత్సరాల వయసు మినహాయింపు వర్తిస్తుంది.
పరీక్ష విధానం :
ఈ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా నిర్వహిస్తారు. దీనిని ఆన్లైన్ ఎగ్జామ్, డిస్క్రిప్టివ్ పేపర్ రాయాలి. ఆన్లైన్ ఎగ్జామ్ ను 200 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష సమయం 140 నిమిషాలు. డిస్క్రిప్టివ్ టెస్ట్ 40 మార్కులకు ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్ లో షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. దీన్ని 60 మార్కులకు జరుగుతుంది. కనీసం 40 శాతం మార్కులు తగ్గకుండా రావాలి. ఆన్లైన్ పరీక్ష ఇంటర్వ్యూ లో 80 : 20 నిష్పత్తిలో వెయిటేజీ ఉంటుంది. ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ లో సాధించిన మెరిట్ అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తయిన అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్ ద్వారా
దరఖాస్తులకు ప్రారంభ తేదీ :1/1/2021
దరఖాస్తులకు చివరి తేదీ :31/1/2021
పరీక్ష తేదీ : 14/3/2021
వెబ్ సైట్ : www.ecgc.in