NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Intinti Gruhalakshmi: తులసికి నందుపై ఇంత ప్రేముందా..! ప్రేమ్ శృతిలను బయటకు గెంటేసిందా తులసి..!? సూపర్ ట్విస్ట్..! 

Intinti Gruhalakshmi: అభి రాకతో ఇంట్లో అందరూ ఆనందంగా ఉంటారు.. ఇక దివ్య అయితే ఏకంగా వంట కూడా చేస్తుంది.. రేయ్ అన్నయ్య ఈరోజు బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్ని నేనే చేస్తాను అని ప్రేమ్ తో ఉంటుంది దివ్య.. అయితే అంబులెన్స్ తీసుకువచ్చి మన ఇంటి పక్కనే పెట్టిస్తాను అని నవ్వుతు ప్రేమ్ సెటైర్ వేయడంతో నేటి ఎపిసోడ్ మొదలవుతుంది..!

Intinti Gruhalakshmi: 3 March 2022 Today 570 Episode Highlights
Intinti Gruhalakshmi: 3 March 2022 Today 570 Episode Highlights

570వ ఎపిసోడ్ హైలెట్స్..!!

అంతలో అభి వచ్చే ఏంట్రా దివ్య గోల.. అని ప్రేమ్ తో అంటుండగా రేయ్ అన్నయ్య ఈరోజు ఇంట్లో వంట నేనే చేస్తాను నా వంటలు టేస్ట్ చేసి చెప్పు అంటుంది.. లేదు దివ్య హాస్పిటల్ కి వెళ్లి చాలా రోజులైంది హాస్పిటల్ కి వెళ్తున్న అని అనగా.. రేయ్ హాస్పిటల్ కి వెళ్తున్నావా లేదంటే ఇంకెక్కడికైనా అని దివ్య అనగానే.. ఈరోజు నుంచి అలాంటి ఆలోచనలు ఏమీ లేవు. అమ్మ మీద ప్రామిస్ చేసి చెబుతున్నా ఇకనుంచి హాస్పిటల్ ఇల్లు తప్ప నాకు మరో ధ్యాస లేదు. నేనేదో జోక్ గా అన్నాను అన్నయ్య అని దివ్య అంటే.. నేను మాత్రం సీరియస్ గానే చెబుతున్నాను. ప్రామిస్ అమ్మ అని చెప్పి అభి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

 

శృతి ఎందుకో ముభావంగా ఉండడం చూసిన తులసి ఏమైందమ్మా అని అడుగుతుంది. ప్రేమ్ కావాలని ఢిల్లీ ఈవెంట్ కు కావాలని వెళ్లడం లేదని చెబుతుంది.. తన కెరీర్ లో ఇది తనకు చాలా ఇంపార్టెంట్ అని ఈ ఈవెంట్ కోసం ఎన్నో ఏళ్లుగా ప్రేమ్ ఎదురు చూస్తున్నాడని ఇప్పుడు వస్తె వెళ్లడంలేదని శృతి బాధపడుతుంది. ప్రేమ్ ఒప్పించి ఢిల్లీ ఎందుకు పంపించే బాధ్యత నాది అని తులసి చెబుతుంది. ప్రేమ్ ఇంటికి రాగానే నువ్వు చేసే పద్ధతి నాకు నచ్చలేదు అని.. నాకోసం నువ్వు పిచ్చి నిర్ణయాలు తీసుకోవడం నచ్చలేదు అని.. ఈవెంట్ కి వెళ్ళమని తులసి చెబుతుంది. ప్రేమ్ కరాఖండీగా నేను వెళ్ళను అని చెప్పడంతో.. నందు వచ్చి మీ మంచి కోసమే కదా అమ్మ చెబుతుంది. అమ్మ మాట విను అని చెబుతాడు. ఈ అవకాశం చేజారితే మళ్లీ అవకాశం రావడానికి చాలా టైం పడుతుంది అని నందు అనగానే.. అవకాశం కోసం నమ్మిన వాళ్లని మోసం చేయడం నాకు చేతకాదు.. అలా అవకాశం దొరకగానే నమ్మిన వాళ్ళని నట్టేట ముంచే వారినే నందగోపాల్ అంటారు.. ఒక భర్తగా అమ్మ దగ్గర.. ఒక కొడుకు తాతయ్య దగ్గర.. ఒక తండ్రిగా అభి అన్నయ్య దగ్గర.. నువ్వు ఘోరంగా ఓడిపోయావు. నువ్వు చెప్పే నీతులు నాకు ఏమీ అవసరం లేదు అని ప్రేమ అనగానే.. తులసి ప్రేమ్ ను అరిచి లోపలికి పంపించేస్తుంది. పిల్లల్ని నా మీదకి బాగానే ఉసిగొల్పుతున్నవని.. నీ పగ అంతా తీర్చుకుంటున్నారని తులసిని నందు నిందిస్తాడు. అవేవి పట్టించుకోకుండా తులసి అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్లిపోతుంది..

Intinti Gruhalakshmi: 3 March 2022 Today 570 Episode Highlights
Intinti Gruhalakshmi: 3 March 2022 Today 570 Episode Highlights

ఇక శివరాత్రి సందర్భంగా తులసి ఏర్పాట్లు చేసి అన్నీ సిద్ధం గా ఉంచుతుంది తులసి. ఇంట్లో వాళ్ళందరూ మా ఇల్లు బృందావనం ఆనందం మమతలకు అనురాగం పాట కీ ఓ రేంజ్ లో డాన్స్ వేస్తూ సంబరాలు చేస్తుంటారు. ఇంట్లో వాళ్ళు అందరు ఇంత ఆనందంగా ఉంటే లాస్య చూసి ఓర్వలేదని అందరికీ తెలిసిందే.. ఏదో ఒక వంక చూసుకుని తులసి నిందిస్తుంది. అది ప్రేమ్ కి కోపం వచ్చి లాస్య పై కోపంగా కొట్టడానికి చెయ్యి పైకి ఎత్తుతాడు. నా పెళ్ళాన్ని కొట్టే అంత పెద్ద వాడివి అయ్యవా అని నందు ప్రేమ్ ను కొట్టబోతాడు.  ఇక మాట మాట పెరిగి పెద్ద గొడవ అవుతుంది. ఆ కోపంలో తులసి నీ భార్యను తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని ప్రేమ్ తో చెబుతుంది. ప్రేమ్ ఇంట్లో నుంచి వెళ్లిపోతాడా.. లేదంటే ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

Related posts

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri