NewsOrbit
న్యూస్

సిఈసికి శేషన్ ఫోన్

ఢిల్లీ: ఎన్నికల నిర్వహణలో విఫలమైందని ఆరోపణలు ఎదురుకొంటున్న ఎన్నికల సంఘానికి అనుకోని అతిధి ఫోన్ చేశారు.

ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న తీరు, ఎన్నికల అధికారుల మెతక వైఖరిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనే మాజీ ఎన్నికల అధికారి టిఎన్ శేషన్.

పోలింగ్‌కు ముందు ఐటి దాడులు, అలాగే నేతల ప్రసంగాల్లో కుల, మతాలను ప్రస్తావిస్తున్నా చర్యలు తీసుకోవటంలో ఎన్నికల సంఘం విఫలమైందని విమర్శలు వస్తున్న నేపథ్యంలో శేషన్ చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ సునీల్‌ అరోరాకు ఫోన్‌ చేసినట్లు తెలుస్తోంది.

ఎన్నికల సంఘానికి ఉన్న విశేష అధికారాలను భారత దేశ ప్రజానికానికి, వివిధ రాజకీయ పక్షాల నాయకులకు తెలియజెప్పిన అధికారిగా శేషన్‌కు పేరుంది. శేషన్ ఎన్నికల కమిషనర్‌గా నియమితులు అయ్యే వరకు ఎన్నికల సంఘానికి ఇన్ని విశిష్ట అధికారాలు ఉంటాయన్నది ఇటు ప్రజలకు, అటు అధికారులకు తెలియదు. అందుకే ఎన్నికలు జరిగే విధానం శేషన్‌ రాకముందు, వచ్చిన తర్వాత అనే విధంగా సమూల మార్పులు తీసుకువచ్చారాయన.

1955 ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ బ్యాచ్‌కి చెందిన తిరువెళ్లై నారాయణ అయ్యర్‌ శేషన్‌ (టిఎన్ శేషన్‌) 1990 డిసెంబరు 12న 10వ చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా  బాధ్యతలు చేపట్టారు. 1996 డిసెంబరు 11వ తేదీ వరకు ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన శేషన్‌ ఎన్నికల విధానంలో తీసుకువచ్చిన సంస్కరణలు నేటికీ అమలవుతూనే ఉన్నాయి.

ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలతో రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అందుకే ఆయన్ని ఎలక్షన్‌ వాచ్‌ డాగ్‌గా పిలుస్తారు.

Related posts

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Leave a Comment