GOOGLE PAY : టెక్ దిగ్గజం గూగుల్ అందిస్తున్న సేవల్లో భాగంగా అందులో భాగమైన గూగుల్ పే తాజాగా ఒక వార్తని ప్రకటించింది. దాన్ని నేరుగా ప్రకటించకుండా తాము సంస్థలతో భాగస్వామ్యం ద్వారానే భారత్ లో గూగుల్ పే సర్వీసులు అందిస్తున్నామని పేర్కొంది. తాజాగా ప్రకటించిన వార్తలో ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా ఆఫర్ చేస్తుందని వస్తున్న వార్తలకి ముగింపు పలికింది. కొన్ని ఆఫర్లను తామే స్వయంగా అందిస్తున్నామని పలు సందర్భాల్లో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఒక బ్లాగ్ పోస్టులో తెలిపింది. కొత్త వినియోగదారులకు, చాలా వ్యాపారాల్లో తమ ప్లాట్ ఫారం ఒక మాధ్యమంగా ఉపయోగపడుతుందని పేర్కొంది.
IAS Transfers: ఏపిలో ఆరుగురు ఐఏఎస్ ల బదిలీ..!!
ఇటీవల గూగుల్ పే ఈక్విటోస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో డిజిటల్ గా ఫిక్స్డ్ డిపాజిట్లు తెరిచే సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఖాతాదారు ప్రత్యేకంగా సేవింగ్స్ ఖాతా తెరవాల్సిన అవసరం లేకుండా ఫిక్స్డ్ డిపాజిట్ చేసే సదుపాయాన్ని పరిశ్రమలో తొలిసారి తీసుకొచ్చింది. రెండు నిమిషాల్లో ఎలాంటి బ్యాంక్ ఖాతా లేకుండా గూగుల్ పే లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసే ప్రక్రియను తీసుకొచ్చింది. ఒక ఏడాది పాటు చేసే ఎఫ్ డీలపై 6.35 % తాము ఆఫర్ చేస్తున్నట్టు ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ఎస్ ఎఫ్ బి) ప్రకటించింది.
BREAKING : మొగులయ్యకు రూ.2 లక్షలు అందించిన పవన్ కల్యాణ్.. !
మొత్తానికి గూగుల్ పే లో ఫిక్స్డ్ డిపాజిట్లపై వస్తున్న వార్తలకు ఒక క్లారిటీ వచ్చింది. దీన్ని బట్టి చూస్తే గూగుల్ పే లో ఇకనుండి డిజిటల్ గా ఎటువంటి ఖాతా లేకుండా రెండు నిమిషాల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్కోవచ్చు. ఇది వినియోగదారులకు ఒక శుభవార్త గానే చెప్పుకోవచ్చు. దీంతో గూగుల్ పే కు వినియోగదారులు పెరిగే అవకాశం ఉంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా గూగుల్ పే తమ సేవలను అందించే ప్రయత్నం చేస్తోందని తెలుస్తుంది.
Pigmentation: ముఖంపై మంగు మచ్చలు, మొటిమల మచ్చలు, పిగ్మెంటేషన్ కు బై బై చెప్పండిలా..!!