Ram : రామ్ పోతినేని హీరోగా ఓ బైలింగ్వెల్ మూవీలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి ‘ఉస్తాద్’ అనే టైటిల్ పరిశీలిస్తోంది చిత్ర బృందం. ఇక ఈ సినిమాలో ‘ఉప్పెన’ సినిమాతో సౌత్ మొత్తం క్రేజ్ సంపాదించుకున్న యంగ్ బ్యూటీ కృతీ శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. కాగా రామ్ కెరీర్ లో 19వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది. అధికారకంగా ఈ విషయాన్ని చిత్ర బృందం వెల్లడిస్తూ రామ్ లుక్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరోసారి ఇస్మార్ట్ శంకర్ లాంటి కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు.
మొదటిసారి తెలుగు తమిళ భాషలో ఒకేసారి రూపొందనుండగా.. అన్నీ అనుకున్నట్టుగా పూర్తయితే ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేయనున్నారు. ఇక ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి సోషల్ మీడియాలో బాగా వైరల్ న్యూస్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా తమిళ హీరో ఆర్య ఇందులో విలన్ గా నటించనున్నాడనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ద్విభాషా చిత్రం కావడంతో అటు తమిళం, ఇటు తెలుగు భాషలలో క్రేజ్ ఉన్న నటుడిని తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
Ram : ఆర్య కనిపించిన సినిమాలు తెలుగులో ఫ్లాపయ్యాయి. ఇది కూడా ఒకవైపు వినిపిస్తోంది.
ఇప్పటికే ఆర్య అల్లు అర్జున్, అనుష్క లాంటి స్టార్స్ నటించిన తెలుగు సినిమాలలో నటించాడు. దాంతో ఆయనని విలన్ గా తీసుకుంటే ప్రాజెక్ట్ కి బాగా ప్లస్ అవుతుందని మేకర్స్ ప్లాన్ చేశారని టాక్ వినిపిస్తోంది. అయితే ఇక్కడ ఒక బ్యాడ్ సెంటిమెంట్ కూడా ఉంది. ఆర్య కనిపించిన సినిమాలు తెలుగులో ఫ్లాపయ్యాయి. ఇది కూడా ఒకవైపు వినిపిస్తోంది. మరి మేకర్స్ నిజంగా రామ్ ‘ఉస్తాద్’ సినిమాలో విలన్‌గా ఆర్యని తీసుకున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది. మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న రామ్ రెడ్ సినిమాతో డిసప్పాయింట్ అయ్యాడు. మరి ఇప్పుడు చేస్తున్న సినిమాతో హిట్ అందుకుంటాడా లేదా చూడాలి. కాగా రామ్ మరికొన్ని ప్రాజెక్ట్స్‌ని లైనప్ చేసుకుంటున్నట్టు సమాచారం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!