NewsOrbit
ట్రెండింగ్

US F-35: యుద్ద విమానం కనిపించడం లేదు…ఆచూకీ ఇవ్వండి అమెరికా ప్రకటన.. నవ్వుతున్న దేశాలు..!!

Advertisements
Share

US F-35: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా అమెరికా గురించి అంతర్జాతీయ మీడియా అభివర్ణిస్తూ ఉంటది. ఇదే రీతిలో ప్రపంచంలో ఎటువంటి దేశం పైన అయినా ఆధిపత్యం చెలాయించే రీతిలో.. అమెరికా దేశానికి చెందిన నాయకులు వ్యవహరిస్తూ ఉంటారు. పెట్రోల్ మరియు డీజిల్ వంటి వాటికోసం మిడిల్ ఈస్ట్ లో అమెరికా దెబ్బకి చాలా దేశాలు నామరూపాలు లేకుండా పోయాయి. కొన్ని దేశాల గొడవలలో శాంతిని నెలకొల్పటానికి అంటూ పెద్దన్న పాత్ర పోషిస్తామంటూ.. ఆ దేశాల వనరులను దోచేస్తూ ఉంటది. అభివృద్ధికి సంబంధించి అమెరికా అన్ని రంగాలలో ఎలాగైతే ముందు వరుసలో ఉంటుందో అదే రీతిలో… మిగతా దేశాలపై ఆధిపత్యం విషయంలో.. వ్యవహరిస్తది. తనకు ఎదురు తిరిగితే ప్రపంచ పటంలో ఆ దేశాలు కనుమరుగేయాలా దాడులు చేస్తూ ఉంటాది. సూపర్ పవర్ కంట్రీ గా పిలవబడే అమెరికాతో… కయ్యం పెట్టుకోవడానికి ఏ దేశాలు కూడా ముందుకు అడుగు వేయవు. శత్రువులు డొంకలలో ఉన్న బంకర్లలో ఉన్న.. వెతికి మరి వేటాడి చంపేస్తది.

Advertisements

The announcement from us authorities America us F35 Jet Fighter plane missed

ఈ రీతిగానే ఒకానొక టైములో ఒసామా బిన్ లాడెన్ నీ చంపడం జరిగింది. రాత్రికి రాత్రి అమెరికా నుండి ఎవరికి తెలియకుండా యుద్ద విమానాలలో పాకిస్తాన్ లో ప్రవేశించి.. లాడెన్ నీ మట్టు బెట్టింది. అటువంటి అమెరికాలో ఇప్పుడు ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. అమెరికా దేశానికి చెందిన యుద్ధ విమానం కనిపించడం లేదని ఎవరైనా ఆచూకీ తెలిస్తే చెప్పాలని ఆ దేశ సైనిక అధికారులు ఆన్ లైన్ లో అధికారిక ప్రకటన చేయటం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యుద్ధ విమానం F35 ఫైటర్ జెట్ విమానం. సాంకేతికంగా అత్యాధునిక సౌకర్యాలతో నింగిలోను మరియు భూమి మీద వినియోగించే రీతిలో రూపొందించడం జరిగింది. కేవలం ఒకరు మాత్రమే ప్రయాణించే వీలున్న F35 యుద్ధ విమానంలో సింగిల్ ఇంజన్ మాత్రమే ఉంటుంది. ఏలాంటి వాతావరణ పరిస్థితులను అయినా అధిగమించే సామర్థ్యం దీనికి ఉంది. శత్రువుల యొక్క రూపాలను మరియు వారి రాడార్ సాంకేతికతలను గుర్తించగలుగుద్ది. ఇందులో ప్రయాణించే ఏకైక పైలెట్ హెల్మెట్ మీద కెమెరా కూడా ఉంటుంది.

Advertisements

The announcement from us authorities America us F35 Jet Fighter plane missed

అటువంటి ఈ శక్తివంతమైన యుద్ధ విమానం ఇటీవల పోయినట్లు అమెరికా సైనిక అధికారులు అధికారిక ప్రకటన చేయటం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. యూఎస్ మెరైన్ కార్ప్స్ పైలట్ నార్త్ చార్లెస్టన్ మీదుగా విమానం పోనించగా ఒక్కసారిగా ఫైటర్ జట్ నుండి పైలట్ పారాషూట్ ద్వారా బయటకి వచ్చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ తప్పిపోయిన యుద్ధ విమానం ఏమైపోయింది..? ఎక్కడ పడిపోయింది అన్నదానిపై… అన్వేషిస్తూ ఉన్నారు. సరిగ్గా ఈ సంఘటన జరిగిన చోట్ల రెండు సరస్సులు ఉన్నాయి దానిలో గాలిస్తున్నారు. అయితే ఆ పైలట్ జెట్ విమానం.. కిందకు దింపకుండా ఒక్కసారిగా గాలిలో ఉండగా బయటపడటానికి.. గల కారణం గురించి అధికారులు ఇంకా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో విమానాన్ని గుర్తించే విషయంలో ప్రజల సహాయం కోసం సైనిక అధికారులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు. ట్రైనింగ్ పిరియడ్ లో రెండు యుద్ధ విమానాలు విన్యాసం చేస్తూ ఉండగా.. ఈ దురదృష్టకర సంఘటన చోటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఎంతో అత్యంత టెక్నాలజీ ఖరీదైన ఈ యుద్ధ విమానం పోయిందని అమెరికా అధికారిక ప్రకటన చేయడం పట్ల ప్రపంచ దేశాలు నవ్వుతున్నాయి. మరోపక్క ఈ ఘటన వెనకాల అమెరికా ఏదో కుట్ర చేస్తుందని అమెరికా శత్రు దేశాలు ఆరోపిస్తున్నాయి. ఏది ఏమైనా ప్రపంచ పెద్దన్నగా పిలవబడే అమెరికా F35 యుద్ధ విమానం జాడ కనిపించడం లేదని ప్రకటన చేయటం సంచలనం సృష్టిస్తుంది.


Share
Advertisements

Related posts

సుమ, అలీ కలిసి ఆ టాలీవుడ్ ఆర్టిస్ట్ ను ఇలా ఎగతాళి చేశారు..! వయసుకు కూడా లేదా గౌరవం?

arun kanna

గోల్ మిస్.. రహీమ్ స్టెర్లింగ్ పై నెటిజన్ల మీమ్స్..!

Varun G

వామ్మో.. పవన్ కళ్యాణ్ ”వాచ్” విలువ అన్ని లక్షలా?

Teja