బుల్లితెర మీద మనకి బాగా వినిపించే పేరు అనసూయ భరద్వాజ్- Anasuya Bharadwaj. టీవీ షోస్ చూసే ప్రతిఒక్కరికి ఈమె సుపరిచితమే. అనసూయ కి అంత పాపులారిటీ ఉంది. టెలివిషన్ తెరపై ‘జబర్దస్త్’- Jabardasth కామెడీ- comedy షో లో ఒకపక్క యాంకరింగ్ చేస్తూ ఇంకొక పక్కన అందాలు ఆరబోస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ యాంకర్ గా సూపర్ పాపులర్ అయ్యింది. అనసూయ తరచు బుల్లితెర గ్లామర్ క్వీన్‌గా వార్తలలో నిలుస్తూనే ఉంటుంది.
ఈ హాట్ యాంకర్ సోషల్ మీడియాలో- social media కూడా ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటుంది. ఎప్పటికప్పుడు తన షో అప్ డేట్స్‌తో అలాగే తన పిల్లలతో, భర్తతో గడిపిన మధుర క్షణాలను సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
తాజాగా అనసూయ తన ఇద్దరు పిల్లలతో డాన్స్ చేస్తూ తన సోషల్ మీడియా లో పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ప్రేమికుడు చిత్రంలోని ముక్కాబుల పాటకు అదరిపోయే స్టెప్పులేసింది అనుసయా భరద్వాజ్. ఈ సందర్భంగా అనసూయ తన పోస్ట్‌లోని డిస్క్రిప్షన్ లో న్యూ ఇయర్ సందర్భంగా ఇలా పిల్లలతో గడిపానని చాలా సంతోషంగా చెప్పుకొచ్చింది.
ఆ వీడియోలో అంతా బాగానే ఉంది కానీ అనసూయ మాత్రం కాస్తా పోట్టి డ్రెస్‌లో కనిపించింది. ఇది చుసిన కొంతమంది నెటిజన్స్‌కు ఆమె మీద విమర్శలు గుప్పించారు. దీంతో ఆ పోస్ట్ కి వారి అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో పెడుతున్నారు. నువ్వు పిల్లలతో అలానే ఉంటావా ఎంటీ? పిల్లల దగ్గర ఉన్నప్పుడు కాస్తా పొడుగు డ్రెస్ వేసుకోవచ్చుగా అంటూ అనసూయ మీద మండి పడుతున్నారు. ఇది చుసిన మరి కొందరేమో తన పిల్లలతో ఆమెకు నచ్చినట్టు ఉంటుంది, ఎలా ఉంటే మీకెందుకు అంటూ కౌంటర్ ఇస్తూ అనసూయకు సపోర్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్‌గా మారింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!