Madhuranagarilo October 17th ఎపిసోడ్ 185: నీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు అని ఒకే ఒక కారణంతో తనని దూరం పెట్టకూడదు కరెక్ట్ కాదు నిన్ను ఎంతగానో ప్రేమించే శ్యామ్ సారు నిన్ను ఎక్కడ దూరం చేసుకుంటాను అని భయపడి ఇలా చేశారు అంతే కానీ ఇంక వేరే ఏమీ లేదు ఇంక నువ్వు ఏమీ ఆలోచించకు రాదా అని స్వప్న అంటుంది. దానికి ఇంకా కొంచెం టైం పడుతుంది అప్పుడు ఆలోచిద్దాంలే అని రాదా అంటుంది. నువ్వు ఇంకా శ్యామ్ సార్ గురించి ఆలోచిస్తూ ఉంటే పండుకి నీకు అన్యాయం జరిగిపోతుంది కాళ్లదాక వచ్చిన అదృష్టాన్ని కాదనకూడదు రాదా అని స్వప్న అంటుంది. స్వప్న అలా అనగానే రాధా ఆలోచించడం మొదలు పెడుతుంది. కట్ చేస్తే ఏంటండీ ఏమో ఆలోచిస్తున్నారు అని రాధ వాళ్ళ అమ్మ అంటుంది. ముందు రాదని పిలువు అని వాళ్ళ నాన్న అంటాడు. ఏమండీ నేను చెప్పేది కాస్త వినండి అని రాధ వాళ్ళ అమ్మ అంటుంది. నేను రాధ తో మాట్లాడాలి ముందు నువ్వు రాదని పిలువు అని వాళ్ళ నాన్న అంటాడు.

ఆ మాట విని అటుగా వెళుతున్న రాదా వచ్చి నాన్న చెప్పండి ఏదో మాట్లాడాలని అంటున్నారు అని అంటుంది.అదే అమ్మ పండు ఆరోగ్యం గురించి అని కంగారుపడుతూ శ్యాముని చూసిన వాళ్ళ నాన్న అంటాడు. నువ్వు పండు విషయంలో బాధపడకు నాన్న బావ దొరకకపోయినా శ్యామ్ సారు ఆ ఏర్పాట్లు చేస్తున్నాడు అని రాదా అంటుంది. అవును మామయ్య గారు ఇక పండు గురించి మీరేమీ టెన్షన్ పడకండి ప్రశాంతంగా ఉండండి అని శ్యామ్ అంటాడు. కొన్ని విషయాలకు ప్రశాంతత ఉండదు బాబు రాధా ఇక మేము వెళ్తాము అని వాళ్ళ నాన్న అంటాడు. ఏంటి బావగారు అప్పుడే వెళ్ళిపోతారా ఇక్కడ ఉండబుద్ధి కాకపోతే చెప్పండి వేరే ఇల్లు ఏర్పాటు చేస్తాను అని ధనుంజయ్ అంటాడు.

ఏమి అవసరం లేదు కొంచెం పని ఉంది అందుకే వెళ్తున్నాం అని రాధ వాళ్ళ నాన్న అంటాడు. అయితే పదండి మామయ్య గారు మిమ్మల్ని కారులో డ్రాప్ చేస్తాను అని శ్యామ్ అంటాడు. ఏమి అక్కర్లేదు మేము ఆటోలో వెళ్తాం ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి అని వాళ్ళ నాన్న వెళ్లిపోతాడు. ఏంటి నాన్న ప్రవర్తన ఈ మధ్య చాలా తేడాగా ఉంది అని రాదా అనుకుంటుంది. కట్ చేస్తే పండు గిఫ్ట్ లని ఓపెన్ చేసి చూస్తూ ఇన్ని గిఫ్ట్లు వస్తాయి అని తెలిస్తే మంత్లీ కి ఒక బర్త్డే చేసుకునేవాన్ని అని అంటాడు. నెలకొకసారి ఎందుకురా వారానికి ఒకసారి చేసుకో అని ధనుంజయ్ అంటాడు. వీన్ని చూస్తూ ఉంటే మన శ్యామ్ కొడుకే అనిపిస్తుంది అండి అని మధుర అంటుంది. శ్యామ్ కొడుకే అని ధనుంజయ్ అంటాడు. అమెరికా నుంచి వచ్చిన తర్వాత వాడు పెళ్లి వద్దన్నాడు కానీ రాదు లాంటి మంచి కోడలు తెచ్చి మన ఇంటికి కోడల్ని చేశాడు మన అదృష్టం అండి అని మధురం అంటుంది.

