Partner: రాత్రిపూట కచ్చితంగా
సన్నగా, నాజూగ్గా కనిపించాలనే కోరిక ఇంచుమించు గా చాలా మందిలో ఉంటుంది. పొట్ట బయటకు తన్నుకు వస్తున్నా పొట్ట తగ్గి సన్నబడితే బావుండు అనే ఆలోచన పెరిగిపోతూ ఉంటుంది. సన్నగా మరలనుకునే వారు రాత్రిపూట కచ్చితం గా ఈ పనులు రెగ్యులర్ గా చేసిచూడండి.
Partner: త్వరగా తినడం
రాత్రి 7గంటలముందే తినడం, తాగడం వంటివి పూర్తి చేసేయండి. దాహం అనిపిస్తే కాసిన్ని మంచి నీళ్ళు తప్ప మరే ఇతర ఆహారం తినేప్రయత్నం చేయకండి. రాత్రిపూట తినే ఆహారం కొవ్వుగా మారుతుంటుంది. కాబట్టి ఈ పద్దతి అలవాటు చేసుకోండి.
టీ, కాఫీ తాగితే నిద్రకు ఉపక్రమించే ముందు టీ, కాఫీ తాగితే జీవక్రియ ప్రభావితం అయి నిద్ర దూరం అవుతుంది. అందుకోసమా పడుకునే ముందుటీ,కాఫీ లకు నో చెప్పండిసమయం కుదరక రాత్రి ఆహారం తీసుకున్న తర్వాత ఎక్సయిజ్ చేసే వారు కూడా ఉంటారు. వారికీ సమయం కుదరక ఇలా చేస్తుంటారు. అది అసలు మంచి పద్దతి కాదు. ఇది ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి.
మరి ఎక్కువ నీళ్లు
నీళ్ళు తాగినా కూడా జీవక్రియ తన పని తాను చేయాల్సి ఉంటుంది. నిద్రలో దానికి కూడా విశ్రాంతి కావలి కాబట్టి అదేపనిగా నీళ్ల తో పొట్ట నింపకుండా కొంచెం పొట్ట ఖాళీగా ఉండేలా చుస్తే మంచిది. అలా ఎక్కువ నీళ్లు తాగడం అనేది నిద్రాభంగానికి కారణం కావచ్చు.
ప్రోటీన్స్ కి దూరం
ప్రోటీన్స్ ,పిండి పదార్ధాల వలన కొవ్వు పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రోటీన్ వల్ల గ్యాస్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే రాత్రిపూట వీటికి వీలయినంత దూరం గా ఉంటూ తేలికగా జీర్ణం అయ్యే పండ్లు, కూరగాయలు తింటుంటే మంచి ప్రయోజనం ఉంటుంది.