NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Three Capitals: మూడు రాజదానుల అనుకూల రాయలసీమ మేథావుల బహిరంగ సభలో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన మహిళలు..

AP Three Capitals: రాష్ట్రంలో రాజధాని అంశం హాట్ టాపిక్ నడుస్తోంది. ప్రభుత్వం, వైసీపీ మూడు రాజధానులకు అనుకూలంగా వ్యవహరిస్తుండగా, టీడీపీతో సహా ఇతర రాజకీయ పక్షాలు అన్నీ అమరావతినే రాజధానిగా కొనసాగిస్తూ మూడు ప్రాంతాలను అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి. తిరుపతిలో నిన్న అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి రైతు జేేఏసి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించగా, అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా రాయలసీమ మేధావుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నేడు తిరుపతి తుడా ఇందిరా మైదానంలో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో రిటైర్డ్ న్యాయమూర్తులు, ప్రొఫెసర్లు, రచయితలు, మేథావులు పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అభివృద్ధి ఒకే చూట కేంద్రీకృతం కారాదని నేతలు ప్రసంగాలు చేశారు. ఈ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు, మహిళలు, విద్యార్ధినీ విద్యార్ధులు హజరైయ్యారు.

AP Three Capitals: అమరావతిలోనే రాజధాని

అయితే సభకు హజరైన పలువురు మహిళలను ఓ టీవీ ఛానల్ రాజధాని ఎక్కడ ఉండాలని ప్రశ్నించగా వారు అమరావతిలోనే రాజధాని ఉండాలని పేర్కొని ట్విస్ట్ ఇచ్చారు. సభకు హజరు కావాలని వైసీపీ నేతల నుండి సమాచారం రావడంతో వచ్చామని పలువురు డ్వాక్రా మహిళలు పేర్కొన్నారు .రాష్ట్రంలోని 13 జిల్లాలకు సెంటర్ పాయింట్ గా ఉన్న అమరావతి రాజధానిగా ఉంటేనే మేలు అని సభకు హజరైన మహిళలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కాగా అభివృద్ధి వికేంద్రీకరణ, రాయలసీమ అభివృద్ధి ఆవశ్యకతపై వక్తలు ప్రసంగించారు. ఈ సందర్భంగా 13 డిమాండ్ లు చేసారు. రాయలసీమ అధ్యనాల సంస్థ అధ్యక్షుడు భూమన్ (తిరుపతి), రాయలసీమ మహాసభ అధ్యక్షుడు, రచయిత శాంతి నారాయణ (అనంతపురం), రాయలసీమ కార్మిక, కర్షక సమితి అధ్యక్షుడు సీహెచ్‌ చంద్రశేఖర్‌ రెడ్డి (కడప), కుందూ పోరాట సమితి అధ్యక్షుడు వేణుగోపాల్‌ రెడ్డి (కర్నూల్‌) పాల్గొన్నారు.

ప్రధాన డిమాండ్ లు..

  • కార్యనిర్వహక రాజధానిగా విశాఖ కొనసాగించాలి
  • ఉప సచివాలయాలను రాయలసీమ, అమరావతిలో ఏర్పాటు చేయాలి
  • న్యాయ రాజదానిగా కర్నూలును కొనసాగించాలి
  • హైకోర్టు బెంచ్ ఉత్తరాంధ్ర, అమరావతిలో ఏర్పాటు చేయాలి
  • శాసనరాజధానిగా అమరావతిని కొనసాగించాలి
  • విశాఖ, రాయలసీమలో ఏటా ఒక సారి శాసనసభ సమావేశాలు నిర్వహించాలి

author avatar
sharma somaraju Content Editor

Related posts

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N