బిగ్బాస్ ఇంట్లోకి అనామకుడి గా ఎంటర్ అయి భారీ ఫాలోయింగ్ సాధించిన సెలబ్రిటీ అఖిల్ సార్థక్ షో పూర్తి అయిన తర్వాత సోషల్ మీడియాలో విపరీతంగా ఇతను ట్రెండ్ అవుతున్నాడు. మోడల్ గా కెరీర్ ప్రారంభించి సినిమాలు, సీరియల్స్ లో నటించిన అఖిల్…. బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయ్యాడు. ఇక మరీ ముఖ్యంగా మోనాల్ గజ్జర్ తో నడిపిన ప్రేమ వ్యవహారం వల్ల హాట్ టాపిక్ అయ్యాడు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అఖిల్ కు ఊహించని ప్రశ్న ఎదురైంది. దీంతో ఒక్కసారిగా అతను యాంకర్ పైన ఫైర్ అయ్యాడు. ఇంట్లో ఉన్నంత సేపు ముద్దులు కౌగిలింతలతో అఖిల్-మోనాల్ జంట విపరీతంగా రెచ్చిపోయింది. తాజాగా ఇంటర్వ్యూ లో యాంకర్ అఖిల్ ను భయ్యా నీ పెళ్లి ఎప్పుడు అని అడిగాడు. దీంట్లో సీరియస్ గా అఖిల్ నీ పెళ్లి ఎప్పుడు? అసలు నీ వయసు ఎంత? అని బదులు ప్రశ్నించాడు.
ఆ తరువాత యాంకర్ మరొక అడుగు ముందుకు వేసి మోనాల్ తోనే కదా నీ పెళ్లి అని అడిగేశాడు. దీంతో అఖిల్ చిర్రెత్తిపోయాడు. అసలు నా పెళ్లి గురించి నీకెందుకు రా…. మళ్లీ ఇలాంటి ప్రశ్నలు అడిగావో అంటూ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ లేచి వెళ్లిపోయాడు. ఇక అఖిల్ ప్రవర్తన సోషల్ మీడియాలో విపరీతంగా ట్రేడ్ అవుతోంది.
బిగ్బాస్ ఇంటిలో బాగా ఫేమస్ అయిన అఖిల్-మోనాల్ జంట బయటకు వచ్చిన తర్వాత కూడా విపరీతంగా సందడి చేశారు. న్యూ ఇయర్ కూడా కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు అయితే తాను స్నేహితురాలిగానే మోనాల్ ను చూస్తున్నాను అని అఖిల్ చెప్పినప్పటికీ ఇలాంటి ప్రశ్నలు ఎదురుకావడంతో అతను బాగా కోప్పడిన్నట్లు ఉన్నాడు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!