Google: 2021లో గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన వ్యక్తులు వీరే..!

Share

Most searched persons: మరికొన్ని రోజుల్లో పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పి నూతన సంవత్సరానికి వెల్కమ్ చెప్పబోతున్నాము. దాదాపు రెండు సంవత్సరాల పాటు కరోనా వైరస్ వలన ప్రజలు అందరు నానా తంటాలు పడ్డారు. మరో మూడు వారాల్లో ఈ ఏడాది ముగిసిపోతున్న తరుణంలో మళ్ళీ కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ రూపంలో విరుచుకుని పడుతుంది. కొత్త సంవత్సరం ముగిసే వేళలో మళ్ళీ కరోనా భయం అందరిలో కలిచివేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా గూగుల్ కొన్ని ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది. ఈ సంవత్సరం ఎక్కువ మంది గూగుల్‌లో వెతికిన వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. మరి ఈ జాబితాలో మొదటి స్థానాన్ని సొంతం చేసుకున్న వ్యక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే అనే చెప్పాలి.

ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్

అతను మరెవరో కాదు టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్న నీరజ్ చోప్రా. ఆయన గురించి ఈ ఏడాది గూగుల్ లో ఎక్కువమంది వెతికారు. ఇకపోతే ఆ తర్వాతి స్థానంలో డ్రగ్స్ కేసులో చిక్కుకున్న బాలీవుడ్ బాద్షా అని మనం ముద్దుగా పిలుచుకునే షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ నిలిచారు. ఇక మూడో స్థానంలో పంజాబీ నటి షెహనాజ్ గిల్ తో పాటు, బాలీవుడ్ నటి శిల్పా షెట్టి భర్త రాజ్ కుంద్రా కూడా నిలిచారు. ఆపై నాల్గవ స్థానంలో టెస్లా సంస్థ సీఈవో అయిన ఎలాన్ మస్క్ ఉన్నారు.

మోస్ట్ సెర్చ్డ్ స్టార్లు

వీరితో పాటు బాలీవుడ్ నటుడు అయిన విక్కీ కౌశల్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సిందు అలాగే రెజ్లర్లు బజరంగ్ పునియా, సుశీల్ కుమార్ కూడా తరువాత స్థానంలో ఉన్నారు. ఇక్కడ మీరు గమనించాలిసిన విషయం ఏంటంటే.. ఈ ఏడాది ఎక్కువ మంది గూగుల్ లో సెర్చ్ చేసిన వాళ్లలో ఎక్కువగా సినీమా వాళ్ళు, క్రీడాకారులే ఉండడం గమనార్హం. ఒక్క రాజకీయ నేత కూడా ఈ జాబితాలో లేకపోవటం గమనార్హం అనే చెప్పాలి. ఈ ఏడాది ఎక్కువమంది గూగుల్ లో సినిమా వాళ్ళ గురించి, క్రీడాకారుల గురించి మాత్రమే ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నించారు.


Share

Related posts

ఆ మంత్రి పనితీరు విషయంలో జగన్ ఫుల్ హ్యాపీ గా ఉన్నారట… ??

sekhar

AP CM Jagan – Megastar Chiru: మెగా స్టార్ చిరుకు ఏపి సీఎం జగన్ నుండి ఆహ్వానం .. ఎందుకంటే..

somaraju sharma

RRR : మగధీర ప్లాన్స్ మళ్లీ ఆర్ఆర్ఆర్ కి అప్లై చేస్తున్న జక్కన్న

GRK