NewsOrbit
న్యూస్

Karthika Deepam Today Episode: ఆనంద్ కు దగ్గర అవుతున్న కార్తీక్.. వాడే మోనిత కొడుకు అని తెలిస్తే కార్తీక్ పరిస్థితి ఏంటో కదా..?

Karthika Deepam Today Episode: బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసే కార్తీకదీపం సీరియల్ నేటి కధనం ఎంతో ఆసక్తిగా ముందుకు సాగుతూ వెళ్తుంది.గత ఎపిసోడ్‌లో అప్పారావు సౌందర్య ఇంటికి వచ్చి సౌందర్యతో మాట్లాడతాడు. మళ్ళీ ఈరోజు ఎపిసోడ్ కూడా సరిగ్గా అదే సీన్ తో మొదలవుతుంది.ఇంకా అప్పారావు ఆడిషన్స్‌కి వెళ్లి వచ్చేసరికి లేట్ అయిపోయింది పెద్ద మేడమ్ అంటూ మేడం అక్క నాకో పని చెప్పింది అంటూ పిల్లల టీసీలు, రేషన్ కార్డులు, ఫొటోస్ అంటూ శ్రీవల్లి కోటేష్ ఫొటో‌తో పాటు మిగిలినవన్నీ టేబుల్ మీద పెడతాడు. అవి అందుకున్న సౌందర్య శ్రీవల్లి కోటేష్‌లని చూసి వీళ్లు ఎవరు అప్పారావు అంటుంది. ‘వీళ్ల ఇంట్లోనే మేడమ్ దీపక్క వాళ్లు ఉన్నది.. పాపం చనిపోయారు.. వాళ్ల బాబునే కదా వీళ్లు తెచ్చుకున్నారు’ అంటాడు.

TTD Truth: టీటీడీ వారి “నొప్పిలేని దెబ్బ” ..! టీటీడీని అమ్మేశారు..కానీ..!?

Karthika Deepam Today Episode: ఆనంద్ ఎవరో సౌందర్యంకు తెలిసిపోయిందా..?

కోటేష్‌ని తీక్షణంగా చూసిన సౌందర్య.. అనుమానం వచ్చి ఫోన్‌లోని మోనిత బాబుని ఎత్తుకుని వెళ్లే వీడియో చూస్తుంది. ఇద్దరూ ఒక్కరే అని గుర్తించిన సౌందర్య షాక్ అయిపోతుంది. అంటే ‘మోనిత బాబే ఆనందా?’ అనుకుంటూ ఉంటుంది. వాడిని కూడా ఎక్కడ నుంచో తెచ్చుకున్నారట మేడమ్’ అంటాడు అప్పారావు. ‘దేవుడా మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నావ్.. ఏమిటీ లీలా’ అని మనసులో అనుకుంటూ సోఫాలో కూలబడిపోతుంది.సీన్ కట్ చేస్తే మోనిత తన దగ్గర ఉన్న బాబు బొమ్మ దగ్గర కూర్చుని.. ‘ఆనందరావు గారు.. మీ నాన్న నన్ను కొట్టారు.. నేను కట్టుకున్న తాళిని తెంపేశారు.. కానీ మీరు మాత్రం సూపర్.

Prabhas Mahesh: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు..??
మోనిత, కార్తీక్ ను కలిపేది ఆనంద్ యేనా..?

నాకు హెల్ప్ చెయ్యడానికి నాన్న దగ్గరకు వెళ్లి హాయిగా ఉన్నారన్నమాట అనుకుంటుంది. ఇంకా కొన్నాళ్లు అక్కడే ఉండు.నిన్ను మీ నాన్న వెతుకుతూ ఉంటడన్నమాట. కానీ నిన్ను నువ్వు దొరకవట.ఆ ఇంట్లో అందరికీ నువ్వు బాగా ఇష్టం అయిపోయావ్ కదా.కొన్నాళ్లకు ప్రేమ పెరిగిపోతుంది.నిన్ను వదులుకోలేరు.ఆ సమయంలోనే నేను ఇంట్లోకి వస్తాను.అప్పుడు నువ్వే ఆనందరావు అని తెలిసి.. అందరూ షాక్ అవుతారు.. అప్పుడు ఆపరేషన్ బ్లెడ్ రిలేషన్ అనే ఈ డ్రామా కచ్చితంగా విజయవంతం అవుతుంది. అప్పుడు అందరం కలిసిపోతాం. థాంక్యూ దేవుడా అనుకుంటూ ఉంటుంది మోనిత.

Bheemla Naayak: రికార్డు స్థాయిలో “బీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ బిజినెస్..!!
అంతర్మధనంలో సౌందర్య:

మరోపక్క సౌందర్య మనసులోనే మథనపడుతూ ఉంటుంది. ఆనంద్ మోనిత కొడుకు అని దీప వాళ్లకి ఎలా చెప్పగలను? అనుకుంటూ ఉండగా సరిగ్గా అప్పుడే సౌర్య, హిమ బాబుని ఎత్తుకొచ్చి సౌందర్య వొళ్ళో పెడతారు.మరోవైపు కార్తీక్.. దీప ఓ చోట ఆగి మాట్లాడుకుంటారు.. ‘డాక్టర్ బాబు.. మీరు చేస్తున్నది కరెక్టానా.. అసలు ఆ మోనితకి బాబుని వెతికి ఇస్తాను అని ఎందుకు మాటిచ్చారు’ అంటుంది. ‘దీపా మనకు వేరే అవకాశం లేదు.. మోనితని వదిలించుకోవడానికి తనే మనకు అవకాశం ఇస్తోంది. పోనీ నువ్వు చెప్పు ఇంకో ఐడియా ఏదైనా ఉందా అంటాడు.ఇక దీప, కార్తీక్‌లు కలిసి ఇంటికి వస్తారు.

బాబుకు దగ్గర అవుతున్న కార్తీక్ :

పిల్లలు ఆనంద్‌తో ఆడుకుంటూ ఉంటే.. ‘హిమా వాడ్ని నాకు ఇవ్వు.. వాడ్ని చూస్తే వాడితో ఆడుకుంటే చాలా రిలాక్స్‌గా ఉంటుంది నాకు’ అంటూ ఆనంద్‌ని తీసుకును ముద్దాడతాడు. అంతా సౌందర్య చూస్తూ మనసులో మథనపడుతూనే ఉంటుంది. కార్తీక్ బాబుని తీసుకుని వెళ్ళగానే దీప వాడికి ఏమైంది అలా ఉన్నాడు అంటుంది సౌందర్య. ‘మోనితతో గొడవ పడి బాబుని వెతికి ఇస్తే అన్నీ వదిలేస్తాను అంది.. ఆయన సరే అన్నారు’ అని దీప చెప్పడంతో షాక్ అయిపోయి ఇంట్లో ఉన్న బాబుని ఎలా వెతికి ఇస్తావ్‌రా పెద్దోడా’ అంటూ మనసులో చాలా అనుకుంటుంది.

Tarak: నందమూరి తారక రత్న ఈసారైనా లేస్తాడా? అదిరిపోయిన మోష‌న్‌పోస్టర్!
ఆనందరావుకు అసలు విషయం చెప్పిన సౌందర్య:

ఇంకా ఆనందరావుతో సౌందర్య ‘మీకో విషయం చెప్పాలండీ.. మీరు టెన్షన్ పడతారేమోనని భయంగా ఉంది’నాకు ఏమి కాదు కానీ ఏంటి చెప్పు అంటాడు.ఇంకా సౌందర్య మన ఇంట్లో ఉన్న ఆనంద్ ఎవరో కాదండీ.. ఆ మోనిత కొడుకు’ అంటూ నిజాన్ని చెప్పేస్తుంది. ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయ్యి కంగారుగా ఆనంద్ రావు లేచి నిలబడతాడు. ‘ఏం మాట్లాడుతున్నావ్ సౌందర్యా?’ అంటాడు. ‘నిజమండీ అంటూ జరిగినా విషయాన్నీ చెపుతుంది.ఆనందరావు టెన్షన్ చూసి.. ‘మీరు టెన్షన్ పడకండీ’ అంటుంది. ‘ఎలా ఉండాలి సౌందర్య టెన్షన్ పడకుండా? తిరిగి తిరిగి మనింట్లో ఉన్న ఆనంద్ మోనిత కొడుకు కావడం ఏంటి సౌందర్య’ అంటాడు ఆనందరావు.ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది.

Related posts

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N