TDP News: టీడీపీని నిండా ముంచేది వాళ్లే ..! లోకేష్ బాబు తీరు మారదా..!?

Share

TDP News: ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో సోషల్ మీడియా యాక్టివ్ అయ్యింది. గతంలో మీడియా అంటే రేడియో ఉండేది. ఆ తరువాత ప్రింట్ మీడియా పత్రికలు వచ్చాయి. ఎలక్ట్రానిక్ మీడియా టీవీలు వచ్చాయి. ప్రస్తుతం డిజిటల్ మీడియా, సోషల్ మీడియా యుగంగా మారిపోయింది. 2014 ఎన్నికల్లో, 2019 ఎన్నికల్లో సోషల్ మీడియాలో విపరీతమైన ప్రభావం చూపించింది. 2024 ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు (తప్పుడు) ఎక్కువ. అవాస్తవాలు, అబద్దాలు ఎక్కువ. సోషల్ మీడియా నిజాలు ప్రచారాలు చేయడానికి, మంచిని ప్రచారం చేయడానికంటే అవాస్తవాలు, చెడు ప్రచారాలు చేయడానికే ఎక్కువగా వాడుతున్నారు అనే చేదు నిజాన్ని అందరూ ఒప్పుకుని తీరాల్సిందే. ఎందుకంటే ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు వైసీపీ అయినా టీడీపీ అయినా సోషల్ మీడియాను నెగిటివ్ కోసం అలా వాడేస్తున్నాయి. ఇది చాలా దౌర్భాగ్యవంతమైన సంస్కృతి. ఇది ఆంధ్రప్రదేశ్ ఇంకా ఎక్కువ. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ ఈ సంస్కృతిని మొదలు పెట్టింది. కానీ ఇప్పుడు టీడీపీ దాన్ని పీక్స్ కు తీసుకువెళ్లి అమలు చేస్తోంది. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైసీపీ సోషల్ మీడియా వింగ్ అవాస్తవాలు, కల్పితాలు ప్రచారం చేస్తే టీడీపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ శ్రేణులు ఎంతగా ఇబ్బంది పడి తిరిగి కౌంటర్లు ఇచ్చుకున్నారో ఇప్పుడు టీడీపీ ప్రతిపక్షంగా ఉంటూ చేస్తున్న అవాస్తవ ప్రచారానికి వైసీపీ కూడా అదే పని చేస్తుంది. గతంలో టీడీపీ కంటే ఇప్పుడు వైసీపీ ఇబ్బంది పడుతోంది. కేసులు కడుతోంది. అందుకు సీఐడీ నమోదు చేస్తున్న కేసులే ఉదాహరణగా నిలుస్తున్నాయి.

social media TDP News

 

TDP News: ఫేక్ వీడియో సృష్టించిన వ్యక్తి అరెస్టు

నాడు వైసీపీ చేసిన తప్పులనే నేడు టీడీపీ చేస్తుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. 45 సంవత్సరాల ఎక్పీరియన్స్, దేశం మొత్తం తెలిసిన నాయకుడు, ప్రధాన మంత్రులను, రాష్ట్రపతులను నిర్దేశించిన పార్టీ నాయకుడు అని చెప్పుకున్న చంద్రబాబు.. ఇటువంటి ఫేక్ ప్రచారాలను వాడుకుంటారా. దీనికి కారణం ఏమిటి అంటే ఓ ఉదాహరణ ఉంది. మొన్న వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రచారానికి వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. అక్కడ ఆయన మహిళలతో మాట్లాడుతున్నప్పుడు ఇళ్ల సంగతి మాకు వదిలివేయండి అని చెబితే దాన్ని జగన్ ఏదో బూతు పదం వాడినట్లు టీడీపి సోషల్ మీడియాలో సృష్టించి వాటి అనుకూల యూట్యూబ్ ఛానల్స్ లో వదిలి విపరీతంగా వైరల్ చేశారు. దాని వల్ల జగన్మోహనరెడ్డి నిజంగానే బూతులు మాట్లాడినట్లు చాలా మంది నమ్మారు. కానీ ఆ వీడియో అవాస్తవం. జగన్మోహనరెడ్డి మాట్లాడని పదాన్ని వీళ్లు సృష్టించి దాన్ని ఏడిట్ చేసి నిజంగా మాట్లాడినట్లు వదిలారు. దానికి కారణమైన సంతోష్ రావు ఎలియాస్ సురేష్ కుమార్ ను నిన్న రాజమండ్రిలో అరెస్టు చేశారు. ఆ అరెస్టు కూడా నాటకీయంగా జరిగింది. టీడీపీ వాళ్లు చాలా మంది ప్రతిఘటించారు. ఫైట్ చేశారు కానీ సురేష్ కుమార్ చేసింది తప్పు. అతను ఇప్పుడు సీఐడీ ముందు ఒప్పేసుకున్నాడు. తానకు టీడీపీ వాళ్లు డబ్బులు ఇచ్చారు. టీడీపీ సోషల్ మీడియా విభాగం నుండి తనకు ప్రతి నెలా ఫేక్ ప్రచారాలు చేయడానికి డబ్బులు వస్తుంటాయి. అందుకే ఫేక్ ప్రచారాలను చేస్తున్నాను అని చెప్పేశాడు. సీఐడీ అధికారులు తమ అఫిషియల్ వెబ్ సైట్ లో సురేష్ కుమార్ మాట్లాడిన వీడియోను పెట్టారు. దీంతో టీడీపీ చేసిన ఫేక్ ప్రచారం బయటపడింది. అక్కడ సురేష్ కుమార్ ఒక్కడే దోషి కాదు. ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్ చూసే నారా లోకేష్, ఆ పార్టీకి అధినేత గా ఉన్న చంద్రబాబు కూడా దోషే. 45 సంవత్సరాల ఇండస్ట్రీ, ఒక్క కేసు లేదు, నిజాయిగా వ్యవహరిస్తున్నాం అని చెప్పుకునే ఆ వ్యక్తికి ఎందుకు ఈ దీనావస్థ. ఎందుకు ఈ దౌర్భాగ్య స్థితి. దానికి వాళ్లు సమాధానం ఏమని చెబుతారు, గతంలో వైసీపీ కూడా అలానే చేసిందిగా, ఫేక్ ప్రచారాలను ఇప్పుడు వైసీపీ చేస్తుంది కదా అంటూ సమర్ధించుకుంటారు.

