న్యూస్ హెల్త్

మన దేశ విస్కీ ప్రపంచానికే కిక్ ఇస్తుంది !!

Share

యావత్ ప్రపంచాన్ని ఇండియన్ బ్రాండ్ విస్కీ మిథున (Mithuna) మత్తులో మంచెత్తెత్తోంది. ఇంక ఇది ఇచ్చే కిక్కుకు ప్రపంచమంతా ఫిదా అవుతుంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా మిథున విస్కీ పేరు మారు మోగిపోతోంది. మిథున విస్కీ “జిమ్ ముర్రే విస్కీ బైబిల్ 2021” లో చోటు సంపాదించుకోవడంతో తన బ్రాండ్ వాల్యూని మరింత పెంచుకుంది. ఈ మిథున విస్కీని పాపులర్ విస్కీ జిమ్ ముర్రే ఉద్దేశిస్తూ “a Whisky to devour” అంటూ అభివర్ణించటం విశేషమని చప్పుకోవచ్చు. దీని టేస్ట్ అల్టిమేట్ అని అలాగే దీనికి మిథున అని పేరు పెట్టడం అత్యంత సరైనదాని కూడా ఆయన అన్నారు.

 

ఈ సింగిల్ మాల్ట్ విస్కీని పాల్ జాన్ కంపెనీ తయారు చేస్తున్నారు. నవంబరు 2020, లో ఈ విస్కీ ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు. మిగతా బ్రాండ్లతో పోలిస్తే ఇంత తక్కువ సమయంలోనే మిథున 97 స్కోర్ సాధించింది. అంతేకాకుండా ఈ విస్కీ “ఏషియన్ విస్కీ ఆఫ్ ద ఇయర్ 2021” అవార్డు కూడా సొంతం చేసుకోవడం విశేషం. గతంలో పాల్ జాన్ కంపెనీ “కన్యా” (Kanya) అనే విస్కీ బ్రాండ్ నువిడుదల చెయ్యగా అది “2018 ఏషియన్ విస్కీ ఆఫ్ ది ఇయర్” అవార్డును గెలుచుకుంది. రాశుల పేర్లతో విస్కీకి పేర్లు పెట్టి ప్రపంచాన్ని మత్తులో ముంచెత్తుతున్నారు.

ఈ సంస్థ సగర్వంగా స్పైస్ ఫ్లోట్,  డార్క్ కోకోవా టోన్స్, హనీ క్రిస్ప్ టోస్ట్,  కాఫీ మోచా ఫ్లేవర్స్, వనీలా నోట్స్ ను వాడడంతో మిథున టేస్ట్ అదిరిపోయేలా ఉంటుందని సదరు గ్లోబల్ మార్కెట్లో చెబుతోంది. గోవాలో లభ్యమయ్యే సహజసిద్ధమైన రా మెటీరియల్‌ తో తయారవుతున్న ఈ డ్రింక్స్ ఇటీవల కాలంలో బాగా ఫేమస్ అవుతున్నాయి.


Share

Related posts

Bandi Sanjay: కెసిఆర్ జైలుకుపోవడం పక్కా!బిజెపి సంజయ్ కీలక వ్యాఖ్యలు!

Yandamuri

RRR – Radhe shyam: పాన్ ఇండియన్ సినిమాలు ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ పోస్ట్‌పోన్..అదే జరిగితే ఇండస్ట్రీ మొత్తం నష్ఠాల్లోనే ..!

GRK

Amaravathi : అమరావతి మహిళా రైతుల నిరసన – వారధిపై ఉద్రిక్తత..అరెస్టులు

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar