NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

Konijeti Rosaiah:  55 ఏళ్ల రాజకీయ ప్రస్థానం..! అవినీతి మరక లేదు – పార్టీ మార్పు లేదు..!!

Konijeti Rosaiah:  రాజకీయాల్లో తొలి తరం నేత కొణిజేటి రోశయ్య ఇక లేరు. దాదాపు ఆరు దశాబ్దాలపైగా క్రీయాశీల రాజకీయాల్లో కొనసాగిన ఆయన జీవితం నేటి తరం నేతలకు ఆదర్శ ప్రాయం. సుధీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న అవినీతి మరక అంటకుండా నిజాయితీ, నిబద్దతతో ఒకే పార్టీలో కొనసాగిన నేతగా రికార్డు సొంతం చేసుకున్నారు. కర్షక నాయకుడు ఎన్జీ రంగా శిష్యుడుగా పేరొందిన రోశయ్య స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు.

Konijeti Rosaiah political journey
Konijeti Rosaiah political journey

Konijeti Rosaiah:  1968 నుండి రాజకీయ ప్రస్థానం ఇలా..

కాంగ్రెస్ పార్టీ నుండి తొలి సారిగా 1968లో ఏపి శాసనమండలిలో అడుగుపెట్టారు. తరువాత రెండవ సారి 1974లో ఎమ్మెల్సీగా ఎన్నికైన తరువాత టంగుటూరి అంజయ్య మంత్రివర్గంలో రవాణ, గృహ నిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. మూడవ సారి 1980లో మూడవ సారి శాసనమండలి ఎన్నికైన తరువాత 1982లో కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గంలో హోంశాఖ బాధ్యతలు నిర్వహించారు. 1989లో ప్రకాశం జిల్లా చీరాల నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో ఆర్ధిక, రవాణా, విద్యుత్ శాఖలు, 1991లో నెదురుమల్లి జనార్ధనరెడ్డి ప్రభుత్వంలో ఆర్ధిక, ఆరోగ్య, విద్య, విద్యుత్ శాఖలను నిర్వహించారు. 1992లో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో ఆర్ధిక, ఆరోగ్య, విద్య, విద్యుత్ శాఖల మంత్రిగా పని చేశారు. 1995 నుండి 97వరకూ పీసీసీ అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహించారు. 1998లో గుంటూరు జిల్లా నరసరావుపేట లోక్ సభ సభ్యుడుగా ఎన్నికైయ్యారు. మరల 2004లో చీరాల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004, 2009 లో వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో ఆర్ధిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. వైఎస్ మరణానంతరం 2009 సెప్టెంబర్ 3 నుండి 2010 నవంబర్ 24వరకూ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగారు. తొలి నుండి కాంగ్రెస్ అధిష్టానానికి నమ్మిన వ్యక్తిగా ఉండటంతో 2011లో తమిళనాడు గవర్నర్ గా కేంద్రం నియమించింది. 2016 ఆగస్టు 30 వరకూ ఆయన గవర్నర్ గా సేవలు అందించారు.

అయిదు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలోనే..

రాజకీయాల్లో విలువలు ఉన్న నేతగా రోశయ్యకు పేరు ఉంది. పదవుల కోసం పార్టీలు మారే నాయకులు ఉన్న నేటి రాజకీయాల్లో అధికారంలో ఉన్నా లేకున్నా ఒకే పార్టీలో కొనసాగారు. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీలోని అనేక మంది సీనియర్ నాయకులు పార్టీ వీడి బయటకు వెళ్లినా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న కొద్ది మంది నేతల్లో రోశయ్య కూడా ఒకరు. రోశయ్య కాంగ్రెస్ పార్టీకే కంకణబద్ధులుగా చివరి శ్వాస వరకూ ఉన్నారు.

అవినీతి ఆరోపణలు లేకుండా..

రాజకీయాల్లో అవినీతి ఆరోపణలు లేకుండా నెట్టుకురావడం చాలా కష్టం. కానీ రోశయ్య అయిదు దశాబ్దాలకు పైగా రాష్ట్ర స్థాయిలో అనేక పదవులు అలంకరించినా ఆయన పదవులకే వన్నె తెచ్చారు. ప్రత్యర్ధులు కూడా ఆయనపై ఏనాడూ అవినీతి ఆరోపణలు చేసే వాళ్లు కాదు. రాజకీయాలకు అతీతంగా ఆయన వద్దకు ఎవరు వెళ్లినా పని చేసేవారు. అనేక వర్గాల అభిమానాన్ని ఆయన సొంతం చేసుకున్నారు. ప్రత్యర్ధి పార్టీ నేతలు కూడా రోశయ్య వ్యక్తిత్వాన్ని గౌరవించేవారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju