న్యూస్ సినిమా

క్రాక్ ప్రభావం తో ట్రెండింగ్ లోకి వచ్చిన గోపీచంద్ మలినేని ..!

Share

క్రాక్ సినిమా ప్రభావం దర్శకుడు గోపీచంద్ మలినేని మీద ఇంతగా ప్రభావం చూపుస్తుందని ఇండస్ట్రీలో ఏ ఒక్కరు ఊహించలేదు. ఒకరకంగా ఇది గోపీచంద్ కెరీర్ లో జరిగిన ఒక అద్భుతం అని చెప్పాలి. డాన్ శీను సినిమా నుంచి విన్నర్ వరకు మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టనర్స్ ని తెరకెక్కించాడు గోపీచంద్ మలినేని. అయితే రవితేజ తో తీసిన డాన్ శీను, బలుపు సినిమాలు తప్ప మిగతావన్ని యావరేజ్ గా ఆడాయి. లక్ అంటే గోపీచంద్ మలినేని – రవితేజ కాంబినేషన్ దే అన్న టాక్ కూడ వినిపించింది.

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ తో గోపీచంద్ మనిలేని తెరకెక్కించిన గత చిత్రం విన్నర్ వచ్చి దాదాపు మూడేళ్ళు దాటిపోయింది. 2017 లో విన్నర్ వచ్చింది. ఆ తర్వాత గోపీచంద్ మలినేని నుంచి మళ్ళీ సినిమా రాలేదు. చెప్పాలంటే ఒక డైరెక్టర్ మూడేళ్ళ గ్యాప్ అంటే చాలా ఎక్కువ. ఇండస్ట్రీలో ఏ హీరో నమ్మి సినిమా ఇవ్వడం జరగని పని. అదీకాక గత చిత్రం ఫ్లాప్ గా నిలవడం తో మళ్ళీ ఏ హీరో కథ వినడానికి ఆసక్తి చూపించడు. కాని మన మాస్ మహారాజా ఆ ధైర్యం చేశాడు. దర్శకుడిగా గోపీచంద్ మలినేని లో ఉన్న సత్తా తెలుసు కాబట్టి క్రాక్ సినిమా చేసే ఛాన్స్ ఇచ్చాడు. రవితేజ కి సక్సస్ వచ్చి మూడేళ్ళు అవుతోంది. ఇద్దరు ఆకలి మీద ఉన్న పులుల్లా కసితో క్రాక్ సినిమా చేసి భారీ హిట్ అందుకొని సంక్రాంతి విన్నర్ గా నిలిచారు.

ఆ ప్రభావం ఇప్పుడు గోపీచంద్ మలినేని మీద గట్టిగా చూపిస్తోంది. వరసగా మంచి ప్రాజెక్ట్ చేసే ఛాన్స్ లు వస్తున్నాయట. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ వారు స్టార్ హీరో తో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమాను నిర్మించేందుకు సిద్దం అవుతున్నారు. త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం కూడా ఉందని అంటున్నారు. త్వరలో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందట. అంతేకాదు మరో ఇద్దరు హీరోలు గోపీచంద్ మలినేని తో సినిమా చేసేందుకు రెడీగా ఉన్నారని సమాచారం.


Share

Related posts

ఆచార్య కథ పూర్తిగా కొరటాల శివదే – మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్

Vihari

బిగ్ బాస్ 4 : బిగ్ బాస్ లో జరిగిన ఊహించని సంఘటన తో జబర్దస్త్ ఫాన్స్ అందరూ కంగారు పడుతున్నారు !!

sekhar

Volunteers: ఆ జిల్లాలో ఒకే సారి 33 మంది గ్రామ వాలంటీర్ల తొలగింపు..! ఎందుకంటే..?

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar