Nagarjuna: టాలీవుడ్ కింగ్ నాగార్జున సినిమాల విషయంలో ఎప్పుడు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారో ఎవరూ చెప్పలేము. బిజినెస్ పరంగా నాగార్జున నిజంగానే కింగ్ అని చెప్పాలి. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుండే నాగ్ తన సినిమాల రిలీజ్ విషయంలో కూడా ఎవరీనీ ఎక్కువ రోజులు వెయిట్ చేయించరు. కరోనా వల్ల గ్యాప్ వచ్చింది గానీ లేదంటే ఈ పాటికి ఓ నాలుగు సినిమాలనైనా రిలీజ్ చేసేవారు. అందుకే ఈ గ్యాప్‌ను ఫుల్‌ఫిల్ చేయడానికి రెడీ అవుతున్నారు.
ఆయన హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ బంగార్రాజు. నాగార్జున ఇంతకముందు నటించిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా కు సీక్వెల్ అనే టాక్ వినిపిస్తోంది. అయితే నాగ్ బృందం మాత్రం ఇది సీక్వెల్ కాదు అదే తరహాలో ఉండే ఓ కొత్త కథ అని చెభుతున్నారు. ఇక బంగార్రాజు సినిమా షూటింగ్ ఇటీవలే మొదలై శరవేగంగా షూటింగ్ సాగుతూ ప్రస్తుతం చిత్రీకరణ ముగింపు దశకు చేరిందంటున్నారు. మూడు నెలలు కూడా పూర్తి కాకుండా చిత్ర దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాన కంప్లీట్ చేశాడు.
Nagarjuna: నాగ్ ‘బంగార్రాజు’ సినిమాను రిలీజ్ చేయాలని పెద్ద రిస్క్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.
ఇటీవలే ఈ సినిమాలో నాగ చైతన్యకు జంటగా నటిస్తున్న కృతి శెట్టి పాత్రకు సంబంధించిన లుక్ రిలీజై ఆకట్టుకుంది. ఈ క్రమంలో బంగార్రాజు సినిమా నుండి నాగార్జున లుక్ కూడా రివీల్ చేయబోతున్నారు. అలాగే టీజర్ కూడా వదలనున్నట్టు స్వయంగా నాగార్జున తెలిపారు. ఆయన సరసన రమ్యకృష్ణ నటిస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. అయితే సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాలని నాగార్జున ప్లాన్ చేస్తున్నాడట. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం మహేశ్ బాబు తన సర్కారు వారి పాట సినిమాను పోస్ట్‌పోన్ చేసుకున్నాడు. ఒకవైపు భీమ్లా నాయక్, రాధే శ్యామ్ సినిమాలు బరిలో ఉన్నాయి. అయినా నాగ్ తన బంగార్రాజు సినిమాను రిలీజ్ చేయాలని పెద్ద రిస్క్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి ఇందులో ఎంతవరకు నిజముందో.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!