NewsOrbit
న్యూస్

Karthika Deepam Mar 4 Today Episode: మోనిత నటి అయితే సౌందర్య మహా నటి అని ఈ సీన్ చూస్తేనే అర్ధం అవుతుంది..!!

Karthika Deepam Mar 4 Today Episode:
బుల్లితెర అభిమానులు ఎంతగానో ఆదరించే కార్తీకదీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ భలే ఆసక్తిగా ముందుకు సాగిందనే చెప్పాలి.గత ఎపిసోడ్‌లో సౌందర్య మోనితకు దిమ్మతిరిగే స్కెచ్ వేస్తుంది.బాబుని దత్తత ఇస్తున్నాం అంటూ బస్తీ వాళ్లందరికి చెప్పడంతో విషయం మోనితకు కూడా తెలుస్తుంది.ఇక మోనిత వాళ్ళ అంతు తేల్చేస్తా అంటూ గుడికి రావడంతో ఈరోజు కథనం ఎంతో ఉత్కంఠ భరింతంగా మారింది.ఆపండి అంటూ మోనిత వచ్చి బాబుని దత్తత ఇవ్వడం ఏంటీ?’ అంటుంది.దాంతో సౌందర్య వైపు చూస్తూ పైకి లేచి ‘ఆనంద్‌ని మనం దత్తత ఎందుకు ఇస్తాం’ అంటాడు కార్తీక్.

Karthika Deepam Today Episode: సౌందర్య ప్లాన్ మాములుగా లేదుగా.. మోనితకు దిమ్మతిరిగడం గ్యారంటీ..!

Karthika Deepam Mar 4 Today Episode: నిజం తెలిసి షాక్ అయిన కార్తీక్:

అవును రా నిజమే..పిల్లలు లేని దంపతులు నన్ను కలిశారు వాళ్లకి ఆనంద్‌ని దత్తత ఇవ్వాలని నాకు అనిపించింది’ అంటుంది సౌందర్య.‘ఈ దత్తతను నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను అంటుంది మోనిత.నువ్వు ఎవరే ఒప్పుకోవడానికి ఇది జరిగి తీరుతుంది’ అంటుంది సౌందర్య కోపంగా.. ‘నేను ఆ బాబు కన్న తల్లిని’ అంటూ మోనిత అసలు నిజం చెప్పేస్తుంది. అది విని కార్తీక్‌తో సహా అంతా షాక్ అవుతారు. మోనితా పిచ్చి పట్టిందా నీకు? ఈ ఆనంద్ నీ కొడుకేంటీ?’ అని అరుస్తాడు కార్తీక్.‘అవును కార్తీక్.. ఆనంద్ నా కొడుకే..’ అంటుంది మోనిత. ‘మమ్మీ,దీపా విన్నారా తను ఏం మాట్లాడుతుందో అంటాడు చాలా బాధగా.

Karthika Deepam Mar 2 Today Episode: ఆనంద్ మీద కార్తీక్ పెంచుకున్న ప్రేమ ఎక్కడిదాకా దారితిస్తుందో? మోనిత చేసిన పనికి ఉగ్రరూపం దాల్చిన దీప…!
మోనితకు ఇదంతా నాటకం అని చెప్పి షాక్ ఇచ్చిన సౌందర్య:

నిజమే కార్తీక్ ఆనంద్ మోనిత బిడ్డే ఈ విషయం తన నోటి నుంచి తనే ఒప్పుకోవాలని ఈ దత్తత నాటకం ఆడాను అంటుంది సౌందర్య. నాటకమా అంటూ మోనిత షాక్ అవుతుంది.అవునే నాటక శిరోమని.. తెలివి నీ ఒక్కదాని సొత్తేనా? నీ బిడ్డ మా ఇంట్లోనే ఉన్నాడని తెలిసి కూడా కార్తీక్‌ని ఇబ్బంది పెడుతూ దగ్గర అవ్వాలని ప్లాన్ చేస్తూ నీ బిడ్డని వెతికి ఇవ్వమని మళ్లీ నువ్వే చెబుతావా? నీ నాటకాలు నా దగ్గరా అంటుంది.నువ్వు మామూలు నటివైతే నేను మహానటినే,తెలివి తేటలు ఏ ఒక్కరి సొత్తు కాదు అంటుంది సౌందర్య.చూడు కార్తీక్ బాబు విషయంలో దేవుడు చిత్రమైన ఆట ఆడాడురా.తాడికొండలో ఉండే కోటేష్ హైదరాబాద్ వచ్చి మోనిత కొడుకును ఎత్తుకెళ్లాడురా..’ అంటుంది సౌందర్య. ‘దత్తత తీసుకున్నాను అని కోటేష్ మనకి అబద్దం చెప్పాడు’ అంటుంది దీప ఏడుస్తూ.

