Malli Nindu Jabili September 18: గౌతమ్ లోపలికి వెళ్లబోతుండగా సార్ ఆగండి, సార్ ఎవరిని లోపలికి రానివ్వద్దన్నాడు అని ఆఫీస్ బాయ్ అంటాడు. లేదు నేను అర్జెంటుగా వెళ్లాలి అని అరవింద్ అంటాడు. సార్ చెప్పినట్టు వినకపోతే మీ ఉద్యోగం నా ఉద్యోగం రెండు పోతాయి సార్ నన్ను క్షమించండి అని ఆఫీస్ బాయ్ అంటాడు. లోపలికి వెళ్ళకుండా దూరం నుంచే చూస్తాడు అరవింద్. చాలా ఇంకెక్కడైనా పెట్టాలా అని మల్లి అంటుంది. నేను సంతకం పెట్టు అనగానే ఎందుకు ఏమిటి అని అడగకుండా సంతకం పెట్టేశావు నా మీద ఎంత నమ్మకం మల్లి అని గౌతమ్ అంటాడు. మీరు పెట్టమంటే ఎక్కడైనా పెడతాను అది ఏంటి ఎందుకు అని నేను అడగను మీరు అంటే నాకు అంత నమ్మకం అని మల్లి అంటుంది.

అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం మల్లి అని గౌతమ్ అంటాడు.సరే నేను వెళ్తానండి అని మల్లి అక్కడి నుండి వెళ్ళిపోతుండగా అరవింద్ పిలిచి మల్లి నువ్వేం చేసావో నీకు అర్థం అవుతుందా గౌతమ్ ని నమ్మి నువ్వు గుడ్డిగా సంతకం పెట్టావు అది దేని మీద నీకు తెలియలేదా అని అరవింద్ అంటాడు. గౌతమ్ బాబు నా భర్త ఆయన ఎక్కడ సంతకం పెట్టమంటే నేను అక్కడ పెడతాను ఆయన మీద నాకు అంత నమ్మకం అని మల్లి అంటుంది. అందుకే నిన్ను భార్యగా వద్దని విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టించుకున్నాడు లాయర్ గారితో మాట్లాడుతుండగా నేను విన్నాను అని అరవింద్ అంటాడు. మీకు గౌతమ్ బాబు అంటే కోపం అందుకనే అలా మాట్లాడుతున్నారు ఆయన అలా చేయరు అని మల్లి అంటుంది. కావాలంటే వెళ్లి ఆ పేపర్స్ ను చూసుకో మల్లి మంచిగా మాట్లాడాడని ప్రేమగా దగ్గర తీసుకున్నాడని నువ్వు నమ్మి సంతకం పెట్టావు నీకు గౌతమ్ ఏ క్షణం ఎలా ఉంటాడో నీకు అర్థం కావట్లేదు అని అరవింద్ అంటాడు.

మీరు చెప్పింది అబద్ధం అని తెలిస్తే తర్వాత వచ్చి ని సంగతి చెప్తాను అని మల్లి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మల్లి అక్కడికి వచ్చిందని చూసుకోకుండా లాయర్ తో మాట్లాడుతూ గౌతమ్ ఉంటాడు. ఏంటి శ్రీమతి నేను పిలవకుండానే వచ్చావు అని గౌతమ్ అంటాడు. నేను ఇందాక పేపర్స్ మీద సంతకం పెట్టాను కదా అవి ఒకసారి చూడొచ్చా ఒక్కసారి ఇలా ఇవ్వండి అని మల్లి అంటుంది. అదేంటి మల్లి నా మీద అంత నమ్మకం ఉంది అన్నావు కదా మరి ఇప్పుడు ఏంటి ఇలా పేపర్స్ అడుగుతున్నావు అని గౌతమ్ అంటాడు. ఇప్పుడు ఆ నమ్మకానికి ఒక పరీక్ష అందుకనే అడుగుతున్నాను ఒకసారి ఇవ్వండి ఇప్పుడు నేను ఏమి చెప్పలేను అని మల్లి అంటుంది. సరే మల్లి ఈ విషయం ఎప్పటికైనా తెలవాల్సిందే కదా అని పేపర్లు తీసి ఇస్తాడు గౌతమ్.

ఆ పేపర్లను మల్లి చదివి షాక్ అవుతుంది. ఏంటి మల్లి ఆ పేపర్లు చదివాక నన్ను ఏమైనా అడగాలని అనిపిస్తుందా అడుగు నేను నీకు సర్ప్రైస్ చేద్దాము అనుకున్నాను కానీ ఈ లోపు నువ్వే అడిగేసావు అని గౌతమ్ అంటాడు.అక్కడి నుండి ఏమి మాట్లాడకుండా మల్లి వచ్చేస్తుంది. అది చూసిన అరవింద్ మల్లి ఆ పేపర్లు చదివావా అందులో ఏమి రాసి ఉంది నీకు ఇప్పటికైనా అర్థమైందా అని ఆత్రుతతో అడిగి ఇప్పుడు ఏం చేద్దాం అని అనుకుంటున్నావు అని అరవింద్ అంటాడు.

నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావ్ మమ్మల్నిద్దర్నీ విడగొడదామనుకుంటున్నావా నేను ఆ పేపర్లు చదివాను నా పేరు మీద ల్యాండ్ కొన్నవి అవి అని మల్లి అంటుంది. అవి ప్రాపర్టీ పేపర్స్ కావు మల్లి డివోర్స్ పేపర్స్ సరిగ్గా చదివావా లేదా అని అరవింద్ అంటాడు. నువ్వు నన్ను పంపించి మంచి పని చేశావు నా భర్త ఏంటో నాకు అర్థం అయింది నేను సంతకం పెట్టింది ల్యాండ్ వే నేను పాటికీ పది సార్లు చూశాను అని మల్లి అంటుంది. మల్లి నీకు వేరేవి చూపించాడు ఇంకోసారి మనం వెళ్లి చూద్దాం పద అని అరవింద్ అంటాడు. మీ మీద నాకు గౌరవం ఉంది కాబట్టి నోరు ముయ్యండి అని అనలేకపోతున్నాను గౌతమ్ సార్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడని మీరు గౌతమ్ ని ఇబ్బంది పెట్టాలని నన్ను పాముల వాడుకోకండి అని మల్లి అంటుంది.

నీ మేలు కోరే నన్ను అలా అంటావా మల్లి నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది అని అరవింద్ అంటాడు. మంచి చేస్తున్నాను అని నాకు కీడు చేస్తున్నారు ఇంకోసారి నా విషయంలో జోక్యం చేసుకోకండి అని మల్లి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇలాగే గొడవలు పడండి ఎందుకంటే నన్ను మీరు మోసం చేశారు కాబట్టి రివేంజ్ ఇలా తీర్చుకుంటున్నాను అని గౌతమ్ తన మనసులో అనుకుంటాడు. కట్ చేస్తే అమ్మ మల్లి స్వప్న విషయంలో జరిగింది గుర్తు పెట్టుకొని గౌతం నీ మీద కోప్పడితే నువ్వు ఏమి ఇబ్బంది పడకు వాడిని నువ్వే అర్థం చేసుకోవాలి అని కౌసల్య అంటుంది. కానీయండి లేకపోతే అన్నయ్య వచ్చేస్తాడు అని నీలిమా అంటుంది. ఇంతలో గౌతమ్ వచ్చేస్తాడు ఏంటి మల్లిని కొత్త పెళ్లికూతుర్ల తయారు చేస్తున్నారు అని గౌతమ్ అంటాడు. ఒరేయ్ గౌతమ్ మీకు పెళ్లిఅయ్యి కొన్ని రోజులే అవుతుంది ఈ సంతోషాలు మళ్లీమళ్లీ రావు రా అందుకనే ఈ ఏర్పాట్లు అని కౌసల్య అంటుంది.

మా అమ్మ చెల్లి నిన్నే సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను చెప్పేది ఏమీ లేదు అని గౌతమ్ అంటాడు. ఆగండి మీ చేతి మీద ఉన్న ఈ గాయం ఎలా అయ్యింది నిజం చెప్పండి లేకపోతే నా మీద ఒట్టే అని మల్లి అంటుంది. చిన్న గాయమే కదా ఇప్పుడు అంత అంత పెద్ద మాటలు ఎందుకు అని గౌతమ్ అంటాడు.అవున్రా గౌతమ్ నేను మాటల్లో పడి చూసుకోలేదు అసలు ఏం జరిగింది అని కౌసల్య అంటుంది. ఏమీ లేదమ్మా దారిలో వస్తుంటే రౌడీలు ఎటాక్ చేశారు నన్ను నేను కాపాడుకునే ప్రయత్నంలో ఈ గాయం అయ్యింది అని గౌతమ్ అంటాడు.బిజినెస్ ప్రాసెస్ లో అయ్యిందా లేదంటే గ్యాంగ్ స్టార్ ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తున్నారా అని కౌసల్య అంటుంది. అమ్మ పోలీసులు లాగా ఇంట్రాగేషన్ చేయకు అమ్మ నిజం తెలిస్తే మల్లి బాధపడుతుంది అని గౌతమ్ అంటాడు. నేనెందుకు బాధపడతానండి మిమ్మల్ని కొట్టిన వాళ్లని వెళ్లి నిలదీస్తాను అని మల్లి అంటుంది.అవును మల్లి అరవింద్ పంపించిన రౌడీలు అని నాకు అర్థమైంది అందుకే చెప్పలేకపోతున్నాను అని గౌతమ్ అంటాడు. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది