NewsOrbit
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

TTD Truth: టీటీడీ వారి “నొప్పిలేని దెబ్బ” ..! టీటీడీని అమ్మేశారు..కానీ..!?

TTD Truth: రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో ఆర్జిత సేవల ధరలను భారీగా పెంచేశారు అనే వార్త విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. టీటీడీ బోర్డు మీటింగ్ జరుగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అదే మన్నా తిరుమల తిరుపతి దేవస్థానం అనుకున్నారా..? చేపల మార్కెట్ అనుకున్నారా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. టీటీడీ బోర్డులో వాళ్లలో వాళ్లు మాట్లాడుకున్న సంభాష వీడియో బయటకు వచ్చింది. అయితే ఇక్కడ వాస్తవిక కోణం, కల్పిత కోణం రెండు ఇక్కడ చూడాలి. కల్పిత కోణం ఎవరికి వారు ఊహించుకోవచ్చు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో వాస్తవమే. ఆ మీటింగ్ లో ధరల పెంపుపై చర్చ జరగడం, ధరలను పెంచేయడం వాస్తవమే. కానీ ఓ చిన్న తేడా ఉంది. ఒక చిన్న తేడా ఉండటంతో దానిపై ఎక్కువ నెగిటివ్ ప్రచారం జరుగుతోందనేది విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది.

TTD Truth on Acquired Services enhanced rates
TTD Truth on Acquired Services enhanced rates

Read More: YS Jagan: కేసిఆర్ కి జగన్, పవార్, థాక్రే వరుస షాక్ లు..! భయమా – వ్యూహమా..!?

TTD Truth: ఆర్జిత సేవల ధరల పెంపు

తిరుమలకు వెళ్లే భక్తులు రెండు కేటగిరిలు ఉంటారు. సాధారణ (సామాన్య) భక్తులు. ఎటువంటి సిఫార్సులు లేకుండా ఆన్ లైన్ టికెట్లు కొనుక్కొని లేదా కాలినడక ద్వారా తిరుమల దేవస్థానానికి వెళ్లి స్వామి వారిని దర్శించుకుని వస్తారు. వీరు వీఐపీలు కాదు, వీవీఐపీలు కాదు. సాధారణ భక్తులు. తిరుమల స్వామి వారిని రోజుకు లక్ష మంది భక్తులు దర్శించుకుంటే సుమారు 80 నుండి 85 శాతం మంది సాధారణ భక్తులే ఉంటారు. సుమారుగా 15 నుండి 20 శాతం మంది భక్తులు సిఫార్సు లేఖలతో వెళ్లే భక్తులు ఉంటారు. ఎమ్మెల్యేలు, టీడీడీ బోర్డు మెంబర్ల సిఫార్సులు లేదా చైర్మన్ సిఫార్సు లేఖలతో రికమండేషన్ మీద వీరు స్వామివారి దర్శనాలకు వెళుతుంటారు. వీరికి బ్రేక్ దర్శనం గానీ ఇతర సేవలు గానీ ఇస్తుంటారు. టీటీడీ ఆర్జిత సేవలు ధరలు భరించేది సాధారణ భక్తులు కాదు. ఎవరైతే రికమండేషన్ మీద వెళతారో వాళ్లకు మాత్రమే ఆర్జిత సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ ధరలు వారికి వర్తిస్తాయి. అంటే మొత్తం స్వామివారిని దర్శించుకునే వారిలో కేవలం 15 నుండి 20 శాతం మంది అదీ సిఫార్సు లేఖలతో స్వామివారి దర్శనానికి వచ్చే వారికి మాత్రమే అని టీటీడీ చెబుతోంది. సాధారణ, సామాన్య భక్తులు ఎవరూ సేవలకు వెళ్లరు. సేవలు చేయించుకోవాలని చూడరు. ఒక వేళ సేవ చేయాలని అనుకున్నా వారికి రికమండేషన్ లెటర్ కావాలి.

 

భారం 20 శాతం రికమండేషన్ భక్తులకు మాత్రమే

స్వామివారిని దర్శించుకునే 80 శాతం మంది భక్తులకు పెంచిన ఆర్జిత సేవల భారం తెలియదు. కేవలం 15 నుండి 20 మంది భక్తులకు మాత్రమే ఈ భారం పడుతుంది. కానీ దాని మీద జరుగుతున్న ప్రచారం. ఆ వీడియోలు బయటకు రావడంతో వారి చర్చల్లో రెండు వేలు కాదు, 2500లు చేయవచ్చు, అని మరొకరు పది వేలు చేయవచ్చు అని మాట్లాడుకోవడంతో ఇదేదో కూరగాయల సంతలా ఉంది అనేలా సల్లీ డిస్కషన్ జరుగుతోంది. కానీ ఇక్కడ వాస్తవం ఏమిటంటే కేవలం రికమండేషన్ మీద వచ్చే వాళ్లకు మాత్రమే. కేవలం వీఐపీ, వీవీఐపీ భక్తులకు మాత్రమే. అయితే ఇక్కడ టీటీడీ బోర్డు ఉద్దేశం ఏమిటంటే..రికమండేషన్ మీద వచ్చే ఈ భక్తులు ఎంతో కొంత పెట్టుకోగలరు, వీళ్లకు రేట్లు పెంచినా ఇబ్బంది లేదు అని టీటీడీ బోర్డు ఉద్దేశం. సాధారణ భక్తులకు భారం కలగకుండా టీటీడీకి ఆదాయం రావలి కాబట్టి రికమండేషన్ల మీద వచ్చే భక్తులకు మాత్రమే భారం వేశారు. టీటీడీ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దీనిపై వివరణ ఇచ్చారు. సామాన్య భక్తులకు ఎటువంటి భారం వేయలేదని తెలియజేశారు.

Related posts

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N