NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ బిగ్ స్టోరీ

పోలీసులు పై పోలీసుల వార్

 

 


నంద్యాల ఆటో డ్రైవర్ సలాం కుటుంబ ఆత్మ హత్య కేసులో వింత కోణాలు జరుగుతున్నాయి. సాక్షాత్తు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కున్న సిఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధరంలను సస్పెండ్ చేయడమే కాకుండా , వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలనీ ఆదేశించిన తరువాయి వారిపై కేసులను నమోదు చేసిన పొలిసు ఉన్నతాధికారులు … అంతే పటిష్టంగా న్యాయమూర్తి ఎదుట కస్టడీ కోరలేదు. దింతో వెంటనే వారికీ బెయిల్ లభించింది. ఒక్క రోజులోనే బెయిల్ రావడం మరో రచ్చకు దరి తీసే అవకాశం ఉండటంతో పోలీసులు మేల్కొన్నారు. సిఐ, కానిస్టేబుల్ బెయిల్ రద్దు చేయాలనీ వారు బయట ఉంటె కేసు విచారణ లో ప్రభావం చూపుతుందని పిటిషన్ దాఖలు చేసారు.

ఇదే మొదటిసారి !!

పోలీసులపై పోలీసులే కోర్టులో రివ్యూ పిటిషన్ వేయడం ఇది తొలిసారి. సీఎం ఈ కేసులో ఉన్నతాధికారులకు తగిన సూచనలు ఇవ్వడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. మొదటి కేసుని 306 సెక్షన్ కింద నమోదు చేసి, న్యాయమూర్తి ఎదుట పోలీసులు ఈ కేసులో ఇలాంటి విచారణ లేదని, నిందులకు బెయిల్ ఇవ్వవచ్చని చెప్పిన అనంతరమే బెయిల్ మంజూరు అయ్యింది. నాన్బెయిల్ కేసు అయినా 306 కేసులో వెనువెంటనే బెయిల్ రావడానికి అవకాశం ఉండదు. కనీసం 14 రోజుల జుడీషియరీ రిమాండ్ అయినా ఇస్తారు. అయితే పోలీసులు ఈ కేసులో నిందితులుగా ఉండటంతో పాటు ఉద్యోగాల నుంచి సస్పెండ్ కావడంతో పోలీసులు న్యాయమూర్తి ఎదుట కేసులో నిందితులు బయట ఉన్న పెద్ద నష్టం ఉండదని చెప్పడంతోనే వెంటనే బెయిల్ మంజూరు అయి ఉంటుంది అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. 10 సంవత్త్సరాల శిక్ష పడే 306 సెక్షన్ కేసును పోలీసులు సొంత వారి మీద ప్రేమతోనే ఎదో చేద్దామనుకుంటే.. అది ఇంకేదో అయ్యింది.

మళ్లీ పిటిషన్ !!

గతంలో కేసు విషయంలో నిందితులు బయట ఉన్న పెద్ద ప్రభావం చూపారని న్యాయమూర్తికి చెప్పిన నోటితోనే నిందితులు సాక్షులను ప్రభావితం చేస్తారని, వెంటనే బెయిల్ రద్దు చేయాలనీ కోరాల్సి రావడం వాళ్ళ న్యాయమూర్తి ముందు చివాట్లు తప్పవు. ఒకవేళ రివ్యూ పిటిషన్ అంగీకరించకపోతే, నిందితుల తరఫు న్యాయవాదులు కల్పించుకుంటే మాత్రం ఇన్వెస్టిగేషన్ అధికారికి తలనొప్పులు తప్పవు. మరో పక్క రివ్యూ అంగీకరించలేదు అంటే ఉన్నతాధికారుల నుంచి తలంట్లు ఉంటాయి. దీనిలో పోలీసులు మొదట సక్రమంగా వ్యవహరించి ఉంటె ఎవరికీ ఇబ్బందులు తప్పవు.

మారతారా మిగిలిన వారు ?

సలాం కుటుంబం ఆత్మ హత్య కేసు రాష్ట్ర పోలీసులు నేర్చుకోవాల్సిన పెద్ద పాఠం. కేసు విచారణలో నిబంధనలు పట్టించుకోకుండా, ఇష్టానుసారం చేస్తే ఇలాంటి ఫలితాలు ఉంటాయి అనేది ఈ కేసు ద్వారా తెలుసుకోవాలి. పోలీసుల్లో నిందితుల పట్ల ఇలాంటి వైఖరి అవలంన ఉండకూడదు అనేది గుర్తించాలి. దేనికోసమో పాకులాడి మొత్తం కెరీర్ నాశనం చేస్కునే దిశగా సిఐ, హెడ్ కానిస్టేబుల్ ఇరుక్కున్న వ్యవహారం మిగిలిన వాళ్ళు వంట బట్టించుకుంటే మేలు.

 

author avatar
Special Bureau

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju