Bigg boss 5 : ‘బిగ్ బాస్ 5’ కి సంబంధించి ఈ మధ్యనే రక రకాల వార్తలు మొదలై సోషల్ మీడియాలో వచ్చి వైరల్ అవుతున్నాయి. సీజన్ 5కి కూడా హోస్ట్ గా నాగార్జున అని ఒక ప్రచారం జరుగుతోంది. అదే నంబర్ వన్ యారీతో మంచి హోస్ట్‌గా పేరు తెచ్చుకున్న రానా దగ్గుబాటిని నిర్వాహకులు ఈసారి హోస్ట్ గా వ్యవహరించడానికి సంప్రదించినట్టు తెలుస్తోంది. దాదాపు రానా హోస్ట్‌గా వ్యవహరించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై త్వరలో అధికారుల నుంచి ఓ స్పష్టత రానుంది. ఇక ఇందులో పార్టిసిపేట్ చేసే కంటెస్ట్స్ గురించి రక రకాల వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే పాయల్ రాజ్ పుత్ సీజన్ 5లో పాల్గొనబోతుందని వార్తలు రాగా…అవన్ని వట్టి పుకార్లేనని ఇటీవల పాయల్ రాజ్ పుత్ క్లారిటీ ఇచ్చింది. కాగా ‘బిగ్ బాస్ 5’ కోసం ప్రముఖ హాస్యనటుడు ఆలీ ని బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదిస్తున్నట్టు తాజా సమాచారం. అయితే కంటెస్టెంట్ గానా లేక స్పెషల్ ప్రోగ్రామ్ చేయించడానికా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది. ఆలీ ప్రస్తుతం హోస్ట్ గా అలాగే సినిమాలతో, సీరియల్ తో చాలా బిజీగా ఉన్నాడు. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ 5 కోసం ఆలీ ఒప్పుకుంటాడా అన్నది ఆసక్తికరంగా మారింది.
Bigg boss 5 : ‘స్టార్ మా’ వారు హోస్ట్ గా ఈసారి ఎవరిని హోస్ట్ గా ఫిక్స్ చేస్తారో చూడాలి.
ఇప్పటికే పలు కార్యక్రమాలకి హోస్ట్ గా వ్యవహరించి సక్సెస్ అయిన ఆలీ, ‘బిగ్ బాస్’ సీజన్ 5 హోస్ట్ తో పాటుగా స్టేజ్ మీద ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. గతేడాది ఇచ్చిన సర్ప్రైజెస్లాగానే వీకెండ్ లో స్పెషల్ గెస్టులను పిలిచి షో ను మరింత ఇంట్రెస్టింగ్ గా మలచడానికి నిర్వాహకులు గట్టిగానే సన్నాహాలు చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఇక తెలుగు ‘బిగ్ బాస్ 1’కు ఎన్టీఆర్, సీజన్ 2కు నాని, మూడు నాలుగు సీజన్లకు ‘కింగ్’ అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. మరి ‘స్టార్ మా’ వారు హోస్ట్ గా ఈసారి ఎవరిని హోస్ట్ గా ఫిక్స్ చేస్తారో చూడాలి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!