NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

జిహెచ్ఎంసి మేయర్ పీఠం పై మడత పేచీ : హై కోర్టులో మాజీ ఎమ్మెల్యే పిల్

(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి )

 

మనం.. గత ఆర్టికల్ లోనే జిహెచ్ఎంసి మేయర్ పీఠం చేజిక్కించుకోవాలని అంటే మ్యాజిక్ మార్కు 76 కాదని.. 98 అని చెప్పుకున్నాం… గుర్తుందా…!! జిహెచ్ఎంసి పాలకవర్గంలో 150 మంది కార్పొరేటర్ల తో పాటు మరో 45 మంది ఎక్స్అఫిషియో సభ్యులు ఉన్నారు. వారికి ఓటు హక్కు ఉంది. ఎమ్మెల్యేలు ఎంపీలతో పాటు ఎమ్మెల్సీలకు మేయర్ ఎన్నికల్లో ఓటు హక్కు ఉండటంతో వారు అంతా కలిపి మరో 45 మంది అయ్యారు. ఇప్పటికే జిహెచ్ఎంసి పరిధిలో టిఆర్ఎస్ కు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు కలిపి 31 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. అంటే మేయర్ పీఠానికి అవసరమయ్యే 98 మంది మద్దతు లో ఆల్రెడీ 31 మంది బలం తెరాసకు ఉన్నట్లే. అంటే జిహెచ్ఎంసి కార్పొరేటర్ల లో 67 మందిని టిఆర్ఎస్ గెలిపించుకోగలదు గితే మేయర్ పీఠం సులభంగా దక్కుతుంది. మిగిలిన పార్టీలు మాత్రం కావలసిన మ్యాజిక్ మార్చడానికి చాలా కష్టపడాలి. అంటే జిహెచ్ఎంసి ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా సీట్లు గెల్చుకుని, ప్రజా మద్దతు కూడగట్టిన… పెద్ద పార్టీగా అవతరించిన కొన్ని పార్టీలకు ఎక్స్ అఫిషియో సభ్యులు తక్కువగా ఉండడంతో మేయర్ పీఠం కోసం ఉండదు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం కాదా?? ప్రజలు ఎన్నుకొని పట్టం కట్టిన వారికి మేయర్ పీఠం పరిపాలన పగ్గాలు దక్కకపోతే ఇక అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది..?? ఇదేం అసంబద్ధ మేయర్ ఎన్నిక అంటూ వివాదం కోర్టు గడప తొక్కింది. అధికార పార్టీ కు ఎక్కువమంది ఎక్స్ అఫీషియో సభ్యుల మద్దతు ఉంటుందని, వారందరికీ ఓటు హక్కు కల్పించడం వల్ల ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన పార్టీకి పరిపాలన పగ్గాలు దక్కే అవకాశం ఉండదని ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్) తెలంగాణ హైకోర్టులో దాఖలైంది. సాధారణంగా న్యాయవ్యవస్థపై కాత పట్టున్నవారికీ, జిహెచ్ఎంసి ఎన్నికల్లో బాగా ఫాలో అయిన వారికి ఈ వ్యాజ్యం ఇప్పుడు పూర్తి చర్చనీయాంశం. దీనిలో కోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇస్తుంది ఎలాంటి వ్యాఖ్యానాలు చేస్తుంది అన్నదానిపై న్యాయ వర్గాల్లోనూ ఆసక్తి రేకెత్తిస్తుంది.

 

ghmc elections- telangana high court

గ్రేటర్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో పనిచేసే ఎక్స్ అఫిషియో వోట్లు మొత్తంగా ప్రజాస్వామిక స్పూర్తిని దెబ్బతీస్తున్నాయనేది పిల్ సారాంశం… ప్రజలు ఎన్నుకునేది 150 మందిని… కానీ ఈ ప్రత్యక్ష ఎన్నికతో ఏమాత్రం సంబంధం లేని 45 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు… అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మొత్తంగా జనం తీర్పును పట్టించుకోకుండా… తమకు నచ్చిన తక్కువ సీట్లు వచ్చిన వారిని ఎంపిక చేసుకునే అవకాశం సమర్థనీయమా అనేది అసలు కేసులోని సారాంశం.

