పవన్ కళ్యాణ్ కెరీర్లో “గబ్బర్ సింగ్” ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. ఈ సినిమా రాకముందు వరకూ పవన్ కళ్యాణ్ దాదాపు 10 సంవత్సరాల వరకు వరుస ప్లాపులు చూస్తూనే ఉన్నారు. ఇలాంటి తరుణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఒక్కసారిగా అభిమానులను అలరించడం మాత్రమే కాక టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టించింది.
ఈ సినిమాలో హీరోయిన్ పూజా పవన్ పక్కన నటించిన శృతి హాసన్ కి మంచి పేరును కూడా తీసుకు రావడం జరిగింది. ఇదిలా ఉంటే తాజాగా లాక్ డౌన్ తర్వాత శృతిహాసన్ “క్రాక్” సినిమాలో రవితేజ సరసన హీరోయిన్ గా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇటీవల విడుదలై సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే ఈ సినిమాలో కూడా రవితేజ పోలీస్ కావటంతో.. సినిమాకి మంచి పాజిటివ్ టాక్ రావడంతో పోలీస్ హీరోలు శృతిహాసన్ కి బాగా కలిసొస్తునరని సినీ ప్రేమికులు చెప్పుకొస్తున్నారు.
మరోపక్క చాలా కాలం తర్వాత రవితేజ హిట్ కొట్టడంతో ఆయన అభిమానులు కూడా కూల్ సంబరాలు చేసుకుంటున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర భారీగానే రవితేజ బోని కొట్టడని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!