Maa Election Results: ప్రకాష్ రాజ్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఇదే ..!

Share

Maa Election Results: ఎన్నో ఆశలతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేసిన ప్రకాష్ రాజ్ కి నిరాశే ఎదురైంది. మంచు విష్ణు చేతిలో దాదాపు 400 ఓట్ల తేడాతో ఘోర పరాజయం పాలయ్యారు. కనీస పోటీ కూడా ఇవ్వకపోవడంతో ప్రకాష్ రాజ్ మొహం చిన్నబోయింది. ప్రస్తుతం ఓటింగ్ కేంద్రంలో విష్ణు పేరు మార్మోగుతోంది. జూబ్లీహిల్స్ ప్రాంతమంతటా బాణసంచాతో హోరెత్తిస్తున్నారు విష్ణు మద్దతుదారులు. ఈ క్రమంలో మీడియా ముందుకు వస్తానని మోహన్ బాబు ప్రకటించినట్లు సమాచారం.

Maa Elections: విష్ణు గెలవడానికి అసలు సిసలైన కారణం ఇదే..!

ప్రకాష్ రాజ్ అందుకే ఓడిపోయారా

మొదటి నుంచీ ప్రకాష్ రాజ్ పై ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. తెలుగు వాడు కాని ప్రకాష్ రాజ్ కి ఓటు వేయడం ఏంటని ప్రత్యర్థులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోట శ్రీనివాస రావు, బాబు మోహన్, నరేష్ తదితరులు ప్రకాష్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చాలా మంది ప్రకాష్ రాజ్ పై వ్యతిరేకత కనబరిచారు. అయితే ప్రాంతీయ భేదాలు లేవంటూ అతనికి సపోర్ట్ చేయడానికి కొందరు టాలీవుడ్ ప్రేక్షకులు ముందుకు వచ్చారు. వీరులో నాగబాబు సైతం ఉన్నారు. మొత్తం మెగా కుటుంబం ప్రకాష్ రాజ్ కే మద్దతు ఇస్తున్నారని నాగబాబు చెప్పుకొచ్చారు. అయితే ఆఖరి నిమిషంలో నాగబాబు గతంలో చేసిన ఒక ట్వీట్ సంచలనం రేకెత్తించింది. కొంతకాలం క్రితం నాగబాబు చేసిన ఓ ట్వీట్ ప్రకాష్ రాజ్ ని ఘోరంగా అవమానించేలా ఉంది. అతను ప్రకాష్ రాజ్ ని కుహనా మేధావి అని… దర్శక నిర్మాతలను, నిర్మాతలను డబ్బుల కోసం హింసించిన దుర్మార్గుడి అని పిలిచారు. దీంతో ఇది కూడా ప్రకాష్ రాజ్ ని విజయానికి దూరం చేసింది.

MAA election: మా ఎలక్షన్ల ఆఫీస్ లోకి అడుగు పెట్టగానే.. పవన్ కల్యాణ్‌ని చూసి మోహన్‌బాబు ఒకే ఒక మాట అన్నారు..!

లోకల్ నాన్ లోకల్ అనే సమస్య కూడా ఇక్కడ ఎదురైంది. చాలా మంది పేద కళాకారులు మంచు విష్ణుకే ఓటు వేయడానికి ప్రాధాన్యం చూపినట్టు అర్థమవుతోంది. ప్రకాష్ రాజ్ ను నటుడిగా అంగీకరిస్తాం కానీ అధ్యక్షుడిగా మాత్రం భావించలేము అని కొందరు బాహాటంగానే చెప్పుకొచ్చారు. అందులోనూ జగన్ కి బంధువులైన విష్ణు ఏపీలోని టాలీవుడ్ ఇండస్ట్రీ సమస్యలను తొలగిస్తారని చాలామంది భావించారు. ప్రకాష్ రాజ్ గెలిస్తే చిరంజీవి పెత్తనం నడుస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు. గతంలో చిరు వల్ల పేద కళాకారులకు ఆశించినంత స్థాయిలో సహాయం అందలేదని.. అందుకే ఈసారి విష్ణు కే చాలా మంది ఆర్టిస్టులు మొగ్గు మొగ్గుచూపుతున్నట్లు కూడా టాక్ నడిచింది.

ఇక ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఎగ్జిక్యూటివ్ వైట్ ప్రెసిడెంట్ గా శ్రీకాంత్.. ఆఫీస్ బ్యారర్లుగా ముగ్గురు గెలిచారు. విష్ణు ప్యానెల్ నుంచి ఐదుగురు ఆఫీస్ బ్యారర్లుగా గెలుపొందారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి 10 మంది ఈసీ సభ్యులు.. విష్ణు ప్యానెల్ నుంచి 8 మంది ఈసీ సభ్యులు గెలుపొందారు. ట్రెజరర్ గా శివబాలాజీ విజయం సాధించారు.


Share

Related posts

బిగ్ బాస్ 4: ఈసారి ప్రైజ్ మనీ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు…??

sekhar

పాపం..! టీఆరెస్ నాయకుల కక్కుర్తికి..! తేరుకోలేకపోతున్న కేసీఆర్..!!

Srinivas Manem

Naga Chaitanya: సమంత ని ఫాలో అయిపోతున్న చైతు??

Naina