NewsOrbit
Telugu TV Serials న్యూస్

Karthikadeepam : మోనిత బండారం బట్ట బయలు… దీపను చంపేస్తా అంటున్న మోనిత..!

Karthika Deepam October 11 today episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1479ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది.ఇక ఈరోజు అక్టోబర్ 11న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.కార్తీకదీపం సీరియల్‌లో ప్రస్తుతం ప్లాష్ బ్యాక్ స్టోరీ నడుస్తుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో సంగారెడ్డి బతుకమ్మ పండుగ సంబరాల్లో పాల్గొనటానికి మోనిత, కార్తీక్ తో పాటు దీప, డాక్టర్ అన్నయ్య, వాళ్ళ అమ్మ, దుర్గ, వస్తారు. వాళ్ళతో పాటుగా సౌర్య వాళ్ళు కూడా వస్తారు.ఇక ఆ ఊరి పెద్ద అయిన రాజ్యలక్ష్మి గారు బతుకమ్మ సంబరాల్లో పాల్గొనాలని ప్రజలందరికి చెప్పడంతో అందరూ ఒక దగ్గరకు వస్తారు. మోనిత, దీప కూడా రావడంతో రాజ్యలక్ష్మి అసలు మీ ఇద్దరిది ఈ ఊరే కాదు.. ఎందుకు మోనిత కొత్త నాటకం ఆడుతున్నావ్ అనడంతో సీరియల్ మరింత ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. బతుకమ్మ సంబరాలు అయిపోయాక మీకు అదేంటో చూస్తాను అని రాజ్యలక్ష్మి అంటుంది.

దీపను చంపేస్తా అంటూ రగిలిపోతున్న మోనిత :

Monitha, deepa

ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. రాజ్యలక్ష్మి మాటలు విన్న మౌనిత ఒకసారిగా షాక్ అవుతుంది. అమ్మో ఈ మాటలు గనుక కార్తీక్ వినలేదు కదా అని వెనక్కి తిరిగి చూసేటప్పటికి అక్కడ కార్తీక్ ఉంటాడు.అట్లాగే పక్కకు తిరిగి చూసేసరికి శౌర్య ఏదురుపడటంతో అమ్మో శౌర్య వస్తుంది ఏంటి?అని చెప్పి హడావిడిగా కార్తీక్ ను పక్కకు తీసుకుని వెళ్ళిపోయి శివని పిలిచి ఆ దీపతో కార్తీక్ పిలుస్తున్నాడు రమ్మనమని చెప్పిస్తుంది. శివా వెళ్లి దీపమ్మ నిన్ను కార్తీక్ తెలుస్తున్నాడు అని పిలవడంతో దీప డాక్టర్ బాబు డాక్టర్ బాబు అంటూ బయటకు వస్తుంది సరిగ్గా అప్పుడే శౌర్య బతుకమ్మ జరిగే సంబరాల దగ్గరికి రావడంతో అక్కడ దీప కనిపించకపోవడంతో నిరాశతో వెను తిరుగుతుంది.

మోనిత, దీప మాటలను విన్న కార్తీక్ :

Monitha, karthik


ఇక దీప డాక్టర్ బాబు కోసం వెతుకుతుంటే మోనిత వచ్చి దీపతో గొడవ పడుతుంది. నా దీప మౌనితల సంభాషణను కార్తీక్ వెనకనుంచి వింటూ ఉంటాడు కానీ కార్తీక్ వింటున్న సంగతి దీప, మోనిత ఇద్దరూ గమనించరు. మోనిత ఆవేశంతో నా కార్తీక్ ను వదిలేసి. వెళ్ళిపో లేదంటే నీ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడను అంటూ దీపకు వార్నింగ్ ఇస్తుంది. కానీ దీప మాత్రం చాలా దైర్యంగా ఏమి చేసుకుంటావో చేసుకో నా నా డాక్టర్ బాబుని నా నుంచి ఎవరు విడదీయలేరు అని ఈరోజుతో నీ ఆటలు ముగిసాయి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక వెనక్కి తిరిగి మోనిత కార్తీక్ ను చూసి ఒకసారిగా షాక్ అవుతుంది. కార్తీక్ దగ్గరకు వచ్చి ఏంటి దీపను చంపేస్తానని బెదిరిస్తున్నావేంటి అంటాడు. అవును కార్తీక్ ఒకసారి చెప్పారు రెండుసార్లు చెప్పి ఆయన మనిద్దరి మధ్యన వచ్చి మనల్ని విడదీయాలని చూస్తే ఎవరినైనా సరే నేను ఇదే పని చేస్తాను అని గట్టిగా అంటుంది. ఇక కార్తీక కోపంగా చాలు మొనత ఎక్కువ మాట్లాడకు అయినా నాకు సంబంధం లేని ఊరిని నా ఊరు అని చెప్పి చెప్పింది నువ్వు. ఎందుకు ఇలా చేశావు? అసలు నువ్వా నా భార్యవి ఆ దీప అని గట్టిగా అడుగుతాడు. మోనిత మళ్ళీ రివర్స్ లో కార్తీక్ మీద. సీరియస్ అయ్యి వెళ్లి ఆ దీపకు చెప్పు మా జోలికి రాకు అసలే మోనితకు ఓపికతో పాటు సహనం కూడా చాలా తక్కువ అని చెప్పు అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది.

