NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: టీడీపీకి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన కీలక నేతలు

YSRCP: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేప‌ట్టిన `మేమంతా సిద్ధం’ యాత్ర నాలుగో రోజు అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. పత్తికొండలోని రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి ప్రారంభ‌మైన బ‌స్సు యాత్ర రాత‌న మీదుగా మ‌రి కాసేప‌ట్లో తుగ్గలి చేరుకోనుంది. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ బ‌స్సు యాత్ర‌లో పాల్గొనేందుకు ప్ర‌జ‌లు పెద్ద సంఖ్య‌లో పార్టీ శ్రేణులు త‌ర‌లివ‌చ్చారు. జగన్ కు జై కొడుతూ, పూల వ‌ర్షం కురిపిస్తూ త‌మ అభిమానాన్ని చాటుతున్నారు.

కాగా, స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో వైసీపీలోకి కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ నేతలు చేరారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీ ఇన్ ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో పలువురు కీలక నేతలు వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. వారికి సీఎం వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

పార్టీలో చేరిన వారిలో టీడీపీ సీనియర్‌ నేత, మార్కెట్‌ యార్డ్‌ మాజీ చైర్మన్‌ వై నారాయణ, మాజీ ఎంపీపీ, టీడీపీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కె కొల్లప్ప, టీడీపీ పార్లమెంట్‌ సెక్రటరీ, క్లస్టర్‌ ఇన్‌ఛార్జ్‌ టి సత్యప్ప, జనరల్‌ సెక్రటరీ(కంబదూరు) పి ఆనంద్‌ చౌదరి, కళ్యాణదుర్గం రూరల్‌ జనరల్‌ సెక్రటరీ కె మల్లిఖార్జున, జనరల్‌ సెక్రటరీ(శెట్టూరు) ఆదిశేషు. కళ్యాణదుర్గం రూరల్‌ ఎంపీటీసీ బి ఓబయ్య, కంబదూరు మాజీ జెడ్పీటీసీ అభ్యర్ధి మంజునాథ్‌ చౌదరి, శెట్టూరు మాజీ మండల పార్టీ కన్వీనర్‌ పి రంగనాథ్‌ శెట్టి ఉన్నారు.

కళ్యాణదుర్గం టీడీపీ టికెట్ కోసం ఉమామహేశ్వర్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతు రాయ చౌదరి లు తీవ్రంగా పోటీ పడ్డారు. 2019 ఎన్నికల్లో ఉమామహేశ్వర్ నాయుడు టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్ధి ఉషశ్రీ చరణ్ చేతిలో పరాజయం పాలైయ్యారు. ఆ తర్వాత పార్టీ ఇన్ చార్జిగా కొనసాగారు. అయితే 2014 లో ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన ఉన్నం హనుమంతు రాయ చౌదరి ఈ సారి ఎన్నికల్లో పోటీకి దిగాలని ఆశించారు. ఈ ఇరువురి నేతల మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు ఉండటంతో పార్టీ అధిష్టానం ఈ ఇద్దరు నేతలను పక్కన పెట్టి మూడో వ్యక్తికి టికెట్ ఇచ్చారు.

అమిలినేని సురేంద్ర బాబును తీసుకొచ్చి కళ్యాణదుర్గం కూటమి అభ్యర్ధిగా ప్రకటించారు. టీడీపీ హైకమాండ్ తీసుకున్ నిర్ణయంతో తీవ్ర మనస్థాపానికి గురైయ్యారు ఉమామహేశ్వర నాయుడు. గత కొద్ది కాలంగా పార్టీకి అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తూ వచ్చారు. పలు మార్లు అనుచరులతో సమావేశమై భవిష్యత్తు కార్యచరణపై చర్చించారు. పార్టీలో తనకు అవమానం జరిగిందని భావిస్తున్న ఉమామహేశ్వర నాయుడు పార్టీ మారాలని నిర్ణయానికి వచ్చారు.

ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఉమామహేశ్వర నాయుడు ఇంటికి కళ్యాణదుర్గం వైసీపీ అభ్యర్ధి, ఎంపీ తలారి రంగయ్య, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఇతర వైసీపీ నేతలు వెళ్లి చర్చలు జరిపారు. వైసీపీలోకి రావాలని ఆహ్వానించారు. వీరి ఆహ్వానంతో ఇవేళ జగన్ సమక్షంలో తన వర్గీయులతో ఉమామహేశ్వర నాయుడు వైసీపీలో చేరారు.

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N