Health: లంగ్స్ హెల్దీగా ఉండాలంటే ఈ చిన్న వ్యాయామం చేస్తే చాలు..!!

Share

Health: నగరాలు, పట్టణాల్లో ఇటీవల వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. ప్రధానంగా వాయు కాలుష్యం ప్రజల ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. అదే మాదిరిగా కరోనా మహమ్మారి కూడా శ్వాస వ్యవస్థపైనే తీవ్ర ప్రభావం చూపుతుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కరోనా దెబ్బతీస్తుందని వైద్య నిపుణులు చెబుతుంటారు. కరోనా సోకిన వాళ్లు స్మెల్ కోల్పోవడమే ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు. అంతే కాకుండా పొగాకు ఉత్పత్తులు తీసుకునే వారికి కూడా ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. అయితే శ్వాస వ్యాయామం చేయడం వల్ల ఊపిరితిత్తులను శుభ్రం చేసుకోవచ్చు. ఇందు కోసం ఓ సింపుల్‌ వ్యాయామాన్ని చెబుతుంటారు. ఈ వ్యాయామం చేయడం చాలా సులువు. అది ఎలా చేయాలంటే..

Health: breath exercise to keep your lungs healthy
Health: breath exercise to keep your lungs healthy
  • ముందుగా నేలపై వెల్లకిలా పడుకోవాలి.
  • అనంతరం రెండు అర చేతులను పొట్టపై పెట్టుకోవాలి.
  • తర్వాత రెండు కళ్లు మూసుకొని ప్రశాంతంగా ముక్కు ద్వారా శ్వాసను పీలుస్తూ అయిదు వరకూ అంకెలు లెక్కబెట్టాలి.
  • ఇలా గుండెల నిండా శ్వాసను తీసుకొని రెండు సెకన్ల పాటు శ్వాసను బిగపట్టి ఉంచాలి.
  • తరువాత శ్వాసను నెమ్మదిగా వదులుతూ మళ్లీ అయిదు వరకు లెక్కించాలి.
  • ఈ వ్యాయామాన్ని ఉదయాన్నే 10 సార్లు చేయాలి. క్రమం తప్పుకుండా ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

కేవలం శ్వాస సంబంధిత వ్యాయామమే కాకుండా తీసుకునే ఆహారం ద్వారా కూడా ఊపిరితిత్తులను శుభ్రం చేసుకోవచ్చు. ఊపిరితిత్తులు నిత్యం శుభ్రంగా ఉండాలంటే.. ఉదయం నిద్రలేవగానే రెండు టీస్పూన్ల అల్లం రసం తీసుకోవాలి. ఇలా చేస్తే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. అంతే కాకుండా పుదీనా ఆకులను నీళ్లలో వేసి మరిగించి రోజూ తీసుకుంటే లంగ్స్ క్లీన్ గా ఉంటాయని చెబుతుంటారు.

Read more: AP Three Capitals: మూడు రాజదానుల అనుకూల రాయలసీమ మేథావుల బహిరంగ సభలో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన మహిళలు.


Share

Related posts

ఏబీఎన్ చానెల్ ఆయన కనుసన్నల్లో నడుస్తుందా? 

sekhar

షర్మిల పార్టీ నిజమేంత! వైఎస్ కుటుంబం నుంచి ఖండన ఏది??

Comrade CHE

మైత్రీ మూవీస్ – ఎన్.టి.ఆర్ – ప్రశాంత్ నీల్ భారీ యాక్షన్ మూవీ.. త్వరలో అనౌన్స్ మెంట్ ..?

GRK