Guppedentha manasu Jan 7 episode: వసు ఇంటికి వెళ్లిన గౌతమ్.. కానీ అక్కడ వాళ్ళని అలా చూసి పాపం షాక్ లో గౌతమ్..!

Share

Guppedentha manasu Jan 7 episode: గుప్పెడంత మనసు సీరియల్ భలే ఆసక్తిగా ముందుకు సాగుతుంది. నిన్నటి ఎపిసోడ్ లో రిషి-వసు-గౌతమ్ ముగ్గురు కూర్చుని రోమియోజూలియట్ బుక్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు కూడా అదే సీన్ కంటిన్యూ అవుతుంది.వసుధార నువ్వు రోమియో జూలియట్ బుక్ చదవలేదా అని,నేను ఓ పాతికసార్లు చదివా అంటాడు గౌతమ్.ఆ బుక్ స్టోరీ గురించి నేను చెబుతా నువ్వు విను అని మొదలుపెడతాడు.మధ్యలో నోర్ముయ్ అంటూ రిషి అడ్డుతగులుతూ అక్కడ ఉన్న వసును వెళ్ళిపో అని పంపించేస్తాడు. ఇది కరెక్ట్ కాదు రిషి అని గౌతమ్ అంటే..నువ్వు చేసేది కరెక్ట్ కాదని నేను అంటున్నా అంటాడు గౌతమ్.నువ్వు నా పాలిట విలన్ లా తయారవుతున్నావ్ అంటాడు.నువ్వు చేసే ప్రయత్నాలు తప్పు , నీ దారి తప్పు అని రిషి అనగానే.. నువ్వేమైనా అని డౌట్ వ్యక్తం చేసిన గౌతమ్ తో అదేం లేదంటాడు.

Guppedentha manasu Jan 7 episode: జగతి మేడం బయటకు రమ్మంటే వసు ఎందుకు రాను అంది?

ఇంట్లో కూర్చుని ఉన్న వసుధారా దగ్గరకు జగతి వచ్చి మాట్లాడుతుంది. ఈరోజు శెలవు కదా ఎక్కడికైనా బయటకు వెళదామా అంటే ఎందుకు లెండి అంటుంది వసు. సరేలే అని జగతి వెళ్లిపోతుంటే.. మహేంద్ర సర్ ని రమ్మనండి కబుర్లు చెబుతారు అంటుంది వసు. మహేంద్రని రమ్మని చెప్పడానికి నీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలా అంటుంది. మీరు వద్దంటే నేను మానేస్తానా అంటూ కాల్ చేస్తుంది వసు.మహేంద్ర ఫోన్ ఉత్సాహంగా మాట్లాడుతుండగా ఎదురుగా రిషి వస్తాడు.డాడ్ ఆనందంలో కార్ సీట్ బెల్ట్ పెట్టుకోవడం మరిచిపోవద్దని చెబుతాడు.

Intinti Gruhalakshmi: గృహలక్ష్మి ఇంటిలోకి కొత్త క్యారెక్టర్.. ఆఫీస్ నడిపినట్టే ఇల్లు నడుపు అంటూ తులసి లాస్య పై అదిరిపోయే పంచ్..!! 
గౌతమ్ ఎవర్ని కలవడానికి మహేంద్రతో వెళ్తున్నాడు?

సీన్ కట్ చేస్తే గౌతమ్.. ధరణి దగ్గరకు వెళ్లి నేను వసుధార దగ్గరకు వెళుతున్నా అని చెప్పి ఈ విషయం వాడికి చెప్పొద్దనేసి వెళ్లిపోతాడు గౌతమ్.వసు దగ్గరకుగౌతమ్ వెళతా అంటున్నాడేంటి అసలు ఏం జరగబోతోందో అనుకుంటుంది ధరణి.ఈలోపు మహేంద్ర బయటకు వెళ్లడం చూసి లిఫ్ట్ కావాలంటాడు. ఎక్కడికి వెళ్లాలి అని అడిగితే చెబితే కొన్ని పనులు అవ్వవు అంటారు కదా అందుకే చెప్పడం లేదు అని ఒక ముఖ్యమైన ప్లేస్ కి అని నన్ను దీవించండి అంటాడు.నీ కోరికలో నిజాయితీ ఉంటే విజయం నీదే అంటాడు మహేంద్ర. ఇద్దరూ కలసి కార్లో వెళుతూ రిషి పై మీకెప్పుడూ కోపం రాలేదా అంటే అని గౌతమ్. అంటే నాపై నాకు కోపం వస్తుంది కానీ రిషిపై కోపం రాదంటాడు. మీరు జోవియల్-రిషి సీరియస్ అసలు మీకెలా సెట్ అవుతుంది అంటాడు మీరు అందరితో కలసిపోతారు-రిషి మాత్రం జోక్ వేయడు-మనం జోక్ వేసినా నవ్వడు అంటాడు గౌతమ్.తను తనలా ఉంటేనే బావుంటుందన్న మహేంద్ర రిషి నాకు కొడుకు మాత్రమే కాదు నా హీరో.లక్షల మందిలో లేని క్వాలిటీస్ వాడిలో ఉన్నాయి అని చెబుతాడు మహేంద్ర.

Karthika Deepam Jan 7 episode: అయ్యో డైరెక్టర్ గారు…ఇది మీకు న్యాయమా. మా దీపను ఏంటండీ ఇలా చేసేసారు…!
అసలు రిషి ఎవరి వల్ల ఇబ్బంది పడుతున్నాడు..??

సీన్ కట్ చేస్తే రిషి వసుధారకు ఫోన్ చేసి ఎక్కడున్నావ్, ఎవరైనా వచ్చారా అని అడిగేసి కాల్ కట్ చేస్తాడు. ఇంతలో అక్కడకు వచ్చిన రిషిని చూసి షాక్ అవుతుంది. రిషి వాటర్ కావాలి అని అడగడంతో లోపలకు వెళ్లిన వసుకి జగతి వాటర్ బాటిల్ ఇచ్చి రిషి టెన్షన్ గా కనిపిస్తున్నాడు ఎక్కువ ప్రశ్నలు వేయకని చెబుతుంది. ఏదైనా ప్రాబ్లెమా సార్ అంటే కొందరు మనుషుల వల్ల ప్రాబ్లెమ్ అని చెప్పి పద వెళదాం అంటూ తూలిపడబోతాడు రిషి. ఈలోపు వసు పట్టుకుంటుంది.ఇంతలో అక్కడకు వచ్చిన మహేంద్ర రిషిని చూసి షాక్ అయ్యి నువ్వేంటి ఇక్కడ అంటే పనుండి వచ్చా అని చెబుతాడు రిషి. వాటర్ కావాలని మహేంద్ర అడుగుతాడు.. అదే సమయానికి అక్కడకు వచ్చిన గౌతమ్ అందర్నీ చూసి షాక్ అయ్యి, వసుధారతో ఏకాంతంగా మాట్లాడుదాం అని నేను వస్తే అందరిలో ఇలా బుక్కైపోయానేంటి అనుకుంటాడు మనసులో ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ పూర్తయింది.


Share

Related posts

Work from Home: వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి బ్యాడ్ న్యూస్!

Ram

Rakul preeth singh : టాలీవుడ్‌లో రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ డిసైడ్ చేసే సినిమా ..?

GRK

TRS Leaders: అన్న కత్తితో.. తమ్ముడు గన్ తో..! టీఆరెస్ నాయకుల ఫ్యాక్షన్ తరహా వీరంగం..!!

Srinivas Manem