అనీల్ చొరవతో

బాల్కొండ మాజీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ ఈ పిల్‌ను దాఖలు చేశారు. ప్రజారాజ్యం పార్టీ లో ఓసారి ఎమ్మెల్యేగా గెలిచిన, ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. పిల్లి వేయడానికి ప్రధాన కారణం ఏమిటని ఆలోచిస్తే, ఒకవేళ జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాల్లో తెరాసకు 67 సీట్లు, బీజేపీకి 97 సీట్లు (బీజేపీ కి ఒక ఎక్స్ అఫీషియో సభ్యుడు ఉన్నారు ) వస్తే అప్పుడు బలాబలాలు సమం అవుతాయి. అప్పుడు మేయర్ పీఠం మీద ఎవరిని కూర్చోబెడతారు? అప్పుడు వచ్చే రాజ్యాంగ సంక్షోభం ఎలా తీర్చిదిద్దారు అనేది ప్రధాన ప్రశ్న. మళ్లీ అప్పుడు అదో పెద్ద చర్చకు దారి తీస్తుంది కాబట్టి కోర్టు దీనిపై ఒక కష్టమైన ఆదేశాలు ఇవ్వాలనేది పిటిషన్ దారుడు వాదన. భవిష్యత్తులో రాబోయే సంక్షోభానికి న్యాయపరంగా ఓ దారి చూపించాలని కోరుతున్నాడు. వాదన సరైందే అయితే
ఒక్క జీహెచ్ఎంసీలో మాత్రమే ఇంత భారీ సంఖ్యలో చట్టసభ సభ్యులు వోటు వేసే అవకాశం ఉందనీ, దీనికి అనుమతినిచ్చే జీహెచ్‌ఎంసీ యాక్ట్‌ 1955లోని సెక్షన్‌ 90(1) చట్ట వ్యతిరేకమనీ, దాన్ని కొట్టేయాలనీ సైతం కోరాడు. పిటిషన్‌లో చీఫ్‌ సెక్రటరీ, మున్సిపల్, న్యాయ శాఖ ముఖ్య కార్యదర్శులు, స్టేట్‌ ఎలక్షన్‌ కమిషన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై తెలంగాణ హైకోర్టు ఎలాంటి సూచనలు ఇస్తుంది… ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది అనేది ఇపుడు సర్వత్రా ఉత్కంఠ గా మారింది. జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలు రెండు రోజుల్లో రానున్న తరుణంలో కోర్టు చేసే వ్యాఖ్యలు కీలకమవుతాయి.
* ఎక్స్ అఫీషియో సభ్యులకు మేయర్ ఎన్నికలో ఓటు హక్కు కల్పించడం అనేది చట్ట ప్రకారమే జరిగింది. దీనిపై 2005లో ఓ చట్టం తీసుకువచ్చి, జిహెచ్ఎంసి మొదటి ఎన్నికలు ఈ సమయంలో ఇంప్లిమెంట్ చేశారు. అయితే తర్వాత ఎమ్మెల్సీలకు ఓటు హక్కు కల్పిస్తూ మరో చట్టం తీసుకు వచ్చారు. దీంతో ఎక్స్ అఫీషియో సభ్యుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అంతా న్యాయ ప్రకారం చట్ట ప్రకారమే జరిగినప్పటికీ ప్రస్తుత ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పు వ్యతిరేకంగా నడుచుకునే మౌలిక సూత్రం పై హైకోర్టు ఎలా స్పందిస్తుంది అనేది ప్రభుత్వాలు చేసిన చట్టాలను ఎలా కాదు అంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.

పిల్ స్వీకరిస్తుందా!!

ఫలితాలు రావడానికి సరిగ్గా రెండు రోజులు మాత్రమే సమయం ఉన్న వేళ హైకోర్టు ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని స్వీకరిస్తున్న దీనిపై వాదనలు వింటుందా అనేది చూడాలి. ఖచ్చితంగా చర్చ జరగాల్సిన అంశం మీద అనిల్ కుమార్ కాస్త ముందుగా స్పందించి దాఖలు చేసి ఉంటే ఇది జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపేది. మేయర్ పీఠం ఎంపికలోనూ కీలకమయ్యేది. ఇప్పుడు దీనిని హైకోర్టు స్వీకరిస్తే తర్వాత మేయర్ ఎంపిక ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. కోర్టులో కేసు నడుస్తోంది కాబట్టి మేయర్ ఎంపికను నిలుపుదల చెయ్యొచ్చు. మరి ఈ కీలక సమయంలో వేసిన ఈ పిల్ మీద ప్రజాస్వామ్యానికి అవసరమయ్యే విషయమని కోర్టు స్వీకరిస్తే కొత్త సూచనలు ఆదేశాలు మనం చూడొచ్చు.
స్పందించలేదు… అందుకని ఈ పిల్ కూడా ఏమవుతుందో చూడాలి… అయితే పిల్‌లో పేర్కొన్న అంశాలు మాత్రం కచ్చితంగా సగటు జనాల్లో చర్చ జరగాల్సినవే…

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N