YSRCP: పార్టీకి ట్విస్టులు ఇస్తున్న ఎమ్మెల్యే..! రెండు సీట్లు కోసం పట్టు..!!

Share

YSRCP: రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినప్పటికీ అనతికాలంలో నియోజకవర్గంలో పాపులర్ అయి, ఆ వెంటనే పార్టీ మారి రాజకీయంగా ఎదుగుదలకు కారణమైన నేతపైనే పోటీ చేసి ఘన విజయం సాధించి తన దైన శైలితో ముందుకు సాగుతున్నారు గుంటూరు జిల్లాలోని ఓ మహిళా ఎమ్మెల్యే. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమెకు మంచి ఫాలోయింగ్‌ కూడా ఉంది. అయితే ఆమెకు ఎంత పేరు ఉందో అంతే స్థాయిలో వివాదాలు ఉన్నాయి. ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ ఆమెను పార్టీలోకి ఆహ్వానించి టికెట్ ఇచ్చారు. మంచి మెజార్టీతో ఆమె గెలిచారు. అయితే ఆమెకు జిల్లాలోని సొంత పార్టీ ఎంపీతో పడదు. అదే మరిదిగా సహచర ఎమ్మెల్యేలతోనూ సఖ్యత లేదు. పీఏలు ఎక్కువ మంది ఉండటంతో కొన్ని వివాదాలు వస్తున్నాయని అంటున్నారు. మంత్రి పదవి ఆశిస్తున్న ఆమె రాబోయే ఎన్నికలకు సంబంధించి  పార్టీ పెద్దల వద్ద ఓ కీలక ప్రతిపాదన పెట్టారని ప్రచారం జరుగుతోంది.

YSRCP Guntur dist women mla political strategy
YSRCP Guntur dist women mla political strategy

 

YSRCP: ఎంపీ, ఎమ్మెల్యే రెండు సీట్లు అడుగుతున్న మహిళా ఎమ్మెల్యే

అది ఏమిటంటే.. రాబోయే ఎన్నికల్లో ఆమె ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారుట. అదే క్రమంలో ప్రస్తుతం ఆమె ప్రతినిథ్యం వహిస్తున్న అసెంబ్లీ స్థానాన్ని తన కుటుంబ సభ్యులకు ఇవ్వాలని కోరుతున్నారుట. ఒక వేళ అలా కాకపోతే తాను ఎమ్మెల్యేగా పోటీ చేసినా తన కుటుంబంలోని వారికి ఎంపీ సీటు కావాలని ప్రతిపాదన పెట్టారుట. ఎంపీ టికెట్ తో పాటు ఎమ్మెల్యే సీటు ఇస్తే పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ఖర్చు అంతా కూడా తానే భరిస్తానని చెబుతున్నారుట. ఇప్పటికే తనకు ఉన్న సోషల్ మీడియా నెట్ వర్క్‌తో పాటు కన్సల్‌టెన్సీ ద్వారా కూడా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సర్వే చేయించుకుంటే, తను కానీ తన బంధువులు గానీ ఈ నియోజకవర్గం నుండి గెలుస్తారు అని నిర్ధారించుకున్న తరువాతనే పార్టీ వద్ద ఈ ప్రతిపాదన తీసుకువచ్చారని టాక్ నడుస్తోంది. ఈ ప్రతిపాదనలు పార్టీ పెద్దలు అంగీకరించలేదని సమాచారం. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ స్థానం నుండి కూడా మారేందుకు కూడా సిద్ధంగా ఉండాలని చెబుతున్నారుట.

ఎమ్మెల్యే టికెట్ అయితే కన్ఫర్మ్

ఎమ్మెల్యే టికెట్ అయితే కన్ఫర్మ్ కానీ ఎంపీ సీటు విషయంలో ఆశపెట్టుకోవద్దని వైసీపీ పెద్దలు చెప్పారని అంటున్నారు. ఇంకా రెండు సంవత్సరాలకు పైగా సమయం ఉన్నందున ఈలోపు పార్టీ పెద్దలను ఒప్పించవచ్చనే ధీమాలో ఆమె ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అదే నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడి ప్రస్తుతం ఎమ్మెల్సీ ఆశిస్తున్న నాయకుడు పార్టీలో ఉంటారా ఉండరా అనేది సందేహంగా ఉన్నట్లు సమాచారం. ఒక వేళ ఆయన జగన్మోహనరెడ్డిని నమ్ముకుని పార్టీలోనే ఉంటే రాబోయే ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయనకు ఎమ్మెల్యే సీటు ఇస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆమెకు ఎంపీగా పంపడమా లేక వేరే నియోజకవర్గానికి పంపించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇదంతా ఆమె సన్నిహితుల వద్ద అంతర్గతంగా నడిచిన సంభాషణలతో బయటకు వచ్చిన ప్రచారం. చూడాలి ఇంకా రెండున్నర సంవత్సరాలు ఉంది కదా నియోజకవర్గంలో రాజకీయాలు ఎలా మారనున్నాయో.


Share

Related posts

ఆచార్య లో ఇలాంటి మార్పులు జరుగుతున్నాయంటే కారణం ఏమై ఉంటుంది ..!

GRK

Blood Pressure: మందులు వాడకుండానే బీపీ తగ్గుతుంది.. ఎలాగంటారా..!?

bharani jella

రైతు దెబ్బకు ఢిల్లీ పీఠాలు కదులుతున్నాయి : దేశ రాజధానిలో టెన్షన్

Special Bureau