NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Maa Elections: “మా” ఎలక్షన్ హైలెట్స్.. “మా” అధ్యక్షుడిగా మంచు విష్ణు..!!

Maa Elections: ఈ ఏడాది జరిగిన “మా” అధ్యక్ష ఎన్నికలు చాలా రసవత్తరంగా సాగాయి. “మా” అధ్యక్ష పదవి కోసం పోటీ పడిన విష్ణు… ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యుల మధ్య మాటల తూటాలు భారీ స్థాయిలో జరిగాయి. విష్ణు ప్యానల్ కి చెందిన సభ్యులు… లోకల్ వాళ్లనే గెలిపించుకోవాలని.. ప్రకాష్ రాజ్ పై నాన్ లోకల్ ముద్ర వేయడంతోపాటు అదేరీతిలో జనంలోకి బలంగా తీసుకెళ్లడంతో.. ఈ నినాదం బాగా వర్కవుట్ అయినట్టు.. ఎన్నికల ఫలితాలలో తేలింది. ఇదే సమయంలో ప్రచారంలో కూడా ఇండస్ట్రీకి చెందిన చాలామంది పెద్దలు సీనియర్ హీరోలు కూడా… తెలుగు వాడినే “మా” అసోసియేషన్ అధ్యక్షుడు కావాలనేని  విష్ణుకి ప్రముఖులు మద్దతు తెలిపారు. నందమూరి బాలయ్య బాబుతో పాటు కోట శ్రీనివాసరావు.. పలువురు మంచు విష్ణు కి సపోర్ట్ గా నిలిచారు.

Bitterness between Prakash Raj, Vishnu Manchu intensifies ahead of MAA elections | Entertainment News,The Indian Express

ఇటువంటి ఉత్కంఠభరితమైన వాతావరణంలో ఈసారి జరిగిన ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలలో ఉన్న మా అసోసియేషన్ సభ్యులు ప్రత్యేక విమానంలో వచ్చి కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, నాగార్జున, రామ్ చరణ్.. ఓటు వేయగా మిగతా చాలామంది టాప్ హీరోలు ఎన్టీఆర్ మహేష్ ప్రభాస్ వంటి వారు.. ఓటింగులో పాల్గొనలేదు. “మా”అధ్యక్ష ఎన్నికలు ఈరోజు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 3:30 వరకు.. జరిగాయి. చెదురుమదురు ఘటనలు మినహా.. ఎన్నికలు చాలా ప్రశాంతంగా సాగాయి.  ఇటువంటి తరుణంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ.. స్టార్ట్ కాగా.. ప్రారంభంలో ప్రకాష్ రాజ్ ప్యానల్ కి చెందిన సభ్యులు.. గెలుస్తూ ఉండటం తో విష్ణు ప్యానల్ లో.. అంతరంగంగా ఆందోళన మొదలైంది.

Latest Telugu cinema news |Telugu Movie reviews|Tollywood

వార్ వన్ సైడ్

అయితే కొద్దిసేపటికే విష్ణు ప్యానల్ కి చెందిన సభ్యులు గెలుస్తూ రావడంతో… ఊహించని విధంగా ఎనిమిది మంది సభ్యులు తెలుపు తో స్టార్ట్ అయిన విష్ణు… విజయం పరంపర.. చివరి వరకు కొనసాగింది. మా అధ్యక్ష పోల్ లో..వార్ వన్ సైడ్ అన్న తరహాలో మంచు విష్ణు విజయం సాధించారు. ప్రకాష్ రాజ్ ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలో వైస్ ప్రెసిడెంట్ గా ప్రకాష్ రాజ్ ప్యానల్ కి చెందిన శ్రీకాంత్ గేలవడం జరిగింది.

Pawan Kalyan's Warning To Mohan Babu!

“మా” ఎన్నికల మొత్తానికి హైలెట్ ఇదే..!!

ఈ ఎన్నికలు ప్రచారం జరగక ముందు “రిపబ్లిక్” ప్రీ రిలీజ్ వేడుకలో… పవన్ కళ్యాణ్… మోహన్ బాబు ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేయడం జరిగింది. ఈ తరుణంలో మోహన్బాబు తన పై పవన్ చేసిన వ్యాఖ్యలకు మా ఎన్నికలు జరిగిన తర్వాత కౌంటర్ ఇస్తానని క్లారిటీ ఇచ్చారు. అయితే సరిగ్గా ఎన్నికల పోలింగ్ టైం లో.. పవన్ కళ్యాణ్ ఓటు హక్కు వినియోగించుకోవడానికి రాగానే మోహన్ బాబు పవన్ ఇద్దరు కూడా ఆలింగనం చేసుకుని… చాలావరకు జనాలకు దూరంగా వెళ్లి కాసేపు మాట్లాడుకోవడం జరిగింది. ఇద్దరు చాలా నవ్వుతూ ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. అనంతరం మంచు మనోజ్ నీ… చాలా ఆప్యాయంగా పవన్ కళ్యాణ్ దగ్గర తీసుకుని కౌగిలించుకుని కాసేపు మాట్లాడుతూ.. మా ఎన్నికలకి సరికొత్త వాతావరణం క్రియేట్ చేశారు. ఇక ఇదే తరుణంలో పోలింగ్ జరుగుతున్న సమయంలో మంచు విష్ణు.. ప్రకాష్ రాజు కూడా కాసేపు మాట్లాడుకొని… సామరస్య వాతావరణంలో.. ప్రచారం లో జరిగిన విషయాలను..చాలా లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

