Karthika Deepam Today Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ ఈరోజు సరికొత్త మలుపు తిరిగిందనే చెప్పాలి. బస్తిలో మోనిత చీరలు పంచుతుందని తెలిసి దీప ఆవేశంగా బస్తిగా వస్తుంది.అక్కడ మోనిత బస్తివాసులతో మాట్లాడుతూ కార్తీక్ ఆ దీపకే మొగుడు కాదు.. నాకూ మొగుడే అంటుంది అంతే ఒక్కసారిగా దీప వచ్చి మోనిత చెంప చెల్లుమని పగలకొడుతుంది.డాక్టర్ బాబు ఇంటికి వస్తే మొగుడు అయిపోతాడా? ఏంటి..అడ్డదారిలో బిడ్డని కన్నావ్.అడ్డంగా మాట్లాడుతున్నావ్.అడ్డంగా నరికేస్తాను జాగ్రత్త అంటుంది.తన మెడలో తనే తాళికట్టుకుంది, బిడ్డని పోగొట్టుకుని పరువు కూడా పోగొట్టుకుని జైలుకి వెళ్లొచ్చింది. ఇక్కడేమో ప్రజావైద్యశాల తెరిచి సేవలు చేస్తోంది ఇది మేడమ్ గారి జీవిత చరిత్ర అంటుంది దీప.
Karthika Deepam Today Episode: మోనిత వ్యూహంలో చిక్కుక్కున కార్తీక్ ఫ్యామిలీ… కాపాడేవారే లేరా..?
Karthika Deepam Today Episode: మోనితకు వార్నింగ్ ఇచ్చిన దీప :
అవును దీపక్క నువ్వు చెప్పినవన్నీ నేను చేశాను. కానీ కార్తీక్‌తో నేను పెట్టుకున్న డీల్ ప్రకారం నా బిడ్డని నాకు ఇచ్చేదాకా నేను తిరిగి వెళ్లిపోయే దాకా ఇలానే మాట్లాడతాను.వెళ్లక్కా వెళ్లు నా బాబుని వెతికి ఇవ్వండి లేదంటే మీ ఇంట్లో ఉన్న బాబుని నాకు ఇవ్వండి’ అంటుంది మోనిత.‘నీకు ఎలా గుణపాఠం చెప్పాలో, నీ తోక ఎలా కత్తిరించాలో నాకు బాగా తెలుసు గాని అప్పటి దాకా పిచ్చి వేషాలు మానెయ్’ అంటుంది దీప. ఇక దీప తిరిగి వచ్చి మోనిత మాటలు గుర్తు చేసుకుని ఏడుస్తు ఉండగా సౌందర్య, ఆనందరావులు వచ్చి దీపని ఓదారుస్తారు. బస్తీలో. జరిగినా విషయాన్ని చెప్పి ఏడుస్తుంది.ఏడవకే ఈ సౌందర్య ఉండగా మీకు ఎలాంటి భయం లేదు’ అంటూ ఏదో ప్లాన్ చెబుతుంది ఆనందరావు, దీపలకు..
Karthika Deepam Today Episode: మోనిత అనుకున్నది సాధించిందిగా… ఎట్టకేలకు కార్తీక్ ను ఇంటికి రప్పించుకున్న మోనిత.!
సౌందర్య ప్లాన్ మాములుగా లేదుగా.?
ఇక ఉదయాన్నే సౌందర్య బస్తీకి వెళ్లి లక్ష్మణ్, అరుణ అందరినీ కలిసి రేపు గుళ్లో మా కార్తీక్ వాళ్లకి తాడికొండలో దొరికిన బాబుని పిల్లలు లేని తల్లిదండ్రులకు దత్తత ఇస్తున్నాం.. మీరు తప్పకుండా రావాలి అని చెప్పి అక్కడనుండి వెళ్ళిపోతుంది. మరోవైపు కార్తీక్ బయటికి బయలుదేరుతూ ఉండగా దీపను పిలిచి ఆనంద్ ఎక్కడా ఓ సారి చూసి వెళ్లిపోతాను అంటాడు. ‘నిద్రపోతున్నాడండి’ అంటుంది దీప అయిష్టంగా.. ఇంతలో సౌందర్య వచ్చి ‘కార్తీక్ ఎక్కడికి వెళ్తున్నావ్.. ఈరోజు గుళ్లో పూజ ఉంది ఎక్కడకు వెళ్లకు నువ్వు మాతో పాటు గుడికి వస్తున్నావ్ అంతే’ అంటూ అక్కడ నుంచి సీరియస్‌గా వెళ్లిపోతుంది సౌందర్య.
Intinti Gruhalakshmi: తులసికి నందుపై ఇంత ప్రేముందా..! ప్రేమ్ శృతిలను బయటకు గెంటేసిందా తులసి..!? సూపర్ ట్విస్ట్..!
ఆహా… మోనిత ప్లాన్ అడ్డం తిరిగిందిగా:
సీన్ కట్ చేస్తే లక్ష్మణ్ ద్వారా ఈ దత్తత గురించి తెలుసుకుని కోపంతో రగిలిపోతుంది. ప్రేమ, ప్రాణం అన్నారు కదా మరి బాబుని ఇప్పుడు దత్తత ఇవ్వడం ఏంటీ? నా కథ ఇలా అడ్డం తిరిగింది ఏంటీ? అనుకుంటుంది.ఇక గుడిలో పూజకు అన్ని ఏర్పాట్లు చేస్తాడు వారణాసి. అందరు కూడా గుడికి వస్తారు. మొత్తానికి పూజ మొదలవుతుంది. కార్తీక్ పక్కన దీప బుల్లి ఆనంద్‌ని ఒడిలో పెట్టుకుని కూర్చుంటుంది. ఇంతలో మోనిత వచ్చి ఆపండి అంటుంది.అసలు ఏం జరుగుతోంది ఇక్కడా అంటుంది మోనిత ఆవేశంగా. ఇంతలో సౌందర్యవచ్చి రా మోనితా.. నిన్ను పిలవడం మరిచిపోయాను సమయానికి వచ్చావ్.మంచిదైంది.లోనికి వచ్చి దేవుడికి దన్నం పెట్టుకో పుణ్యం వస్తోంది’ అంటుంది సౌందర్య నవ్వుతూ.
UP Assembly Election 2022: యూపీలో కొనసాగుతున్న ఆరో విడత పోలింగ్..
దత్తత విషయం తెలిసి షాక్ అయిన కార్తీక్ :
నాకు ‘దేవుడైనా పతి దేవుడైనా అన్నీ నాకు కార్తీక్ నే అంటుంది..అయినాగాని కార్తీక్ నువ్వు ఏం చేస్తున్నావ్ అర్ధం అవుతుందా బాబుని దత్తత ఇవ్వడం ఏంటి అంటుంది మోనిత. కార్తీక్ షాక్ అవుతూ సౌందర్య వైపు చూసి బాబుని దత్తత ఇవ్వడం ఏంటీ మోనితా’ అంటాడు కోపంగా.. భలే నటిస్తున్నావ్ ఏం తెలియనట్లు అంటుంది.మీ మమ్మీ గారు ఇదేదో పెద్ద ఘనకార్యం అన్నట్లుగా కార్డుల ప్రింట్ చేసి మరీ పంచిపెట్టిందిగా నీకు తెలియదా అంటుంది మోనిత. ‘మమ్మీ ఏంటిది? ఆనంద్‌ని మనం దత్తత ఇవ్వడం ఏంటి? అంటాడు కార్తీక్ ఆవేశంగా..అవును కార్తీక్ నిజంగానే పిల్లలు లేని తల్లి తండ్రులకు వాడిని దత్తత ఇస్తున్నాం అనడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.!