Google: ట్రెండ్ మారుతోంది.. తరం మారుతోంది.. టెక్నాలజీని యువత సరిగ్గా వాడుకుంటోందనే చెప్పాలి. ఒకప్పుడైతే, అంటే ఈ సోషల్ మీడియా లేని రోజుల్లో ఎవరన్నా ఏదైనా ఓ షాపుకి వెళ్లి ఏదన్నా కొనాలంటే ఎన్నో ప్రయాసలు కోరి వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇపుడు పరిస్థితి మారింది. పెరుగుతున్న టెక్నాలజీ మనిషి సమయాన్ని చాలా వరకు సేవ్ చేస్తోంది. దాన్ని కొంతమంది సరైన మార్గంలో వాడుతున్నారు. మరికొందరు బద్దకస్తులుగా కూడా మారడం మనం చూస్తున్నాం. ఇక పొతే, ప్రస్తుత యువత షాపింగ్ కోసం ఆన్లైన్ ప్లేట్ ఫామ్ లనే ఉపయోగిస్తున్నారు అనడంలో సందేహం లేదు.
Google: 2021లో గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన వ్యక్తులు వీరే..!
ఇంతకీ ఆ ఆఫర్ల మాట ఏమిటి?
సంక్రాంతి సీజన్ నడుస్తోంది. ఈ నెలనుండి మొదలు వచ్చే నెల ఆఖరివరకు వివిధ విధాలుగా మార్కెట్లో ఆఫర్ల రుచి చూపిస్తూ కస్టమర్లను రాబట్టుకుంటారు వ్యాపారస్తులు. అదే విధంగా ఆన్లైన్ లో కూడా ఈ విధానం నడుస్తుందనే విషయం మనకు బాగా తెలుసు. ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్ క్రేజ్ మనకు తెలిసిందే. అది గమనించిన టెక్నాలజీ దిగ్గజం గూగుల్ వివిధ విధానాలను యూజర్స్ కోసం అందిస్తోంది. తన వెబ్ బ్రౌజర్ అయినటువంటి Google Chromeలో గూగుల్ కొత్త ఫీచర్లు చేర్చింది.
Google Chrome: గూగుల్ క్రోమ్ లో ఎక్కువగా బ్రౌస్ చేస్తున్నారా? అయితే మీకో హెచ్చరిక
ఫీచర్స్ ఏమిటి?
ఈ ఫీచర్స్ ద్వారా యూజర్లు చాలా ఈజీగా తమ షాపింగ్ చేసుకోవచ్చు. గూగుల్ క్రోమ్‌లో కొత్తగా వచ్చిన ఈ ఫీచర్స్ ద్వారా సగటు కస్టమర్ ఏం కొనగదలిచారు, ఆర్డర్ చేసిన వస్తువులు ఎక్కడి వరకు వచ్చాయో అని సులభంగా తెలుసుకోవచ్చని అంటున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏమంటే… ప్రస్తుతానికి ఈ ఫీచర్లు కేవలం అమెరికాలో మాత్రమే అందుబాటులో వున్నాయి. పైగా అది కూడా ఆండ్రాయిడ్ ఫోన్లలోనే గూగుల్ విడుదల చేయడం కొసమెరుపు. అతి తొందరలోనే ఈ విధానం ఇక్కడ కూడా తెస్తుందని అంటున్నారు.