NewsOrbit
జాతీయం న్యూస్

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

Lok sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంట‌ల వ‌ర‌కు కొన‌సాగింది. పలు చోట్ల స్వల్ప ఉద్రిక్తతలు మినహా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయింది. ఓటింగ్ కోసం ఉద‌యం నుంచే ఓట‌ర్లు పోలింగ్ కేంద్రాల వ‌ద్ద బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వేస‌వి కావ‌డంతో తొలి రెండు గంట‌ల‌లోనే ఓటు హ‌క్కు వినియోగించుకునేందుకు త‌ర‌లి వచ్చారు.

రెండో విడతలో దేశంలోని 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 88 లోక్‌సభ స్థానాలకు ఓటింగ్‌ను నిర్వహించారు. వాస్తావానికి 89 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించాల్సి ఉండగా 88 స్థానాల్లోనే పోలింగ్ జ‌రిగింది. మధ్యప్రదేశ్‌లోని బేతుల్ స్థానం నుంచి బరిలోకి దిగిన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థి అశోక్ భలవి ఈ నెల 9న మృతి చెందారు. దీంతో అక్కడ జరగాల్సిన ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం మూడో దశకు (మే 7వ తేదీకి) వాయిదా వేసింది.

కేరళ, పశ్చిమ బెంగాల్ లోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలలో లోపాలు, బోగస్ ఓట్లతో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. మరో వైపు ఉత్తరప్రదేశ్ లోని మథుర, రాజస్థాన్ లో బన్స్ వారా, మహారాష్ట్ర, త్రిపురలోని పర్భానిలలో పలు గ్రామాల్లో వివిధ కారణాలతో ఓటర్లు పోలింగ్ ను బహిష్కరించి నిరసన తెలిపారు.

రాష్ట్రాల వారీగా సాయంత్రం 5 గంటల వరకూ ఉన్న పోలింగ్ శాతం చూసుకుంటే.. అస్సొంలో 70.66 శాతం పోలింగ్ నమోదు కాగా, బీహార్ లో 53.03, చత్తీస్ గఢ్ 72.13, జమ్ముకశ్మీర్ 67.22, కర్ణాటక 63.97. మధ్యప్రదేశ్ 54.83, మహారాష్ట్ర 53.51, మణిపూర్ 76.06, రాజస్థాన్ 59.19, త్రిపుర 77.53, ఉత్తరప్రదేశ్ 52.74, పశ్చిమ బెంగాల్ 71.84 శాతం చొప్పున పోలింగ్ నమోదైంది. మూడోదశ ఎన్నికలు 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 94 నియోజకవర్గాల్లో మే 7న జరగనున్నాయి. మొత్తం ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.

బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 41 మంది రోగులు పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు. వారు ఓటు వేసేందుకు ఆసుపత్రి యాజమాన్యం తో ప టు ప్రభుత్వ అధికార యంత్రాంగం సహకరించింది. అంబులెన్స్ సర్వీసులను అందుబాటులో ఉంచి గ్రీన్ కారిడార్లను ఏర్పాటు చేశారు. రోగుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి వైద్యుల అనుమతి పొందాకే రోగులను ఓటు వేయడానికి వెళ్లేందుకు పంపించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju