హను రాఘవ పూడి, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో వచ్చిన కృష్ణగాడి వీరప్రేమ గాధ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా. మొదటి సినిమాతోనే టాలీవుడ్ లో మేకర్స్ దృష్ఠిని బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ లో ఫిలౌరీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాలీవుడ్ లో మంచి హిట్ గా నిలిచింది. ఇలా తెలుగు, హిందీల భాషల్లో నటించిన రెండు డెబ్యూ సినిమాలు సూపర్ హిట్ అవడంతో మెహ్రీన్ కి ఇక తిరుగుండదు..స్టార్ హీరోయిన్ అయిపోతుందనుకుంది.
టాలీవుడ్ లో కూడా ఆ తర్వాత నటించిన మహానుభావుడు, రాజాది గ్రేట్ సూపర్ హిట్స్ గా నిలిచాయి. వరసగా మూడు హిట్ సినిమాలలో నటించి హ్యాట్రిక్ ని సాధించింది మెహ్రీన్. కాని ఈ సక్సస్ ని కంటిన్యూ చేయలేకపోయింది. జవాన్, నోటా, అంతం, కవచం లాంటి సినిమాలు ఒప్పుకొని ఫ్లాప్ హీరోయిన్ అన్న పేరు తెచ్చుకుంది. అయితే సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లతో ఎఫ్ 2 వంటి బ్లాక్ బస్టర్ ని తీశాడు. ఈ సినిమాలో మెహ్రీన్ వరున్ తేజ్ కి జంటగా నటించింది. అంతేకాదు ఈ సినిమాతో మళ్ళీ ఫాం లోకి వచ్చిందనుకుంటే మళ్ళీ ఏవో కథ లను ఒప్పుకొని తప్పు చేసింది.
పంజాబి సినిమాలో నటిస్తూ అక్కడ అడుగు పెట్టిన మెహ్రీన్ గోపీచంద్ హీరోగా వచ్చిన చాణక్య, అలాగే కళ్యాణ్ రాం హీరోగా వచ్చిన ఎంత మంచి వాడవురా సినిమాలు చేసింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ భారీ డిజాస్టర్స్ గా మిగిలాయి. దాంతో మెహ్రీన్ చేతిలో ఒక్క సినిమా లేకుండా పోయింది. ఈ సంవత్సరం ఎన్నో ఆశలు పెట్టుకొని యంగ్ హీరో నాగ శౌర్య తో అశ్వథ్థామ సినిమాలో నటించిన మెహ్రీన్ కి ఈ సినిమా ఏమాత్రం ఉపయోగపడలేదు. చెప్పాలంటే సరైన కథలను ఎంపిక చేసులేక మెహ్రీన్ తన కెరీర్ ని తనే రిస్క్ లో పడేసుకుందని అంటున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!