Allu arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు ‘పుష్ప’ అనే పాన్ ఇండియన్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సుకుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో భారీ బడ్జెట్ కేటాయించి తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీస్ కలిసి ముత్యం శెట్టి మీడియా మొదటిసారి నిర్మాణంలోకి అడుగుపెట్టి 200 కోట్ల బడ్జెట్ తో రెండు భాగాలుగా 5 భాషలలో నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
అన్నీ అనుకున్నట్టుగా పూర్తయితే ‘పుష్ప’ పార్ట్ వన్ ఈ ఏడాదిలోపే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. మాస్ అంటే ఊర మాస్ క్యారెక్టర్లో అల్లు అర్జున్ తగ్గేదేలే అనే లెవల్లో ‘పుష్ప’ రూపొందుతోంది. ఇక ఈ సినిమా చేస్తూనే అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ప్లానింగ్ కూడా స్టార్ట్ అయినట్టు సమాచారం. డైరెక్టర్ వేణు శ్రీరామ్ తో’ఐకాన్’ అనే సినిమా చేసేందుకు అల్లు అర్జున్ సిద్దమవుతున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాకి ‘కనుబడుట లేదు’ అనే ట్యాగ్‌లైన్ మీద ముందు నుంచి ఆసక్తికరమైన చర్చలు నడిచాయి. ఈ ట్యాగ్ లైన్ కి అర్థం ఏంటీ అని అభిమానులు ఆరా తీస్తున్నారు.
Allu arjun : అల్లు అర్జున్ అంధుడిగా కనిపించబోతున్నట్టు సమాచారం.
ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఎప్పుడో మొదలవ్వాల్సిన ఈ సినిమా అనివార్య కారణాల వల్ల డిలే అవుతూ వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ ప్రాజెక్ట్ సుకుమార్ చేస్తున్న ‘పుష్ప’ మొదటి భాగం పూర్తవగానే ‘ఐకాన్’ సినిమా సెట్స్ మీదకి తీసుకు వచ్చే సన్నాహాలు చేస్తున్నారు. కాగా ‘ఐకాన్’ లో అల్లు అర్జున్ అంధుడిగా కనిపించబోతున్నట్టు సమాచారం. అందుకే ట్యాగ్‌లైన్ ‘కనుబడుట లేదు’ అని పెట్టినట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!