Alia bhatt : ఆలియా భట్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతోంది. ఛాలెంజింగ్ పాత్రల్లో నటిస్తున్న ఆలియాకి అక్కడి మేకర్స్ తన డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. ఇక బాలీవుడ్ ఆభిమానులకి తన సినిమాల మీద విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రస్తుతం బాలీవుడ్ లో పెద్ద ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే ముందు ఆలియానే సంప్రదిస్తున్నారు. అంత క్రేజ్ ఉన్న ఆలియా ని టాలీవుడ్ కి తీసుకు రావాలని చాలా ఏళ్ళ నుంచి మన టాలీవుడ్ నిర్మాతలు .. హీరోలు ట్రై చేశారు. కానీ ఆలియా బాలీవుడ్ లో వరస సినిమాలతో బిజీగా ఉండటంతో కుదరలేదు.
అయితే భారీ మల్టీ స్టారర్ గా పాన్ ఇండియన్ రేంజ్ లో బహుభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ ద్వారా ఆలియాని టాలీవుడ్ కి తీసుకు వచ్చారు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్నారు. చరణ్ కి జంటగా అలియా భట్ – ఎన్టీఆర్ కి జంటగా ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా కనిపిస్తున్నారు. అజయ్ దేవగన్ – శ్రీయ శరణ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా అజయ్ దేవగన్ బర్త్ డే సందర్భంగా ఆర్ ఆర్ ఆర్ లో తన లుక్ ని మోషన్ పోస్టర్ ద్వారా రిలీజ్ చేశారు.
Alia bhatt : ఆలియా కి కరోనా పాజిటివ్ కదా మళ్ళీ సినిమా పోస్ట్ పోన్ అవుతుందా..?
కాగా రెండు రోజుల క్రితం ఆలియాకి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దాంతో ఒక అభిమాని ఆర్ ఆర్ ఆర్ బృందాన్ని ఆలియా కి కరోనా పాజిటివ్ కదా మళ్ళీ సినిమా పోస్ట్ పోన్ అవుతుందా అని అడిగాడు. దానికి ఆర్ ఆ ఆర్ ఆర్ బృందం నో అని సమాధానమిచ్చారు. అంటే ఆర్ ఆర్ ఆర్ అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందని క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ సినిమా అన్నీ ప్రధాన భాషల్లో అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరిగింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!