మాకు ఈ ధైర్యం చాలు: Pawan Kalyan Big Hug To Manchu Manoj At MAA Elections | Daily Culture - YouTube

మెగా కుటుంబం సపోర్టు ఉన్నాగాని

ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ ఎన్నికలలో.. రికార్డు స్థాయి ఓటింగ్ నమోదైంది. 900 మందికి పైగా ఉన్న “మా” సభ్యులు.. ఈసారి ఓటింగ్ ప్రక్రియ లో ఆరు వందలకు పైగానే ఓటు హక్కును వినియోగించుకోవడం సంచలనంగా మారింది. ప్రకాష్ రాజ్ ప్యానల్ కి.. మెగా కుటుంబం సపోర్టు ఉన్నాగాని.. మంచు విష్ణు గెలవటం ఇండస్ట్రీలో ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. మెగా కుటుంబం తరఫున మెగా బ్రదర్ నాగబాబు ప్రకాష్ రాజ్ తరుపున ప్రచారంలో కీలకంగా వ్యవహరించారు. ఎలక్షన్ చివరిలో.. పలు టీవీ ఛానల్ లకి… ఇంటర్వ్యూ ఇస్తూ మంచు విష్ణు పై.. తీవ్ర స్థాయిలో విమర్శలు వర్షం కురిపించారు. మంచు విష్ణు కి తెలుగు రాదని… సెటైర్లు కూడా వేయడం జరిగింది.

Vishnu Manchu and Naga Babu talk about Tollywood casting couch row - Movies News

నాగబాబుకు విష్ణు కౌంటర్

ఇక అదే సమయంలో ప్రకాష్ రాజ్ జాతీయ స్థాయి నటుడు అని.. లోకల్ నాన్ లోకల్ అని మాట్లాడటం తప్పు అని ఖండించారు. ఈ తరుణంలో తన పై నాగబాబు చేసిన వ్యాఖ్యలకు మంచు విష్ణు చివరిలో వీడియో సందేశం ఇవ్వటం జరిగింది. మెగా కుటుంబంతో మంచి రిలేషన్ ఉందని… ఇటువంటి ఎన్నికల విషయంలో ఆ రిలేషన్ చెడగోట్టుకోవడం తనకు ఇష్టం లేదని… వరుణ్ తేజ్ నీ… ఇలానే విమర్శిస్తే ఊరుకుంటారా అంటూ.. విష్ణు కూడా నాగబాబు కి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. అదే విధంగా ప్రకాష్ రాజ్… విష్ణు పై దారుణంగా కూడా విమర్శలు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ మార్నింగ్ షో కలెక్షన్ అంత బడ్జెట్ విష్ణు సినిమాకి ఉండదని సెటైర్లు వేశారు. ఏదిఏమైనా గత కొన్ని రోజుల నుండి మా అధ్యక్ష పీఠం కోసం.. సాగిన రసవత్తరమైన పోరులో… మంచు విష్ణు విజయం సాధించడం.. ఇండస్ట్రీలో సెన్సేషనల్ గా మారింది. 11 మంది ఎగ్జిక్యూటీవ్ మెంబర్స్‌గా గెలిచారు. విష్ణు ప్యానల్‌కు చెందిన ఏడుగురు మాత్రమే ఈసీ సభ్యులుగా గెలిచారు. జరిగిన ఈ “మా “ఎన్నికలలో 925 మందిలో 673 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఎన్నికల అధికారి చివరిలో అధికారికంగా స్పష్టం చేశారు. ఈ ఓటింగ్ ప్రక్రియలో ప్రకాష్ రాజ్ కి 274 ఓట్లు పోలైనట్లు.. మంచు విష్ణుకి 381 ఓట్లు పోలైనట్లు.. దీంతో 107 ఓట్ల తేడాతో.. ప్రకాష్ రాజ్ పై విష్ణు విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. 

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N