ఇది మన అదృష్టం కాదు మధుర రాధ చేసుకున్న అదృష్టం అందుకే ఈ ఇంటికి కోడలు అయ్యిది అని ధనుంజయ్ అంటాడు. కట్ చేస్తే రాదా గదిలో కూర్చుని శ్యామ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. శ్యాము వచ్చి చూసి వెళ్ళిపోతూ ఉంటాడు.సామ్ సార్ నీ గురించి ఆలోచిస్తున్నాను ఆగండి అని రాదా అంటుంది. నా గురించి ఆలోచిస్తున్నావా ఏంటి అని శ్యామ్ అంటాడు. ఇంకా రాలేదేంటి మీరు వస్తే మీకు భోజనం పెడదామని ఎదురు చూస్తున్నాను అని రాదా అంటుంది. శ్యామ్ ఫ్రెష్ అప్ అయి వస్తాడు రాదా భోజనం వడ్డిస్తుంది. ఇంతలో మధురా ధనంజయ్ వచ్చి ఏంట్రా ఇంత లేట్ అయింది ఎక్కడికి వెళ్లావు అని అంటారు. పండు బర్త్డే జరిపించాం కాదమ్మా అందరికీ పేమెంటు ఇవ్వడానికి వెళ్లాను లేటయింది అని శ్యామ్ అంటాడు. రాధా నువ్వు కూడా తినమ్మా అని మధుర అంటుంది. అదేంటి రాధ ఇంకా భోజనం చేయలేదా అమ్మ అని శ్యామ్ అంటాడు. ఎలా తింటుంది రా తను నీ భార్య నువ్వు తినమ్మా రాదా ఇంకా మనం ఇక్కడ ఎందుకండి వాళ్ళిద్దరు తింటారులే వెళ్ళిపోదాం పద అని వాళ్ళు వెళ్ళిపోతారు. సారీ రాధా నువ్వు తినేసావనుకొని నేను అడగలేదు అని శ్యామ్ అంటాడు.

దానికి సారీ ఎందుకు అని రాదా అంటుంది. నేను నీ భర్తను కదా అడగడం నా ధర్మం కదా అని శ్యామ్ అంటాడు. పొద్దున్నే లేవాలని మామయ్య గారు చెప్పారు తినండి అని రాదా అంటుంది.కట్ చేస్తే ఇంతలో తెల్లవారుతుంది పంతులుగారు వచ్చి రాధా శ్యామ్ చేత పరిహార పూజ చేయించి వేపచెట్టు రాగి చెట్టు నాటిస్తాడు అయ్యా దీనితో సత్యనారాయణ వ్రతంలో జరిగిన అపరాధం పరిహారం అయిపోయింది ఇకనుంచి అంతా శుభమే జరుగుతుంది అని పూజారి గారు దీవిస్తాడు.హమ్మయ్య ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉందండి ఇక వాళ్ళని హనీమూన్ కి పంపించొచ్చు అని రాదని శ్యామును పిలిచి మీరు హనీ మూన్ వెళ్తున్నారు అని మధురం అంటుంది. ఇప్పుడు హనీమూన్ కు ఎందుకు అని రాదా అంటుంది. అదేంటి అలా షాక్ అవుతారు వెళ్లకపోతే షాక్ కావాలి గానీ వెళ్తే ఎందుకు అని మధురం అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది