Karthika deepam:గత ఎపిసోడ్ లో ప్రశ్నగా మిగిలిపోయిన చిక్కుముడి విడిపోయింది. మోనిత బాబుని ఎత్తుకెళ్లింది ఎవడో తేలిపోయింది. వాడే కోటేష్.. కోటేశ్వరరావు. శ్రీవల్లి ముఖంలో ఆనందం కోసం కోటేష్ ఈ దారుణానికి ఒడిగడతాడు. దాంతో ఈరోజుటి సీరియల్ ఎపిసోడ్ లో BGM (బ్యాగ్రౌండ్ మ్యూజిక్) హై పిచ్ కి వెళుతుంది. మోనిత బాధ వర్ణించలేనిది. అలాగే ఇంకోవైపు రుద్రాణిని దీప చెంపమీద కొట్టడం, తరువాత విపరీత పరిణామాలు ఏమిటనేది ఈ ఎపిసోడ్ లో ఓ ప్రశ్న.
కోటేష్ ఆబాబుని ఎక్కడికి తీసుకెళ్లాడు?
కార్తీక్ ఆహ్వానం మేరకు శ్రీవల్లి, కోటేష్ లు కార్తీక్ ఇంటికి వెళతారు. ఇక్కడ ట్విస్ట్ ఏమంటే కోటేష్ తను ఎత్తుకెళ్లిన బాబుని కూడా అక్కడకు తీసుకు వెళ్తాడు. అవును… బాబుతో సహా కోటేష్, శీవల్లి కార్తీక్ ఇంటికి వెళతారు. దీప హారతి ఇచ్చి మరీ వాళ్ళని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. బాబుని చూసిన దీప ఎత్తుకుని ముద్దాడుతుంది. రాబోయే ఆపదను గమనించని కోటేష్ సరిగ్గా అదే సమయంలో “ఎన్నో కాన్పులు పోయిన తరువాత కలిగిన కొడుకమ్మా” అని వారితో దీనంగా చెబుతాడు. అదే టైంలో దీప చేతిలో ఉన్న బాబు కార్తీక్ వైపుకి చూస్తాడు.
కార్తీక్, దీపలకు బాబుపై అనుమానం ఇలా కలుగుతుంది..
కార్తీక్, బాబుని తదేకంగా చూస్తాడు. దీప కూడా లోలోపల శంకిస్తుంది. కోటేష్ వైపు తిరిగి కార్తీక్, “రోజుల బిడ్డలాగ వీడు కనిపించడం లేదే!” అనే సందేహం వ్యక్తం చేస్తాడు. వెంటనే దీప అందుకొని “నాకు అలాగే అనిపిస్తుందండి!” అని అంటుంది. దాంతో కోటేష్ ఖంగు తింటాడు. ఏదో తెలియని అపరాధ భావన కోటేష్ గుండెని తొలిచేస్తుంది. అనుమానం వచ్చిన దీప “కోటేష్ ఈ బిడ్డ ఎవరు? నిజం చెప్పు! లేదంటే ఛస్తావ్!” అనడంతో కోటేష్ బక్కచిక్కి పోతాడు. కట్ చేస్తే.. మోనిత, పోయిన తన బిడ్డ గురించి రోదిస్తూ ఉంటుంది. తరువాయి భాగం కోసం వేచి చూడండి..!