న్యూస్

Pushpa: పార్ట్ 2 లేదా పుష్పా?

Share

Pushpa: పార్టీ లేదా పుష్పా? అవును.. నిన్న బన్నీ అభిమానులు పార్టీ చేసుకున్నారు. సంబరాలు జరుపుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో బెనిఫిట్ షోలు వేయలేదు కానీ, తెలంగాణాలో బెనిఫిట్ షోలు ముందే వేయడం వలన టాక్ ముందే బయటకు వచ్చేసింది. సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. సదరు సినిమా క్రూ కూడా సీమ టపాకాయలు పేల్చింది. మొత్తానికి అనుకున్న టాక్ బయటకు రావడంతో సినీ దర్శకుడు సుకుమార్, బన్నీ పార్టీలు జరుపుకున్నారు. అంతవరకు బాగానే వుంది. కానీ!

Pushpa: ప్లస్ అవుతుందనుకున్న సమంత ఐటెం సాంగ్ పుష్పకు ఇప్పుడు మైనస్ ..?
ఈరోజు టాక్ ఏమిటి?

నిన్న పాజిటివ్ టాక్ కాస్త, రోజు మారేసరికి కొంచెం చేంజ్ అయింది. అవును.. కాస్త మిక్స్డ్ టాక్ ఇపుడు నడుస్తోంది. అయితే సుకుమార్ టేకింగ్ నచ్చిన అభిమానులు, బన్నీ అభిమానులు మాత్రం సినిమాను ఎత్తేస్తున్నారు. ‘అమ్మతోడు.. పుష్ప బుర్రపాడు’ అంటూ నినాదాలు చేస్తున్నారు. మెల్లగా టాక్ మారుతుంది అనే ధీమాగా వుంది చిత్ర యూనిట్. ఏది ఎలా వున్నా, సమంత ఐటెం సాంగ్ కి మాత్రం భారీ రెస్పాన్స్ వస్తోంది. సమంతకు ఇది మంచి బ్రేకింగ్ అని చెప్పుకోవాలి. మొత్తం సినిమాకే సమంత హైలెట్ అని బయట టాక్ నడుస్తోంది.

Pushpa: పుష్ప సినిమాలో సమంత సాంగే నంబర్ 1..!
“పార్టీ లేదా పుష్పా” ఏమిటి?

పుష్ప ట్రైల‌ర్‌ లో మనకు వినబడిన డైలాగ్ ఇది. ఫ‌హ‌ద్ ఫాజిల్ చెప్పిన ఈ డైలాగ్ బాగానే పేలింది. అయితే ఫ‌హ‌ద్ ఫాజిల్ సినిమాలో ఆ డైలాగ్ వరకే పరిమితం అట. ఇకపోతే, ఆ డైలాగ్ ఇపుడు సినిమాకు ప్లస్ అవ్వక పోగా నెగిటివ్ గా మారింది. పార్టీ లేదా పుష్పా కాస్తా.. పార్ట్ 2 లేదా పుష్పా గా మారిపోయింది. అవును.. టాక్ కాస్త తేడాగా రావడంతో ఇపుడు సోషల్ మీడియాలో “పార్ట్ 2 లేదా పుష్పా” అనే హాష్ టాగ్ వైరల్ అవుతోందని టాలీవుడ్ వర్గాలు గుసగుసలు ఆడుకుంటున్నాయి.


Share

Related posts

యూపీలో గో సంక్షేమ పన్ను

Siva Prasad

లోకేష్ బుక్ అయినట్లేనా..!?

Special Bureau

Big Breaking: మళ్ళీ మూడు రాజధానులు బిల్లు.. అసెంబ్లీలో ఎప్పుడంటే..!?

Muraliak