టీడీపీకి మైనస్ గా మారుతున్న సోషల్ మీడియా

వైసీపీ అలా చేస్తే ప్రజలు చూస్తారు ఓడిస్తారు. లేదా వైసీపీ అలా చేస్తే టీడీపీ కౌంటర్ ఇవ్వచ్చు కానీ లేనిది సృష్టించడం దేనికి, వాళ్లు తప్పు చేశారు కాబట్టి మేము తప్పుచేస్తామంటారా ? అది రాజకీయమా ? ఇప్పుడు తెలుగు దేశం పార్టీకి ప్రధాన మైనస్ గా మారుతున్నది సోషల్ మీడియానే. దానితో పాటు కొన్ని ఛానల్స్. తెలుగు దేశం పార్టీని డామేజ్ చేస్తున్నది. తెలుగుదేశం పార్టీని నిలువునా ముంచేస్తున్నది కొన్ని సోషల్ మీడియా ఛానల్స్, నారా లోకేష్ వద్దకు వెళ్లి ఫోటోలు దిగి చంద్రబాబుతో పరిచయం పెంచుకుని ఆ పార్టీ ఇచ్చే డబ్బులతో కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ బతుకుతున్నాయి. కానీ అవాస్తవాలు ప్రచారాలు చేయడం వల్ల ఆ పార్టీ మునిగిపోతుందా లేదా. వాళ్ల దగ్గర కంటెంట్ ఉండదు. సబ్జెక్ట్ ఉండదు. ప్రజలను ఎలా రియలైజ్ చేయాలి, జగన్మోహనరెడ్డి చేస్తున్న తప్పులు ఏమిటి. నిజమైన తప్పులను ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలి. టీడీపీని ఎలా బలోపేతం చేయాలి, వైసీపీ చేస్తున్న తప్పులను ప్రజలకు ఎలా అర్ధమయ్యేలా చెప్పాలి అనే కంటెంట్ ఉండదు. అందుకే లేనిపోని ఫేక్ వి సృష్టించి ప్రచారం చేస్తుంటారు. అటువంటి ప్రచారం తప్పు, అటువంటి ప్రచారం వల్లనే ఎల్లో మీడియా అని కమ్మ మీడియా అని దారుణమైన విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలా తప్పుడు ప్రచారాలు చేయడం వల్ల భవిష్యత్తులో నిజాలు చెప్పినా ప్రజలు నమ్మని పరిస్థితి వస్తుంది. ఇటువంటి ఫేక్ ప్రచారాలను చేసే సోషల్ మీడియా ఛానల్స్ ను టీడీపీ పక్కన పెట్టకపోతే ఆ పార్టీకే తీరని నష్టం కలుగజేస్తుంది.


Share

Recent Posts

Devatha 11August 622: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దేవి.. మా నాన్న ఎవరో చెప్పకపోతే రానన్న దేవి..

దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…

50 mins ago

కొత్త సినిమా నిర్మాతలకు డెడ్ లైన్ పెట్టిన బాలకృష్ణ..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…

53 mins ago

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

3 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

4 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

5 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

7 hours ago