Hyderabad: అమాయకులకు అందంతో వల వేయడం.. అందినకాడికి దోచేయడం నయా ట్రెండ్‌గా మారింది. ఇటీవలి కాలంలో కొందరు యువతులు ఫేస్‌బుక్ వేదికగా మగవారికి టోకరా వేస్తున్నారు. తీయటి మాటలు చెబుతూ తమ అందాన్ని పెట్టుబడిగా పెట్టి ఆ తర్వాత మగవారిని నిలువునా దోచేస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని మలక్‌పేట్ లో వెలుగు చూసింది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఒక యువతిని నమ్మి ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రూ.1 లక్ష పోగొట్టుకున్నాడు. చివరికి ఆ యువతి వేధింపులు తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించాడు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
నగ్నంగా వీడియో కాల్..
వివరాల్లోకి వెళితే.. మలక్‌పేట్‌కు చెందిన ఓ వ్యక్తి ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతనికి ఫేస్‌బుక్‌లో ఒక యువతి పరిచయమైంది. ఆ యువతి కైపెక్కించే మాటలతో అతనికి మరింత దగ్గరయింది. కొద్దిరోజుల్లోనే అతడి నంబర్ కూడా తీసేసుకుంది. తర్వాత వలపువల విసురుతూ మాట మాట కలిపి అడల్ట్ చాట్ చేయడం ప్రారంభించింది. ఒక రోజు ఏకంగా నగ్నంగా తయారై వీడియో కాల్ చేసింది. అది చూడగానే అతనికి ఒక్కసారిగా మతిపోయింది. అదంతా కామన్ అన్నట్లు ఆమె అతడిని కన్విన్స్ చేసి అతన్ని కూడా నగ్నంగా మార్చింది. అలా వారిద్దరూ ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా వీడియోకాల్ మాట్లాడుకున్నారు. ఈ వీడియో కాల్ ని అతడికి తెలియకుండా ఆమె రికార్డ్ చేసింది.
బ్లాక్ మెయిలింగ్..
మరుసటి రోజు ఈ వీడియో కాల్ రికార్డింగ్ ని ఆమె సదరు ఉద్యోగికి పంపించింది. తాను అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే వీడియోని పోర్న్ సైట్ లలో అప్‌లోడ్ చేస్తానని బెదిరించింది. దాంతో తన పరువు ఎక్కడ పోతుందో అని భయపడ్డ సదరు బాధితులు వెంటనే ఆమెకు లక్ష రూపాయలు ఇచ్చుకున్నాడు. రెండు రోజుల తర్వాత ఆ కిలేడీ మళ్లీ డబ్బులు డిమాండ్ చేయడంతో చేసేది లేక పోలీసులను ఆశ్రయించాడు. దీంతో హైదరాబాద్ సైబర్ క్రైం బ్రాంచ్ పోలీసులు అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన తాజా చిత్రం `కార్తికేయ 2`. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ…
ఆద్యంతం ట్విస్టులు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో కట్టిపడేసిన దృశ్యం, దృశ్యం-2 సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ విభిన్న…
మానవుని శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా చాలా ముఖ్యమైనదే అని చెప్పడంలో. ఏ మాత్రం అతిశయోక్తి లేదనే చెప్పాలి.ముఖ్యంగా మానవుని శరీరంలో కిడ్నీలు ప్రధాన పాత్ర…
`భీష్మ` తర్వాత సరైన హిట్ లేక సతమతం అవుతున్న యంగ్ హీరో నితిన్.. రీసెంట్గా `మాచర్ల నియోజకవర్గం`తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై…
ఇటు సోషల్ మీడియా, అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో గత కొద్ది రోజులుగా నరేష్, పవిత్ర లోకేష్ ల రిలేషన్ షిప్ వార్తలు హల్ చల్…
టీ.... ఈ పేరు చెబితే చాలు ఎక్కడిలేని ఎనర్జీ పుట్టుకుని వస్తుంది. ఈ ప్రపంచంలో ఎంతో మంచి టీ ను బాగా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. కొందరికి…