Karthika Deepam Mar 2 Today Episode: ఆనంద్ మీద కార్తీక్ పెంచుకున్న ప్రేమ ఎక్కడిదాకా దారితిస్తుందో? మోనిత చేసిన పనికి ఉగ్రరూపం దాల్చిన దీప…!
సీన్ లోకి రత్న సీత ఎంట్రీ :

కోటేష్‌ బిడ్డని ఎత్తుకెళ్లే వీడియో నీకు చూపించొద్దని రత్నసీతకు చెప్పింది ఈ మోనిత అంటుంది సౌందర్య. రత్న సీత కూడా సీన్ లోకి ఎంట్రీ ఇచ్చి కోటేష్ వీడియో కార్తీక్‌కి చూపిస్తుంది.ఇంకా మోనిత మాత్రం అవును నేను నా బిడ్డని అడ్డం పెట్టుకుని ప్లాన్ చేశాను.. అయితే ఏంటటా?’ అంటుంది మోనిత.దాంతో సౌందర్య మోనితని లాగిపెట్టి కొట్టి, బాగా తిట్టి నీ బిడ్డని నీకు ఇచ్చేస్తే కార్తీక్ జోలికి రాను అన్నావట కదా..? కార్తీక్‌ని వదిలేసి వెళ్లిపోతాను అన్నావట కదా? సరే వెళ్ళిపో అంటూ దీప దగ్గరున్న ఆనంద్‌ని లాక్కొచ్చి మోనిత చేతుల్లో పెడుతుంది.దీప,కార్తీక్ ఎమోషనల్‌గా దగ్గరకు రాబోతుంటే మీరు ఎవ్వరూ మధ్యలో అడ్డు రాకండి అని వార్నింగ్ ఇస్తుంది సౌందర్య.

Karthika Deepam Mar 2 Today Episode: ఆనంద్ మీద కార్తీక్ పెంచుకున్న ప్రేమ ఎక్కడిదాకా దారితిస్తుందో? మోనిత చేసిన పనికి ఉగ్రరూపం దాల్చిన దీప…!
ఆనంద్ ను మోనితకు ఇచ్చేసిన సౌందర్య:

ప్రేమని అడ్డం పెట్టుకుని గేమ్స్ ఆడటం దీనికి బాగా అలవాటు అయిపోయింది.మనం బాబుని ఇవ్వలేమని దీని ధైర్యం.ఆఖరి సారి చెబుతున్నాను విను మోనిత.నువ్వు అన్నట్లే నీ బిడ్డని నీకు ఇచ్చేశాను.నీ బిడ్డ ఎప్పటికీ మా ఇంటి వారసుడు కాడు..కాలేడు.నువ్వు ఎప్పటికీ మా ఇంటి కోడలివి కాలేవు.నాకు ఇద్దరు కొడుకులు,ఇద్దరు కోడళ్లు,ఒక మనవడు,ఇద్దరు మనవరాళ్లు వీళ్లే నా వారసులు.ఇదే నా ఫ్యామిలీ చూశారు కదా అందరూ దీనితో,దీని కొడుకుతో మాకు ఇక ఎలాంటి సంబంధం లేదు. పిలవగానే అందరూ వచ్చినందుకు ధన్యవాదములు అంటూ దన్నం పెడుతుంది సౌందర్య.అందరూ ఇంటికి వెళదాం పదండి అంటే దీప, కార్తీక్ బాధతో బాబును చూస్తూ అడుగులు ముందుకు వేయడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది..

Related posts

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N