Honey : తేనె ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది. ఒక్క ఆరోగ్యానికి మాత్రమే కాదు అతివల అందాన్ని రెట్టింపు చేసే విషయంలో కూడా తేనె చాలా ఉపయోగకరంగా ఉంటుంది.ఇది చర్మాన్ని యవ్వనంగా ఉంచడమే కాకుండా మొటిమలు, మచ్చలను తగ్గిస్తుంది.నిజానికి చాలా మంది తేనెను ఎలా ఉపయోగించాలో తెలియక ప్రతి దానిలోనూ తేనెను వాడుతూ ఉంటారు. కానీ అలా తేనెను ఉపయోగించడం మంచిది కాదు.ఒక రకంగా చెప్పాలంటే అది విషం లాంటిది అనే చెప్పాలి. మరి తేనె ఏయే పదార్థాలతో కలిసి తింటే శరీరానికి హానికరమో అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందామా..!
Honey : ఏ ఏ పదార్ధాలతో తేనెను కలిపి తీసుకోకూడదో తెలుసా..?
చాలామందికి టీ,కాఫీలను వేడి వేడిగా తాగే అలవాటు ఉంటుంది. అయితే కొంతమంది మాత్రం వేడి వేడి టీ, కాఫీలలో తేనెను కలుపుకుని తాగుతూ ఉంటారు. కానీ అలా చేస్తే శరీరం అలసట, ఒత్తిడికి గురవుతుంది.ఇంకా తేనెను ముల్లంగితో కలిపి ఎట్టి పరిస్థితులలో తీసుకోకూడదు.ఎందుకంటే ఇలా ముల్లంగిలో తేనెను కలిపి తీసుకుంటే శరీరంలో విషాన్ని పెంచుతుంది.అలాగే అజీర్ణం వంటి జీర్ణ సంబంధత సమస్యలు వస్తాయి.ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వేడి వేడి ఆహారంతో తేనె తీసుకోకూడదు. అలాగే మిరపకాయలతో కూడా తేనెను తినకూడదు వేడి లేదా మరిగే పాలలో అసలు అనుకోకుండా తేనె కలపవద్దు. ఈ పాలు శరీరానికి విషంలా మారతాయి.నెయ్యి,వెన్నతో పాటు కూడా తేనె అసలు తీసుకోవద్దు. ఈ రెండింటినీ కలిపి తింటే నెయ్యిలోని గుణాలు తగ్గిపోతాయి.అలాగే నాన్ వెజ్ తో కలిపి తేనె తీసుకోవడం ఆరోగ్యానికి ప్రమాదకరం.
తేనెను ఏ ఏ పదార్థాలతో తీసుకోవాలంటే?
రోజు ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో తేనెను తీసుకోవడం మంచిది.. బాగా మరిగిన నీటిలో అసలు తేనే వేయకూడదు. గోరువెచ్చని నీటిలో మాత్రమే తేనెను తీసుకోవాలి. క్యారెట్ రసంలో తేనె కలిపి తీసుకుంటే కంటి చూపు మెరుగుపడుతుంది. అలాగే మీరు ప్రతిరోజు తేనెను ముఖానికి రాసుకుంటే మొటిమల సమస్య తొలగిపోతుంది.అలాగే తేనెను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తేనె పిల్లలకు, పెద్దలకు ఔషధంలా పనిచేస్తుంది.