Categories: న్యూస్

Google Chrome: గూగుల్ క్రోమ్ లో ఎక్కువగా బ్రౌస్ చేస్తున్నారా? అయితే మీకో హెచ్చరిక

Share

Google Chrome: ఇపుడు ప్రపంచంలో గూగుల్ క్రోమ్ ని ఉపయోగించనిది ఎవరు? ప్రపంచ వ్యాప్తంగా క్రోమ్ బ్రౌసర్ చాలా ఫేమస్. అందులోనూ మన ఇండియాలో అయితే ఇక చెప్పనవసరం లేదు. ఇక్కడ దాదాపు 90 శాతం మంది క్రోమ్ లోనే బ్రౌసింగ్ చేస్తారని ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది. రకరకాల లావాదేవీలకు, విలువైన సమాచారానికి, మెయిలింగ్ కి.. ఇలా ఒక్కటేమిటి అనేక విధాలుగా మనం అనునిత్యం ఇంటర్నెట్ పైన ఆధారపడవలసిన పరిస్థితి వుంది. ఇలాంటి తరుణంలో ఏకంగా క్రోమ్ బ్రౌసర్ నే వాడకూడదంటే ఒకింత కష్టమే మరి!

Google: 2021లో గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన వ్యక్తులు వీరే..!

క్రోమ్ తో వచ్చిన సమస్య ఏమిటి?

తాజాగా CERT-In (ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్) గూగుల్ క్రోమ్ యూజర్లను అలెర్ట్ చేసింది. అసలు విషయం ఏమంటే, క్రోమ్‌ లోని బగ్స్ ఉన్నాయని తేలింది. అలాగే ఇక్కడ వినియోగదారుల గోప్యత కూడా కష్టంగా మారిందని అంటున్నారు. అంతేకాకుండా టూల్ లోకి మాల్వేర్ చొరబడే ప్రమాదం కూడా లేకపోలేదని పేర్కొన్నారు. ఇకపోతే, తాజా సమాచారం ప్రకారం, Google ఈ లోపాన్ని సరిదిద్దింది. దాని కోసం ఒక అప్ డేట్ ను కూడా జారీ చేసింది. కానీ విషయం తెలియని యూజర్స్ చాలామంది మామ్మూలుగానే క్రోమ్ ను వాడేస్తున్నారని, అది చాలా ప్రమాదమని వారు సూచిస్తున్నారు.
Google Pay: గూగుల్ పే కస్టమర్లకు అలర్ట్..!
ఎలా అప్డేట్ చేసుకోవాలి?

మన భారత ప్రభుత్వం కొత్త అప్డేటెడ్ క్రోమ్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచన చేస్తోంది. ఈ కొత్త అప్డేట్ 22 రకాల security fixes సరిచేస్తుంది. CERT-In నివేదిక ప్రకారం, హ్యాకర్లు వినియోగదారుల ప్రైవేట్ సమాచారాన్ని సేకరించి.. ఇల్లీగల్ గా వాడుకొనే ప్రమాదం లేకపోలేదు. అలాగే వారు పరికరంలోకి మాల్వేర్‌ను ఇంజెక్ట్ చేయవచ్చు. అందువల్ల గూగుల్ వీలైనంత త్వరగా తమ బ్రౌజర్‌ను అప్‌గ్రేడ్ చేయాలని వినియోగదారులను కోరుతోంది.

Google pay: అదిరిపోయే ఫీచర్ తో గూగుల్ పే …!
Google ను ఇలా అప్డేట్ చేయండిలా.. ముందుగా గూగుల్ క్రోమ్ సెట్టింగ్స్ కి వెళ్ళాలి. తరువాత About section of Google క్రోమ్ కి వెళ్లి, వెర్షన్ చెక్ చేసుకోవాలి. అక్కడ update అవసరమైతే సూచిస్తుంది. వెంటనే update చేయండి.


Share

Recent Posts

రాజకీయ రంగంలోకి సౌత్ ఇండియాలో మరో టాప్ హీరోయిన్..??

దక్షిణాది సినిమా రంగంలో తుని దారులకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా తమిళ సినిమా రంగంలో అయితే హీరో లేదా హీరోయిన్ నచ్చాడు అంటే విగ్రహాలు కట్టేస్తారు...…

34 నిమిషాలు ago

“పుష్ప”లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది..పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు..!!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…

2 గంటలు ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

2 గంటలు ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

4 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

5 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

5 గంటలు ago