రాజ్యలక్ష్మి ఇంట్లో బతుకమ్మ సంబరాలు :

Rajyalakshmi


సీన్ కట్ చేస్తే రాజ్యలక్ష్మి వాళ్ళ ఇంట్లో అందరూ కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటారు. ఇక శౌర్య మాత్రం అమ్మ కనిపించలేదు అని చాలా బాధగా ఏడుస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే ఇంద్రమ్మ వచ్చి అమ్మా..ఆరోజు బస్సులో నీకు దాహం అయితే మంచి నీళ్లు ఇచ్చింది కూడా ఈవిడే అని చెప్పటంతో శౌర్య ఒకసారిగా ఏడుస్తూ అంత మంచి మనసు మా అమ్మకే ఉంటుంది.ఆవిడ తప్పకుండా మా అమ్మాయి అయి ఉంటుంది అని చెప్పి ఈసారి కనిపించినప్పుడు నాకు తప్పకుండా చెప్పండి అని అంటుంది శౌర్య.ఇక కార్తీక్ మోనిత మాటలు తలుచుకుని ఆలోచనలో పడతాడు. దీప వేసిన నాటకం నా గతానికి సంబందించినదే అయి ఉంటుంది. లేకపోతె నాకు ఎందుకు ఆ సంఘటనలు గుర్తుకు వస్తాయి. మోనిత చెప్పిన విషయాలు ఏవి కూడా గుర్తు రావడం లేదు. కానీ దీపతో ఉన్న జ్ఞాపకాలు మాత్రం గుర్తు వస్తున్నాయి. ఏమీ అర్థం కావట్లేదు అని తల పట్టుకుంటాడు

శివను కలిసిన సౌర్య

Sourya, siva

ఇక శివకు మోనిత మీద అనుమానంవస్తుంది. మా మేడం డబ్బులు ఇస్తుంది కదా అని ఆవిడ ఏ పని చెప్పిన చేయడం ఎంతవరకు న్యాయం.. పాపం దీపక్క అనుకుంటూ అసలు విషయం ఏంటో తెలుసుకుని ఏదోటి చేయాలి అని అనుకుంటే వెళ్తుంటే అప్పుడే సౌర్య వచ్చి శివను పలకరిస్తుంది. నన్ను గుర్తుపట్టారా అంకుల్ ఆరోజు రోడ్డు మీద వినాయకుడి బొమ్మలు అమ్ముతుంటే నా బొమ్మలన్నీ కొన్నారు కదా అని సౌర్య అనడంతో హ అవును అంటాడు శివ. మనసులో మాత్రం ఈ పాపను చూస్తే మేడం ఎందుకు కంగారు పడతారో తెలుసుకోవాలి అనుకుంటాడు. వీళ్ళను మోనిత చూసి కార్తీక్ గురించి దీప గురించి ఏమన్నా చెప్తాడా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక శివ మాత్రం ఆరోజు బొమ్మలు కొనమంది మా సార్ అని చెప్పడంతో అవునా ఆ రోజు నేను థాంక్స్ చెబుదామని అనుకున్నాను కానీ నేను వచ్చే సమయానికి కారు వెళ్లిపోయింది అంటే సరే పద నిన్ను మా సార్ దగ్గరికి తీసుకువెళ్తాను అని శివ అంటాడు.అప్పుడే మౌనిత శివకి ఫోన్ చేసి సైలెంట్ గా అక్కడి నుంచి వచ్చేసేయి లేదంటే నీ పని చెప్తాను అని బెదిరిస్తుంది. ఇక ఫోన్ పెట్టేసిన శివ సోర్యతో నాకు అర్జెంటు పని ఉంది ఆ పని చేయకపోతే మా మేడం నన్ను ఊరుకోరు అని చెప్పేసి అక్కడ వెళ్ళిపోతాడు ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ మెగుస్తుంది.

కార్తీక్ ను చూసిన వారణాసి:

Varanasi,karthik

ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో రాజ్యలక్ష్మి ఒంటరిగా ఉన్న కార్తీక్ దగ్గరికి వచ్చి మౌనిత, దీప ఇద్దరు కూడా నాకు తెలియదు కానీ మోనిత చెప్పే దానిలో నిజం లేదు. దీప చెప్పేదానిలోని నిజం ఉంది. నువ్వు దీప మాటలే విను అని చెప్పటంతో కార్తీక్ ఆలోచనలో పడతాడు.ఇక ఒక్కడే రాత్రి పూట నడుచుకుంటూ వెళుతూ ఉంటే అప్పుడే వారణాసి ఎదురుపడతాడు కార్తీక్ ని చూసిన వారనాసి డాక్టర్ బాబు మీరు బతుకే ఉన్నారా అనటంతో కార్తీక్ మళ్ళీ ఇదొక కొత్త నాటకం అనుకుని నేను ఎవరి మాటలను నమ్మను అని ఎవడ్రా నువ్వు అని చెప్పి వారణాసి కాలర్ పట్టుకుని నిలదీస్తాడు. ఇక వారణాసి తన ఫోన్లో ఉన్న కార్తీక్ దీప ఫోటోను కార్తీక్ కు చూపిస్తాడు. ఆ ఫోటో చూసి కార్తీక్ ఒక్కసారిగా షాక్ అవుతాడు

Related posts

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu