Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో సిగరెట్లు తాగుతూ కెమెరాల కంటపడ్డ లేడీస్ కంటెస్టెంట్స్..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ స్టార్ట్ కావటంతో తెలుగు టెలివిజన్ ప్రేక్షకులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. కరోనా కారణంగా ఎంటర్టైన్మెంట్ కోరుకునే ఆడియన్స్ సినిమా థియేటర్లకు వెళ్ళలేని పరిస్థితి ఉండటంతో చాలా వరకూ బిగ్ బాస్ షో పట్ల ఆసక్తి ఎక్కువ చూపిస్తున్నారు. ఇదే తరుణంలో టిఆర్పి రేటింగ్ లలో కూడా గతానికి మించి సీజన్ ఫైవ్ కి మంచి ఆదరణ తగ్గుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రారంభమయ్యే ఈ రెండు రోజులు కావడంతో 19 మంది ఇంటి సభ్యులు లోన ఉన్న నేపథ్యంలో.. ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠభరితమైన టెన్షన్ ప్రేక్షకుల్లో నెలకొంది.

Bigg Boss 5 Telugu: Hamida, Lobo, Sarayu Enjoy In Smoking Zone - Sakshi

ఇదిలా ఉంటే హౌస్ లో అడుగు పెట్టి 24 గంటలు కాకముందే ఎలిమినేషన్ అంటూ ఇంటి సభ్యులకు ట్విస్ట్ బిగ్బాస్ ఇవ్వటంతో ఇంటిలో ఇప్పుడు రసవత్తరమైన వాతావరణం నెలకొంది. దీంతో ఎవరికి వారు టెన్షన్ పడుతూ ఉన్నారు. చాలా సిల్లీ రీజన్ లతో ఎలిమినేషన్ కి నామినేషన్ చేయడం జరిగింది. పరిస్థితి ఇలా ఉండగా ఇంటి లో పది మంది అమ్మాయిలు తొమ్మిది మంది అబ్బాయిలు ఉండగా.. వీరిలో కొంతమంది అమ్మాయిలు తాజాగా స్మోకింగ్ జోన్ లో.. రూమ్ లో దమ్ము కొడుతూ.. కనిపించారు. ఈ సీన్  ఆన్ సీన్ ఎపిసోడ్ లో.. కనిపించడం జరిగింది.

 

ఇప్పటివరకు ఎటువంటి సీన్ తెలుగు బిగ్ బాస్ లో.. కనిపించకపోవటంతో చూస్తున్న వీక్షకులు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. వాళ్ళు ఎవరో కాదు కంటెస్టెంట్ లు హమీద, సరియు. యాంకర్ లోబో తో… చక్కగా స్మోకింగ్ జూన్ లో ముచ్చట్లు పెట్టుకుంటూ ఇద్దరు బామలు దమ్ము లాగుతూ కనిపించారు. గుప్పు గుప్పు మని పొగలు వదులుతూ ఇంటిలో ఉన్న ప్రస్తావిస్తూ.. తమదైన శైలిలో మాట్లాడుకున్నారు. అనంతరం కన్వర్జేషన్ మొత్తం అయిపోయిన తర్వాత.. కొంతమంది సిగరెట్లను భద్రంగా కవర్లో దాచుకున్నారు. రోజు సిగరెట్లు సప్లై చేస్తారో లేదో అంటూ హమీద అనుమానం వ్యక్తం చేయడంతో… పక్కనే ఉన్న లోబో… లేదు లేదు ఖచ్చితంగా సిగరెట్ లు వస్తాయి.. దానికి టెన్షన్ పడే అవసరంలేదు అని తెలిపాడు. దీంతో ఈ ఎపిసోడ్ చూసిన వీక్షకులు ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయి షాక్ అవుతున్నారు.

 

ఇక ఇదే తరుణంలో లోబో హౌస్ లో ఓ రేంజిలో రెచ్చిపోతున్నారు. విషయంలోకి వెళితే.. సిరితో లోబో కి గొడవ అయింది. తనతో జరిగిన వాగ్వాదం సిరి.. హన్మంత్ తో… మాట్లాడుతూ ఉండటంతో .. దమ్ముంటే డైరెక్ట్గా తనతో చెప్పాలని లోబో. గట్టిగా అరావటం జరిగింది. ఈ క్రమంలో కొద్దిగా ఎటకారంగా లోబో…సిరి నీ హేళన చేయడంతో పాటు.. నీ మొఖం ఒక సారి అద్దంలో చూసుకో అంటూ లోబో డైలాగ్ వేయడం జరిగింది. దీంతో సిరి ఆవేశపడి వెంటనే నీ మొఖం పగిలిపోద్ది అంటూ లోబో కి గట్టిగా కౌంటర్ ఇవ్వటంతో ఇద్దరి మధ్య వాగ్వాదం.. మరింతగా పెరిగిపోయింది. ఏది ఏమైనా మూడో రోజు బిగ్ బాస్ హౌస్ లో.. భారీగానే గొడవలు జరిగాయి. యనీ మాస్టర్ కి జెస్సీ మధ్య..తో పాటుగా లోబో..సిరి కి అదే రీతిలో… కాజల్ కి లహరి ల మధ్య భీకరమైన పోరు సాగింది. మొత్తంమీద మూడో రోజుకి ఇంటిలో భారీగానే గొడవలు జరగడం తో పాటు కొంతమంది ఏడ్చే కార్యక్రమం కూడా స్టార్ట్ చేశారు.


Share

Related posts

చలికాలం పిల్లలను ఇలా జాగ్రత్తగా కాపాడుకోండి.. లేదంటే?

Teja

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ని అంత మాట అన్నందుకు చెంప చెళ్లుమనిపించిన.. బిగ్ బాస్ కంటెస్టెంట్..!!

sekhar

Ram: మరో సరికొత్త పాత్ర చేయడానికి రెడీ అవుతున్న రామ్..??

sekhar