Sharwanand : రైతులు – వ్యవసాయం, వారు పడుతున్న అగచాట్లు, వివిధ రకాల సమస్యలు ప్రధానాంశాలుగా ఎన్నో సినిమాలు తెరకెక్కిన విషయం తెలిసిందే. ఆ మధ్య సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా శ్రీమంతుడు, మహర్షి లాంటి సినిమాలలో ఈ అంశాలనే ప్రధానంగా చూపించాడు. ఇప్పుడు అలాంటి బ్యాక్ గ్రౌండ్ లో త్వరలో నే ఇంకొక సినిమా మన ముందుకు రాబోతుంది. అదే యువ హీరో శర్వానంద్ – ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ‘శ్రీకారం’. ఈ సినిమాని బి.కిశోర్ రెడ్డి తెరకెక్కిస్తుండగా..14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట – గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమా ని శివరాత్రి కానుకగా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే టీజర్ తో పాటు మిక్కీ జె మేయర్ కంపొజ్ చేసిన మూడు పాటలను రిలీజ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకొనే పనిలో ఉన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘శ్రీకారం’ టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోని విడుదల చేశాడు. ‘కనివిని ఎరుగని కదలిక మొదలయింది.. అడుగులో అడుగుగా..’ అంటూ సాగిన ఈ పాట మిక్కీ తనదైన స్టైల్లో ట్యూన్ చేసారు. మిక్కీ ట్యూన్ చేసిన ఈ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. ‘వ్యవసాయం మనకు కొత్త కాదు మన తాతల కృషి.. జీన్స్ వేసుకున్నా ఆ కళ మన జీన్స్ లో ఉంది’ ఈ పాట వ్యవసాయం యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ ఎంతో మంది మదిలో స్ఫూర్తిని నింపుతుంది.
ఇంతక ముందు ఈ సినిమా నుంచి ‘భలేగుంది బాలా’, ‘సందళ్లే సందళ్లే’, ‘హే అబ్బాయి’ పాటల తరహాలోనే ‘శ్రీకారం’ టైటిల్ సాంగ్ కూడా అభిమానుల నుంచి.. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ని తెచ్చుకుంటుంది. శ్రీకారం మ్యూజికల్ గా కూడా హిట్ అని అందరూ చెప్పుకుంటున్నారు. కాగా ఈ సినిమాలో సీనియర్ నరేష్ – సాయికుమార్ – మురళి శర్మ – రావు రమేష్ – ఆమని – సత్య – సప్తగిరి మొదలుగువారు నటిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ‘శ్రీకారం’ సినిమా మీద యంగ్ హీరో శర్వానంద్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇక హీరోయిన్ ప్రియాంక అరుళ్ కి కూడా ఈ సినిమా హిట్ చాలా కీలకం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!